హైదరాబాద్‌లో పలుచోట్ల కుండపోత
లోతట్టు ప్రాంతాలు జలమయం…ప్రజలకు ఇబ్బందులు
అప్రమత్తంగా ఉండాలని ట్రాఫిక్ పోలీసుల ఆదేశాలు
రెండ్రోజల పాటు వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరిక
కాళేశ్వరం వద్ద మరోమారు పొంగి ప్రవహిస్తున్న గోదావరి
శ్రీశైలానికి ఎగువ నుంచి వరదతో నేడు గేట్లు ఎత్తివేతకు రంగం సిద్ధం
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 22 : శుక్రవారం ఉదయం నుంచి రాష్ట్రంలోని పలు ప్రాంతాలతో పాటు హైదరాబాద్‌లో మరోమారు భారీవర్షం కురుస్తుంది. తెలంగాణలో భారీ వర్షలు కురుస్తాయని ఇప్పటికే వాతావరణశాఖ హెచ్చరించింది. తెల్లవారుజాము నుంచి కుండపోత వర్షం మొదలయ్యింది. ద్రోణి ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వాతావరణం పూర్తిగా మారిపోయింది. ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమైంది. దీంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మళ్లీ వర్షాలు కురుస్తున్నాయి. రోడ్లపై వరద నీరు ప్రవహిస్తుంది. మరోవైపు ద్రోణి ప్రభావంతో రెండ్రోజుల పాటు చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాలకు హెచ్చరికలు జారీ అయ్యాయి. నల్గొండ జిల్లాలోని తెల్ దేవరపల్లిలో అత్యధికంగా 6 సెంటీ వి•టర్ల వర్షం పడగా… కరీంనగర్ జిల్లాలలో 5.4 సెంటీ వి•టర్ల వర్షం కురిసింది. నిజామాబాద్ జిల్లా బాల్కొండ, మేడిపల్లిలో 4 సెంటీవి•టర్ల వర్షం పడింది. జగిత్యాల జిల్లా గొల్లప్లలె, నిర్మల్ జిల్లా వాద్యాల్లో 3 సెంటీ వి•టర్ల వర్షం కురిసింది. ముఖ్యంగా సంగారెడ్డి, రంగారెడ్డి, హైదరాబాద్, యాదాద్రి, సూర్యాపేట, నాగర్ కర్నూల్, నల్గొండ జిల్లాలోని పలు ప్రాంతాల్లో తెలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. హైదరాబాద్‌లోని సికింద్రాబాద్, అల్వాల్, మాదాపూర్, గచ్చిబౌలి, మియాపూర్, కూకట్ పల్లి, చందానగర్, తార్నాక, బాలానగర్, జీడిమెట్ల, బంజారాహిల్స్, ఫిల్మ్‌నగర్, యూసఫ్‌గూడ, అవి•ర్‌పేట్, ఎస్సార్ నగర్, పంజాగుట్ట, ఎర్రగడ్డ, జూబ్లీహిల్స్, మసాబ్ ట్యాంక్, కాచిగూడ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.
భారీ వర్షంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కున్నారు. వర్షం కారణంగా నగరంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. తెల్లవారుజాము నుంచే నగరవ్యాప్తంగా వర్షం కురియడంతో రోడ్డెక్కిన వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు కలిగాయి. రోడ్లపై ఎక్కడికక్కడ వర్షపు నీరు వొచ్చి చేరడంతో పలుచోట్ల ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో ఆఫీసులకు వెళ్లే వారు ప్రయాణాన్ని గంట పాటు వాయిదా వేసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. వర్షం తగ్గుముఖం పట్టినా రోడ్లపై వాటర్ క్లియర్ చేసేందుకు సమయం పడుతుందని పోలీసులు తెలిపారు. రోడ్లపై నెమ్మదిగా వెళ్ళమని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సూచనలు చేశారు. కాళేశ్వరం పుష్కరఘాట్ వద్ద 10.960 వి•టర్ల ఎత్తులో గోదావరిప్రవహిస్తుంది. వరద ప్రవాహం ఎక్కువగా ఉండటంతో అధికారులు లక్ష్మీ(మేడిగడ్డ) బ్యారేజీలోని మొత్తం 85 గేట్లు ఎత్తి నీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం బ్యారేజీ ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 7,15,140 క్యూసెక్కులుగా ఉంది. అటు సరస్వతి(అన్నారం) బ్యారేజీలోని మొత్తం 66 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 44,480 క్యూసెక్కులుగా ఉంది. బ్యారేజీ పూర్తి సామర్థ్యం 0.23 టీఎంసీలకు గాను ప్రస్తుత నీటి మట్టం 0.16 టీఎంసీలుగా కొనసాగుతుంది. ఇదిలావుంటే శ్రీశైలం డ్యాంకు వరద పరవళ్లు తొక్కుతుంది. గత కొద్ది రోజులుగా కృష్ణా నది పరివాహక ప్రాంతాల్లో విస్తారంగా కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం డ్యామ్ నీటిమట్టం వడివడిగా పెరుగుతూ గరిష్ట నీటిమట్టానికి చేరుకుంది. ఎగువన అటు కృష్ణానదిపై జూరాల నుంచి..మరో వైపు తుంగభద్ర నదిపై నిర్మించిన సుంకేసుల నుంచి భారీ స్థాయిలో వరదనీరు పరవళ్లు తొక్కుతూ శ్రీశైలానికి చేరుకుంటుంది. డ్యామ్ పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 881 అడుగులుగా ఉంది. అలాగే డ్యామ్ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 195.21 టీఎంసీలు నిల్వ ఉంది. ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. శనివారం శ్రీశైలం డ్యామ్ గేట్లు తెరచి నీటి విడుదల ప్రారంభించనున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.




