ప్రగతిభవన్ లో రక్షాబంధన్ వేడుకలు

గురువారం రాఖీ పౌర్ణమి పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి  కె.చంద్రశేఖర్ రావు కు వారి అక్కలు, చెల్లెలు రాఖీలు కట్టి రాఖీ పండుగ  వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా అక్కలు లక్ష్మీబాయి, జయమ్మ, లలితమ్మ, చెల్లెలు వినోదమ్మ తమ సోదరునికి రాఖీ కట్టి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ వారి అక్కలకు పాదాభివందనాలు చేసి ఆశీర్వాదాలు అందుకున్నారు  ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సతీమణి శోభమ్మ, తదితరులు  పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *