అలసట లేని పవనంలా,
ఉవ్వెత్తున లేచే కెరటంలా
తుళ్ళి తుళ్ళి పడుతూ
నెమలి నాట్యంలోని పరవశం,
కోయిలగానంలోని తన్మయత్వం,
దూకే జలపాతంలోని
తోకముడవని తత్వాలు
పొదువుకొని
సాగేదే కవిత్వం.
అదొక స్వేచ్ఛా విహంగం,
భావోద్వేగం,
రాగ ప్రవాహం,
అనుభవం,
అనుభూతుల సమాహారం.
ప్రశ్నించే పదశరాలతో
నిద్రాణమైన జనాన్ని
జాగృతం చేస్తూ
విలక్షణ రూపంతో
పరుగులు తీసే కవిత్వం
ఓ స్పందన,
జగతికి సంరక్షణ.
ఉవ్వెత్తున లేచే కెరటంలా
తుళ్ళి తుళ్ళి పడుతూ
నెమలి నాట్యంలోని పరవశం,
కోయిలగానంలోని తన్మయత్వం,
దూకే జలపాతంలోని
తోకముడవని తత్వాలు
పొదువుకొని
సాగేదే కవిత్వం.
అదొక స్వేచ్ఛా విహంగం,
భావోద్వేగం,
రాగ ప్రవాహం,
అనుభవం,
అనుభూతుల సమాహారం.
ప్రశ్నించే పదశరాలతో
నిద్రాణమైన జనాన్ని
జాగృతం చేస్తూ
విలక్షణ రూపంతో
పరుగులు తీసే కవిత్వం
ఓ స్పందన,
జగతికి సంరక్షణ.
ప్రశంసలు వరించినా,
కారుమబ్బుల్లా
విమర్శలే కమ్ముకొచ్చినా,
ఎవరూ స్పందించకున్నా
తన హృదయ మేధోమదనంలో
ఆవిష్కృతమైన భావాలను
అక్షరీకరించే,
పదాల నాదాన్ని నినదించే
కవికి కళ్ళు కలమే,
సమాజాన్ని చూడగల నేర్పుకు
నిదర్శనం అక్షరాలే.
ప్రకృతిలా ఇవ్వడమే తప్ప
ఆశించడం తెలియని,
అనుభూతి చెందడమే తప్ప
అడగడం ఎరుగని
కవుల జీవితమంతా
అక్షర ప్రయాణమే…
– వేమూరి శ్రీనివాస్, 9912128967
తాడేపల్లిగూడెం




