పీహెచ్‌డీ ప్రవేశాల్లో అక్రమాలు జరగలేదు

కేయూ మల్టీ డీన్ ఫ్యాకల్టీ ఫోరం వెల్లడి
కాళోజీజంక్షన్,(హన్మకొండ),సెప్టెంబరు 19, ప్రజాతంత్ర : కాకతీయ విశ్వవిద్యాలయం క్యాటగిరి – II  పి హెచ్. డి అడ్మిషన్ల ప్రక్రియ పారదర్శకంగా నే జరిగిందని, ఏలాంటి అక్రమాలు జరగలేదని కేయూ డీన్ ఫ్యాకల్టీస్ ఫోరం ఒక ప్రకటనలో వెల్లడించింది. విద్యార్థులు చేస్తున్న ఆందోళనలను తీవ్రంగా ఖండించారు.  2017 నుండి ఇప్పటి వరకు తిరిగి ప్రవేశాలు జరగలేద్నారు.  దానివల్ల అనేకమంది పరిశోధక  విద్యార్థులు వేరే విశ్వవిద్యాలయాల్లోకి, మరికొందరు విదేశాలకు వెళ్ళి పరిశోధనలు చేస్తున్నారని చెప్పారు.  22 మే, 2021  న ఉపకులపతి గా భాద్యతలు స్వీకరించిన ప్రొఫెసర్ తాటికొండ రమేష్, వివిధ విభాగాలలో పరిశోధన ప్రక్రియకు శ్రీకారం చుట్టే క్రమం లో,  వివిధ  విభాగాల్లో తక్కువ పిహెచ్‌డి  సీట్లు ఉన్నాయని తెలిసిందన్నారు.  దానికి ప్రత్యామ్నాయాలను పరిశీలించి, అర్హులైన,  విశ్రాంతాచార్యులకు మరియు అర్హులైన డిగ్రీ కళాశాల అధ్యాపకులకు కూడా పరిశోధన పర్యవేక్షణకు అవకాశం ఇవ్వడం వల్ల కొన్ని పిహెచ్‌డి సీట్ల సంఖ్య పెరిగిందన్నారు. ముందుగా కేటగిరి-I కింద జాతీయ పరిశోధనా సంస్థల  ద్వారా సెలెక్టు అయిన ప్రతిభావంతులకు ప్రవేశాలను యివ్వడం జరిగిందన్నారు. ఈ ప్రక్రియను జూన్ 2022 లోనే పూర్తి చేశామ్నారు.
  అప్పుడు కూడా ఇప్పుడు వ్యతిరేకిస్తున్న కొంత మంది  విద్యార్ధి సంఘ నాయకులే పిహెచ్‌డి ప్రవేశాలను అడ్డుకునే ప్రయత్నం చేసారని చెప్పారు. విశ్వవిద్యాలయం కేటగిరీ – I పిహెచ్‌డి  అడ్మిషన్ ప్రక్రియను దిగ్విజయంగా జరిపింది.    ఆ తదుపరి జరిగిన నాక్  అక్రిడేషన్ లో కేటగిరీ I పిహెచ్‌డి ప్రవేశాలు యూనివర్సిటీ ఏ+  ర్యాంకింగ్ కు దోహదపడిందన్నారు.  కేటగిరి-II లో పిహెచ్‌డి అడ్మిషన్లలో   ఎలాంటి అపోహలకు తావివ్వకుండా పారదర్శకంగా ఉండాలనే సంకల్పంతో ఎంట్రెన్సుకు సంబంధించిన కీ  కూడా  వెబ్ సైట్ లో పొందుపరిచామన్నారు.  ప్రవేశాల ప్రక్రియలో పారదర్శకంగానూ, మెరిట్ ఆధారంగానూ, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ను దృష్టిలో పెట్టుకొని ఇంటర్వ్యూ లని నిర్వహించాలని వైస్ ఛాన్సలర్ సూచించారువివరించారు. ఈ క్రమం లో  అన్ని ఫ్యాకల్టీల డీన్లతో, చైర్‌పర్సన్లతో, హెడ్లతో, సీనియర్ పర్యవేక్షకులతో అనేక దఫాలు గా సమావేశాలు నిర్వహించారని పేర్కొన్నారు.  ఇంటర్వ్యూ ప్రక్రియ  వీడియో చిత్రీకరణ  కూడా చేయాలనీ సూచించారు.  ఇందులో పారదర్శకత, ప్రతిభ, ఎంతో అనుభవజ్ఞులైన ఆచార్యులతో కూడిన కమిటీలను ఏర్పరిచి యుజిసి  ప్రకారం  అడ్మిషన్ ప్రక్రియలో ఉండాల్సిన అన్ని సామాజిక వర్గాల ప్రయోజనాలను దృష్టి తో  ఇంటర్వ్యూ బోర్డులను ఏర్పాటు చేశారని తెలిపారు.
  ఏదైనా అభ్యంతరాలు ఉంటే విజ్ఞాపన పత్రంతో డీన్స్ కు   సమర్పించాలని తెలుపడం జరిగిందన్నారు. ఎక్కడైనా తప్పు దొర్లినట్లయితే ఆ తప్పును సవరించడానికి డీన్స్ వద్ద ఉన్న సమాచారాన్ని పునః పరిశీలించి పరిష్కరించే అవకాశం ఉంటుందిని స్పష్టం చేశారు.  గత కొద్దిరోజులుగా కొంతమంది సీటు రాని విద్యార్ధి నాయకులు  లొల్లిచేసి అధికారులను భయభ్రాంతులకు గురి చేశారని ఆరోపించారు..  యూనివర్సిటీ ఆస్తులను ధ్వంసం చేసారని విమర్శించారు.  విద్యార్ధి నాయకులే వారి స్వార్ధపూరిత మనస్తత్వంతో వ్యక్తిగత ప్రయోజనాలకు యూనివర్సిటీ పరువును తీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఈ అనాగరిక, అసత్య చేష్టలను ఫాకల్టీ డీన్స్ తీవ్రంగా ముక్తకంఠంతో ఖండిస్తున్నామని అందరి సంతకాలతో కూడిన ఒక ప్రకటనను కేయూ పీఆర్వో కార్యాలయం విడుదల చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *