రాజేష్ కుమార్ సింగ్, కుమార్ వి ప్రతాప్
మొబైల్ ఫోన్ల ఎగుమతులను ప్రోత్సహించడంలో ఉత్పాదకత తో కూడిన ప్రోత్సాహక (పిఎల్ఐ) పథకం వల్ల ఎక్కువ ప్రయోజనం కలగలేదు అంటూ ఇటీవల వార్తా పత్రికల్లో కథనాలు వెలువడ్డాయి. విలువ జోడింపు తక్కువగా ఉండడం లాంటి కారణాలను కథనాలు ఉటంకించాయి,. కథనాల్లో పేర్కొన్న ప్రధాన అంశాలు ఇలా ఉన్నాయి .. సుంకాలు ఎక్కువగా విధించడం వల్ల మొత్తం దిగుమతులు తగ్గాయి. ఉత్పాదకత తో కూడిన ప్రోత్సాహక పథకం కింద అందిస్తున్న ప్రోత్సాహకాలు జోడించిన విలువ కంటే ఎక్కువగా ఉన్నాయి. దిగుమతులపై భారతదేశం ఎక్కువగా ఆధారపడి ఉంది. దేనిని తగ్గించడానికి ఉత్పాదకత తో కూడిన ప్రోత్సాహక పథకం అమల్లోకి వచ్చింది. అయితే, పిఎల్ఐ వల్ల ఎన్ని ఉద్యోగాలు అదనంగా అందుబాటులోకి వచ్చాయి? అదనంగా అందుబాటులోకి వచ్చిన ఉద్యోగాలపై యెంత ఖర్చు అవుతుంది? లాంటి అంశాలను లోతుగా విశ్లేషించాలి అంటూ వార్తాపత్రిక కథనాలు ప్రచురితం అయ్యాయి. అయితే, వార్తాపత్రికలు ప్రచురించిన అంశాల్లో వాస్తవం లేదని కింది అంశాలను పరిశీలిస్తే అర్ధం అవుతుంది.ఉత్పత్తి ఎక్కువ చేయడానికి, ఎగుమతులు ఎక్కువ చేయడానికి అనుసరించే వ్యూహంలో భాగంగా టారిఫ్ విధానంలో మార్పులు చూపులు చోటుచేసుకుంటాయి. 2015 తో పోల్చి చూస్తే భారతదేశంలో ఉపయోగిస్తున్న మొబైల్ హ్యాండ్సెట్లలో 99.2% సెట్లు దేశంలో ఉత్పత్తి అయ్యాయి.
పిఎల్ఐ కింద అందిస్తున్న ప్రోత్సాహకాలు ఆరు శాతం కూడా లేవు.(దశలవారీగా 2% కంటే తక్కువగా ఉంటాయి). పెరిగిన ఉత్పత్తి పరిమాణం ఆధారంగా మాత్రమే ప్రోత్సాహకాలు అందించడం జరుగుతుంది. పిఎల్ఐ పథకం కింద ప్రయోజనం పొందుతున్న వారి సంఖ్య మార్కెట్ వాటా ప్రకారం 20% మాత్రమే ఉంది. అయితే, ఈ వర్గం 2022-23 ఆర్థిక సంవత్సరంలో జరిగిన మొబైల్ ఫోన్ ఎగుమతుల్లో 82% వాటాను కలిగి ఉందని గుర్తించాల్సి ఉంటుంది. మోడల్, సంక్లిష్టత ఆధారంగా విశ్లేషిస్తే మొబైల్‌లలో దేశీయ విలువ జోడింపు 14-25 శాతం మధ్య ఉంటుంది అని వెల్లడవుతుంది. ఛార్జర్లు, బ్యాటరీ ప్యాక్‌లు, హెడ్సెట్లు, మెకానిక్స్, కెమెరా మాడ్యూల్, డిస్ప్లే అసెంబ్లీ లాంటి అనుబంధ రంగాలు, సరఫరా వ్యవస్థ గణనీయమైన అభివృద్ధి సాధించాయి. భారతదేశం పై ఆధారపడి సరఫరా వ్యవస్థ ఎక్కువగా పనిచేస్తోంది. దీనితో పాటు పశ్చిమ యూరప్, అమెరికా మరియు అభివృద్ధి చెందిన ఆసియా దేశాల్లో నూతన మార్కెట్ అందుబాటులోకి వచ్చింది. పరికరాల తయారీ రంగంలో పర్యావరణ పరిరక్షణ అంశానికి ప్రాధాన్యత పెరిగింది.టాటా వంటి పెద్ద సంస్థలు తయారీ రంగంలోకి ప్రవేశించాయి. ఈ అంశాలను పరిశీలిస్తే విధానపరమైన జోక్యం వల్ల కలిగే ప్రయోజనాలు ఎక్కువగాఉంటాయని అర్ధం అవుతుంది.
పిఎల్ఐ పథకం అమలు కాకుండా ఉంటే మొబైల్‌లు, దాని విడిభాగాల దిగుమతులు ఏ విధంగా ఉండేవి? ఇతర దేశాల అనుభవాల దృష్ట్యా సరఫరా వ్యవస్థ ఏ విధంగా ఉండేది? అన్న అంశాలను పరిశీలించాల్సి ఉంటుంది. చైనా వి 1.3 ట్రిలియన్ ఎలక్ట్రానిక్ పరిశ్రమ అభివృద్ధి కావడానికి చైనా 25 సంవత్సరాల పాటు కృషి చేయాల్సి వచ్చింది. అయితే, ఇప్పటికీ సెమీకండక్టర్, మెమరీ మరియు ••జుణ డిస్ప్లే లాంటి కీలకమైన స్మార్ట్‌ఫోన్ భాగాలను తయారు చేయగల సామర్థ్యం చైనా వద్ద లేదు. ఈ భాగాల విలువ స్మార్ట్ ఫోన్ ఫోన్ విలువలో 45 శాతం వరకు ఉంటుంది. 2022 లో చైనా ఎలక్ట్రానిక్స్ దిగుమతి వి 650 బిలియన్ల వరకు ఉంది. 15 సంవత్సరాల తర్వాత వియాత్నం ఎలక్ట్రానిక్స్ రంగం వి 140 బిలియన్లకు చేరింది. దీనిలో విలువ ఆధారిత జోడింపు 18 శాతం వరకు ఉంటుందని అంచనా.రెండు దేశాల అనుభవాలు పరిశీలిస్తే దేశీయ విలువ జోడింపు పెంచడానికి ఉత్పత్తి పరిమాణం ముఖ్యమని అర్ధం అవుతుంది. ఎగుమతులు పెంచే అంశంలో ఉత్పత్తి పరిమాణం మరింత కీలకంగా ఉంటుంది. విధానపరమైన జోక్యం వల్ల కలిగిన ప్రయోజనాలు బహుముఖంగా ప్రభావం చూపుతున్నాయి. సాధించిన ప్రయోజనాలను తక్కువ చేసి చూపిస్తూ కధనాలు ప్రచురితం అయ్యాయి.
బలమైన ఎలక్ట్రానిక్స్ తయారీ రంగాన్ని అభివృద్ధి చేయడానికి ఉత్పత్తి ప్రక్రియలో స్థానికీకరణ అంశానికి ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది అని గుర్తించాల్సి ఉంటుంది.తొలిదశలో భారతదేశానికి పెద్ద ఎత్తున మొబైల్ ఫోన్ అసెంబ్లింగ్‌ను ఆకర్షించడానికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. స్థానికీకరణ అంశానికి ప్రాధాన్యత ఇస్తూ దేశంలో తయారీ విలువ జోడింపు అంశానికి ప్రాధాన్యత ఇస్తూ తదుపరి దశ అమలు జరుగుతుంది. ప్రభుత్వ విధానాన్ని విమర్శిస్తూ ప్రచురితమైన కధనాలు ఈ రెండు ముఖ్యమైన పరివర్తన దశల ప్రాధాన్యతను గుర్తించలేదు అని స్పష్టంగా చెప్పాల్సి ఉంటుంది.
భారతదేశాన్నిఎలక్ట్రానిక్స్ సిస్టమ్ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ (జు•ణవీ) గ్లోబల్ హబ్‌గా అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం పటిష్ట వ్యవస్థ అభివృద్ధి చేసే అంశంపై ద్రుష్టి సారించింది. దేశంలో 2014-15 లో ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి వి 37 బిలియన్లు గా ఉంది. దిగుమతులపై ఎక్కువగా ఆధారపడడం, విలువ ఆధారిత తక్కువగా ఉండడం వల్ల ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి తక్కువగా ఉంది. అయితే, ప్రభుత్వం అమలు చేసిన చర్యల వల్ల దేశంలో ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి విలువ గత 9 సంవత్సరాల కాలంలో దాదాపు మూడు రెట్లు పెరిగింది. 2023-23 లో ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి (పరిశ్రమ అంచనాల ప్రకారం) వి101 బిల్లియన్లకు చేరింది ఎగుమతులు దాదాపు నాలుగు రెట్లు పెరిగి వి 23 మిలియన్లకు చేరుకున్నాయి.విలువ ఆధారిత జోడింపు దాదాపు 23% వరకు ఉంది. ప్రపంచ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తిలో భారతదేశం వాటా 2021-22 నాటికి 3.75% కి పెరిగింది. 2012 లో భారతదేశం వాటా 1.3% మాత్రమే.
ఎలక్ట్రానిక్స్ రంగానికి పిఎల్ఐ పధకాన్ని ప్రారంభించిన తర్వాత ఉత్పత్తి పరంగా భారతదేశం ప్రపంచంలో రెండవ అతిపెద్ద మొబైల్ ఫోన్ల తయారీదారుగా అవతరించింది. 2014-15 ఆర్థిక సంవత్సరంలో 60 మిలియన్ల మొబైల్ ఫోన్లు ఉత్పత్తి అయ్యాయి. 2014-15 ఆర్థిక సంవత్సరంలో భారతదేశంలో 60 మిలియన్ల మొబైల్ ఫోన్లు ఉత్పత్తి అయ్యాయి.ప్రపంచంలో 2014 లో ఉత్పత్తి అయిన మొబైల్ ఫోన్లలో 3% మొబైల్ ఫోన్లు భారతదేశంలో ఉత్పత్తి అయ్యాయి. ఈ పరిమాణం ఈ ఏడాది 19% వరకు ఉంటుందని అంచనా. విలువ పరంగా చూస్తే దేశంలో 2022-23 ఆర్థిక సంవత్సరంలో 3.5 ట్రిలియన్ విలువ చేసే మొబైల్ ఫోన్లు ఉత్పత్తి ఉత్పత్తి అయ్యాయి. 2014-15లో దేశంలో ఉత్పత్తి అయిన మొబైల్ ఫోన్ల విలువ 190 బిలియన్ రూపాయలుగా ఉంది. మొత్తం వి 101 బిలియన్ గా ఉన్న ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తిలో స్మార్ట్ ఫోన్ల విలువ వి 44 బిలియన్ గా ఉంది. వీటిలో వి11.1బిలియన్ విలువ చేసే ఫోన్లు ఎగుమతి అయ్యాయి. వాస్తవ పరిస్థితిని గమనిస్తే భారతదేశంలో మొబైల్ ఫోన్ల ఉత్పత్తి గణనీయంగా పెరిగిందని, విలువ జోడింపు వల్ల ఉపాధి అవకాశాలు మెరుగు పది ఆదాయం పెరిగింది అని స్పష్టంగా తెలుస్తోంది.
ఎల్ఎస్ఈఎం రంగానికి అమలు చేసిన ఉత్పాదకత తో కూడిన ప్రోత్సాహ పథకం వల్ల పెట్టుబడులు గణనీయంగా పెరిగాయి. ఈ రంగంలో 2022-23 ఆర్థిక సంవత్సరంలో 65.62 బిలియన్ రూపాయల పెట్టుబడులు వచ్చాయి. దీనివల్ల 100,000 మంది ప్రత్యక్షంగా 2,50,000 మంది పరోక్షంగా ఉపాధి పొందారు. ఉత్పత్తి 2.84 ట్రిలియన్ రూపాయలకు, ఎగుమతులు 1.29 ట్రిలియన్ రూపాయలకు చేరాయి కొత్తగా అందుబాటులోకి ఉద్యోగాలు పొందిన వారిలో 70 శాతం వరకు మహిళలు ఉన్నారు దీనివల్ల ఉద్యోగ రంగంలో లింగ వివక్ష తగ్గుతుంది. 2014 నుంచి ఇంతవరకు దేశంలో ఈ రంగంలో కొత్తగా ఒక మిలియన్ ఉద్యోగాలు లభించాయి. భారతదేశంలో కార్యకలాపాలు ప్రారంభించడానికి ఆపిల్ సంస్థ నిర్ణయించింది. ఐఫోన్ ఉత్పత్తి గణనీయంగా విస్తరించాలని ఆపిల్ తీసుకున్న నిర్ణయంతో భారతదేశం ప్రయోజనం పొందుతుంది. భారతదేశంలో అధునాతన ఫోన్లు ఉత్పత్తి చేయాలని ఆపిల్ నిర్ణయించింది. . 2025 నాటికి యాపిల్ ఐఫోన్ లో నాలుగింట ఒక వంతు భారతదేశంలోనే తయారు అవుతాయని అంచనా. పిఎల్ఐ పథకం విజయం సాధించింది అని చెప్పడానికి స్పష్టమైన నిదర్శనాలు ఉన్నాయి పిఎల్ఐ వల్ల ఉపాధి అవకాశాలు పెరిగాయి. ఉత్పత్తి రంగంలో ప్రత్యక్ష విదేశీ పెట్టుబడులు పెరిగాయి. ఎగుమతులు ఎక్కువ అయ్యాయి. విలువ ఆధారిత జోడింపు పెరిగింది. పిఎల్ఐ పథకంఅన్ని రకాల ఉత్పత్తులు ముఖ్యంగా మొబైల్ ఫోన్ల ఉత్పత్తిపై సానుకూల ప్రభావాన్ని చూపించింది.
(రచయితలు కేంద్ర డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్, కేంద్ర డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ సీనియర్ ఆర్థిక సలహాదారు )




