బిజెపి సభకు ఆటంకాలు కలిగిస్తున్న టిఆర్‌ఎస్‌

  • బిజెపి అంటేనే భయ పట్టుకుందన్న కిషన్‌ ‌రెడ్డి
  • ఎవరెన్ని అడ్డంకుఉల సృష్టించినా సభ విజయవంతం
  • ఊరూ వాడ నుంచి భారీగా తరలి రానున్న ప్రజలు
  • మహారాష్ట్ర తరహాలో టిఆర్‌ఎస్‌ ‌పతనం తప్పదన్న లక్ష్మణ్‌

హైదరాబాద్‌,‌జూలై1 : బీజేపీ కార్యవర్గ సమావేశాలకు అధికార టీఆర్‌ఎస్‌ ‌పార్టీ ఆటంకాలు కలిగిస్తోందని కేంద్రమంత్రి కిషన్‌ ‌రెడ్డి విమర్శించారు. బిజెపి అంటే భయంతోనే ఈ చర్యలకు పాల్పడిందని అన్నారు. బిజెపి సభకు పెద్ద ఎత్తున నాయకులు,కార్యకర్తలు తరలి వస్తున్నారని, అలాగే ప్రజలు కూడా ఆసక్తి చూపుతున్నారని అన్నారు. శుక్రవారం ఉదయం పార్టీ నేతలతో కలసి పరేడ్‌ ‌గ్రౌండ్స్‌లో విజయ సంకల్ప సభ ఏర్పాట్లను కేంద్ర మంత్రి పరిశీలించారు. అనంతరం ఆయన డియాతో మాట్లాడుతూ… టీఆర్‌ఎస్‌ ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రధాని మోదీసభను విజయవంతం చేసి తీరుతామని స్పష్టం చేశారు. బీజేపీ కార్యాకర్తలను ఇబ్బందులు పెడితే చూస్తూ ఊరుకోమన్నారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసి టీఆర్‌ఎస్‌ ‌హార్డింగ్స్, ‌ప్లెక్సీలు ఏర్పాటు చేసిందని మండిపడ్డారు. ప్రజల ఆశీస్సులతో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు విజయవంతం చేస్తామన్నారు. ఎనిమిదేళ్ళుగా మోదీ చేస్తోన్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తామని తెలిపారు. కార్యవర్గ సమావేశాలు ప్రజల కార్యక్రమంగా నిర్వహిస్తున్నామని అన్నారు. మోదీ రాక కోసం తెలంగాణ సమాజం ఆసక్తిగా ఎదురుచూస్తోందన్నారు. ప్రధాని, అన్ని రాష్టాల్ర సీఎంలు ఒకేసారి రావటం అరుదైన సంఘటన అని కేంద్రమంత్రి కిషన్‌ ‌రెడ్డి పేర్కొన్నారు. ఎన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా బీజేపీని ఆపలేరని కేంద్రమంత్రి కిషన్‌ ‌రెడ్డ్ అన్నారు.

మరో రెండు రోజుల్లో హైదరాబాద్‌ ‌లో జరుగబోతున్నాయి. ఈ సభల కోసం ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని కిషన్‌ ‌రెడ్డి తెలిపారు. బీజేపీ సభల ప్రాముఖ్యతను తగ్గించాలని అన్ని విధాలుగా టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం ప్రయత్నిస్తోందిని ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రజలను, బీజేపీ గెలుపును ఎవరు ఆపలేరని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో పతనం ప్రారంభమైందని టీఆర్‌ఎస్‌, ‌కాంగ్రెస్‌ ‌నేతలపై కిషన్‌ ‌రెడ్డ్ ‌మండిపడ్డారు. మహారాష్ట్రలో శివ సేన పుత్ర వాత్సల్యంకు చూపిన ప్రేమ.. తెలంగాణలో కూడా అదే కాబోతుందని కిషన్‌ ‌రెడ్డి అన్నారు.తెలంగాణలో అధికారమే లక్ష్యంగా ప్రధాని మోదీ సభ ఉండబోతోందని బీజేపీ రాజ్యసభ సభ్యులు డాక్టర్‌ ‌లక్ష్మణ్‌ అన్నారు. తెలంగాణపై ప్రధాని మోదీ, నడ్డా , అమిత్‌ ‌షాలు ప్రత్యేక దృష్టి సారించారన్నారు. మరో ఏడాదిలో తెలంగాణలో రామరాజ్యం రావటం ఖాయమని స్పష్టం చేశారు. టీఆర్‌ఎస్‌ ‌పతనం ప్రారంభమైందని… హార్డింగ్స్, ‌ప్లెక్సీల విషయంలో టీఆర్‌ఎస్‌ ‌ది చిల్లర రాజకీయమని ఆయన మండిపడ్డారు.

రానున్న ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌, ‌కాంగ్రెస్‌ ‌కలసి పోటీ చేయనున్నాయని తెలిపారు. కాంగ్రెస్‌కు బీ పార్టీగా టీఆర్‌ఎస్‌, ఎంఐఎం‌లు వ్యవహరిస్తున్నాయన్నారు. కుటుంబ పార్టీలు కనుమరుగవటం ఖాయమని తెలిపారు. పుత్ర వాత్సల్యం వలన శివసేనకు పట్టిన గతే టీఆర్‌ఎస్‌కు పడుతుందని హెచ్చరించారు. ఆదివాసీ రాష్ట్రపతి అవుతుంటే టీఆర్‌ఎస్‌ ‌నాయకత్వం ఓర్వలేకపోతోందని మండిపడ్డారు. ఆదివాసీని రాష్ట్రపతిని చేస్తోన్న ఘనత 70 ఏళ్ళల్లో బీజేపీకి దక్కుతుందని లక్ష్మణ్‌ ‌పేర్కొన్నారు. ఈ కార్యక్రమలంలో కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్‌, ‌బీజేపీ కార్యవర్గ సభ్యులు వివేక్‌ ‌వెంకట్‌ ‌స్వామి పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *