- మాజీమంత్రి, ఎమ్మెల్యలే భూకబ్జాలపై ఫిర్యాదులు
- మల్లారెడ్డి, ఎమ్మెల్యేలపై చర్యలకు డిమాండ్
హైదరాబాద్,ప్రజాతంత్ర,జనవరి5: ప్రజావాణిలో ఎమమెల్యేలు, నాటి మంత్రుల భూ కబ్జాలపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. నగరంలో దానం నాగేందర్, మాజీమంత్రి మల్లారెడ్డిలు కబ్జాలకు పాల్పడ్డారని ఫిర్యాదు చేశారు. జ్యోతిరావు పూలే ప్రజాభవన్ ముందు మాజీ మంత్రి మల్లారెడ్డి బాధితులు ఆందోళన చేశారు. మేడ్చల్ జిల్లా గుండ్ల పోచంపల్లిలో సర్వేనెంబర్ 648/650లోని తమ భూములను మల్లారెడ్డి కబ్జా చేశారంటూ ఆరోపించారు. ప్రజావాణిలో తమ సమస్య విన్నవించేందుకు 600 మందికి పైగా బాధితులు వచ్చారు. శ్రీ మల్లికార్జున నగర్ వెల్ఫేర్ డెవలప్మెంట్ సొసైటీలోని తమ భూములను మల్లారెడ్డి అప్పటి తన అధికారాన్ని ఉపయోగించి కబ్జా చేసారని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి న్యాయం చేయాలని కోరారు. మల్లారెడ్డి నుంచి తమ భూములను కాపాడాలంటూ నినాదాలు చేశారు. మరో వైపు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు నుంచి తమ ప్లాట్లను కాపాడాలంటూ కాప్రా కృష్ణా నగర్ ప్లాట్ ఓనర్స్ నిరసన చేపట్టారు.
కాప్రా సర్వేనెంబర్ 647/1, 648/ 654లో భూమిని మంచిర్యాల ఎమ్మెల్యే కబ్జా చేశారంటూ ధర్నాకు దిగారు. సీఎం రేవంత్ రెడ్డి తమకు న్యాయం చేయాలని బాధితులు కోరారు. కాగా, ప్రజావాణికి భారీ స్పందన వస్తుంది. రాష్ట్రంలోని నలుమూలల నుంచి ప్రజావాణికి భారీగా జనం తరలివచ్చారు. ఇదే క్రమంలో మెదక్ జిల్లాలో ఉద్రిక్తత నెలకొంది. ప్రజా పాలన సమావేశం రసాభసగా మారింది. నర్సాపూర్ ఎమ్మెల్యే సునితా లక్ష్మారెడ్డి ముందు రైతలు ఆందోళనకు దిగారు. తమ భూములు కబ్జాకు గురైనా అధికారులు పట్టించు కోవడం లేదని ్గªర్ అయ్యారు. వివరాల్లోకి వెళితే మెదక్ జిల్లా శివ్వంపేట మండలం కొంతాన్ పల్లి గ్రామంలో ప్రజాపాలన కార్యాక్రమంలో ఎమ్మెల్యే సునితా లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడు తుండగా రైతులు ఆందోళన చేశారు. తమ భూములు కబ్జాకు గురయ్యాయని రైతులు ఎమ్మెల్యేను నిలదీశారు. కబ్జాదారులకు తాసిల్దార్ మద్దతిస్తున్నాడంటూ ఆరోపించారు. 10 సంవత్సరాల నుంచి అధికారుల చుట్టూ తిరుగుతున్న సమస్య పరిష్కారం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.





