- పార్టీ కండువా కప్పిన కేంద్రమంత్రి భూపేంద్ర యాదవ్
- కార్యక్రమంలో పాల్గొన్న తరుణ్ చుగ్, కిషన్ రెడ్డి, లక్ష్మణ్
న్యూ దిల్లీ: మునుగోడు ఉప ఎన్నికకు ముందే టీఆర్ఎస్కు షాక్ ఇచ్చిన మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ బుధవారం బీజేపీలో చేరారు. ఆయన కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ సమక్షంలో బీజేపీ కండువా కప్పుకున్నారు. బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ చుగ్ సమక్షంలో ఆయన బీజేపీ కండువా కప్పుకున్నారు. కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ చేతుల వి•దుగా బీజేపీ సభ్యత్వం తీసుకున్నారు. బూర నర్సయ్యగౌడ్‌తో పాటు కాంగ్రెస్ నేత వడ్డేపల్లి నర్సింగ్‌రావు కుమారుడు కూకట్పల్లి నియోజకవర్గానికి చెందిన వడ్డేపల్లి రాజేశ్వర్‌రావు, పీసీసీ సెక్రటరీ వెంకటేష్ ముదిరాజ్, టీడీపీ నేత రవిప్రకాశ్ యాదవ్ తదితరులు కాషాయ కండువా కప్పుకున్నారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, ఎంపీ కె లక్ష్మణ్, డీకే అరుణ, ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే రాజకీయాల్లోకి వొచ్చానని మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ తెలిపారు.
టీఆర్ఎస్ ఎంపీగా ఉన్నప్పుడు కేంద్రలోని బీజేపీ ప్రభుత్వ చొరవతోనే భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పనులు చేశానన్నారు. ప్రధాని మోడీ స్ఫూర్తితో సబ్ కా సాత్ సబ్ కా వికాస్ నినాదంతో ముందుకు పోతానని చెప్పారు. ‘అందరి తెలంగాణ, అభివృద్ధి తెలంగాణ’ కోసం పనిచేస్తానని వెల్లడించారు. కొందరి కోసమే తెలంగాణ ఏర్పడలేదన్నారు. రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తేవడానికి కృషిచేస్తానని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో దేశం అభివృద్ధి చెందుతుందని కేంద్రమంత్రి భూపేందర్ యాదవ్ అన్నారు. తెలంగాణలో ప్రజల ఆకాంక్షలతో కూడిన ప్రభుత్వం ఏర్పాటు అవసరమని చెప్పారు. మునుగోడులో బీజేపీ భారీ మెజారిటీతో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ ఇచ్చిన దళిత బంధు ,దళితులకు మూడెకరాల భూమి హావి•లను ఇంత వరకు నెరవేరలేదన్నారు. తెలంగాణాలో వెనుకబడిన వర్గాల అభివృద్ధి జరగటం లేదన్నారు.




