‘ప్రజాతంత్ర’ ఆధ్వర్యంలో రౌండ్‌ టేబుల్‌

కాంగ్రెస్‌ పార్టీ 100 రోజుల పాలనపై  ప్రజాసంఘాల ‘నిగాహ్’ ..
హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి 29:  పాత అధికారానికి చెక్‌ పెట్టి తెలంగాణ ఇస్తామన్న హామీకి కట్టుబడి  రాష్ట్ర ఏర్పాటును సాకారం చేసిన కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావటానికి  ప్రజాసంఘాల విమర్శనాత్మకమైన ఆచరణే ఇతోధికంగా తోడ్పడినది.  ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వొచ్చి 100 రోజులు దాటింది. ఈ మూడు నెలల కాలంలో పాలన నుంచి మార్పు ఆశించడం  కొంచం అతి అయినప్పటికీ… అధికారంలో ఉన్న పార్టీ పాలనా తీరు పై… ప్రతిపక్షాల ఆరోపణల పై ఒక నిశిత దృష్టి అవసరం. అది ప్రజాసంఘాల ద్వారానే సాధ్యమన్న విశ్వాసంతో… కాంగ్రెస్‌ పార్టీ 100 రోజుల పాలనపై   ప్రజాసంఘాల ‘నిగాప్‌ా’..! పేరుతో  ‘ప్రజాతంత్ర’ ఆధ్వర్యంలో రౌండ్‌ టేబుల్‌ జరగనుంది.   నేడు హైదరాబాద్‌లోని  డా.బీ ఆర్‌ అంబేడ్కర్‌ రిసోర్స్‌ సెంటర్‌, సామ్రాట్‌ కాంప్లెక్స్‌, ఏజీ ఆఫీస్‌ ఎదురుగా, సైఫాబాద్‌లో జరిగే ఈ సమావేశంలో

ప్రొ. రమా మెల్కొటే (విశ్రాంత అధ్యాపకులు),  ప్రొ.హరగోపాల్‌ (టీపీజాక్‌), ప్రొ. కోదండరామ్‌ (టీజేఎస్‌), డా. కె. శ్రీనివాస్‌ (ఎడిటర్‌, ఆంధ్ర జ్యోతి), ఎన్‌. వేణుగోపాల్‌ (ఎడిటర్‌, వీక్షణం), వి. సంధ్య (పీవోడబ్ల్యూ), ఆర్‌. వెంకటరెడ్డి (ఎంవీఎఫ్‌),  ప్రొ. సూరేపల్లి సుజాత (దళిత విమెన్స్‌ కలెక్టివ్‌),  ఖలీదా పర్వీన్‌ (ముస్లిం సంఘాల జేఏసీ), రచన ముద్రబోయిన (మహిళా, ట్రాన్స్‌ జెండర్‌ సంఘాల జేఏసీ)తో పాటు.. తెలంగాణ విద్యావంతుల వేదిక, పాలమూరు అధ్యయన వేదిక, రైతు స్వరాజ్య వేదిక, నిరాశ్రయ శ్రామిక సంఘం, ప్రవాసి మిత్ర లేబర్‌ యూనియన్‌, గృహ కార్మికుల సంఘం, గార్బేజ్‌ వర్కర్స్‌ యూనియన్‌, మల్లన్నసాగర్‌ నిరాశ్రయుల వేదిక, డొమెస్టిక్‌ వర్కర్స్‌ యూనియన్‌, టీపీటీఫ్‌, మానవ హక్కుల వేదిక, తెలంగాణ ముస్లిం సంఘాల జేఏసీ, సఫా సొసైటీ, గ్రామ్య, దళిత స్త్రీ శక్తి, కోవా, భూమిక, డీబీఎఫ్‌, ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యు, సిసిసి, నేలమ్మా మహిళా రైతుల సంఘం, మహిళా రైతుల హక్కుల సంఘం, అమన్వేదిక,  ఇంకా ఇతర  సంఘాల ప్రతినిధులు, రచయితలు, కళాకారులు పాల్గొంటున్నారు. ప్రతినిధుల అభిప్రాయాల తదనంతరం ప్యానల్‌ సభ్యులు ప్రసంగిస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *