ఆధునిక ప్రపంచంలో
మనిషికి విలువ లేదు

బతుక్కు భద్రత లేదు
ప్రాణాలకు భరోసా లేదు

భావ ప్రకటన స్వేచ్ఛ లేదు
ఊపిరిలు పీల్చే వీలు లేదు

ఈ భూతలం ఆసాంతం
మానవ హక్కుల హననం
యధేచ్చగా జరుగుతుంది

పుట్టుకతో సంక్రమించిన
జీవన హక్కుల కుత్తుకపై
కత్తులు వేలాడుతున్నాయ్‌

‌జాతి మతం కులం ప్రాంతం
బాషా రంగు రూపాల పేరిట
వివక్షతలు పెట్రేగుతున్నాయ్‌

‌పుట్టుక సంపద ప్రమాణంగా
అంతరాలు పెరుగుతున్నయ్‌

‌మనుసులంతా ఒక్కటేనని
ఎంత గొప్పగా నినదించినా
వాస్తవంలో మాత్రం శూన్యం

చట్టాలు కమిషన్లు ఎన్నున్నా
హక్కుల హననం యధాతదం

యేటేటా దినోత్సవాల పేరిట
సంబురాలు జరుపుకుంటేనే
వికృత సంస్కృతి వీగిపోదు

ఇకనైనా యావత్‌ ‌ప్రపంచం
మానవ హక్కుల పరిరక్షణకై
సమిష్టిగా ఉద్యమం సాగిస్తేనే

స్వేచ్చ సమానత్వం సార్వత్రికం
మానవాళి వికాసం విశ్వజనీనం

(డిసెంబర్‌ 10 ‌న హ్యూమన్‌ ‌రైట్స్ ‌డే సందర్భంగా…)
– కోడిగూటి తిరుపతి, 9573929493

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *