గత కాంగ్రెస్ పాలనలో పాలమూరు భూములు ఎటు చూ సిన రేగి కంప, తంగెడు చెట్లు రాళ్లు రప్పలతో నిండి పోయి దర్శన మిచ్చేవి ఆ కాలంలో మారుమూల ప్రాం తాలకు బస్సు సౌకర్యం ఉండేది కాదు పక్క ఊరు వెళ్ళాలి అన్న నడుచు కుంటూ వెళ్లే వాళ్లు వెళ్తున్న సమయంలో దాహము వేస్తే ఆ దారి పొడువునా బోరు బావులలో చూస్తే నీరు ఎడిపోయి ఉండేవి ఎవ్వరైన కనిపిస్తార కాసిన్ని మంచి నీళ్లు అడుగుదామని చూసిన కంటి చూపు మేర బీడు వారి పోయిన భూములు. దుబాయి, హైదరాబాద్ వలస వెళ్లి పని చేసే శ్రామిక శక్తి లేని వాళ్లు వ్యవసాయంపై ప్రేమతో వరుణ దేవుని నమ్ముకొని పంట వేసిన రైతు దిగులుగా బక్కపల్చని ఆకృతి చినిగిన బనియన్ తో కూర్చోని పరి పరి విధాలుగా ఆలోచిస్తూ దేవుడా కరుణించ వయ్యా అంటూ వానకై ఎదురు చూసేది, పాలమూరులో ఎవ్వరినీ కదిలించిన కన్నీటి గాధలే వినబడుతుండే కాంగ్రెస్ పాలనలో బుడి బుడి అడుగులు వేసే చిట్టి తల్లి నుండి వృద్ధుల దాకా ఎండిన మొక్కలకు నీళ్లు పోసిన రోజులు పాలమూరు ప్రజలు మరువలే, ఉన్న ఊరిలో పూట గడువని కుటుంబాలు అవ్వతాత దగ్గర పాలు తాగే పిల్లలను వదిలి ఆ తల్లి వేదనతో బతుకుదెరువుకై ముంబై బస్సు ఎక్కి వెళ్లిన రోజులు ఆ పిల్ల, పిల్లవాడు తల్లిపై బెంగ పెట్టుకు న్నాడని ముంబై వెళ్తున్న వాళ్ళతో కబురు పెట్టి పంపితే ఆ తల్లి భర్తతో తగువు పెట్టుకొని వచ్చి పిల్లలను గుండెకు హత్తుకొన్న రోజులు మరువలె.

పాలమూరు ప్రజల జీవన స్థితిగతులు రాయాలి అన్న కన్నీటితో పేపరు తడువదే అంశం పూర్తి అయ్యేది కాదు. పాలమూరులో ఎవ్వరి ఇంటికైన వెళ్లి చెంబు నీళ్లు అడుగుతే ఉప్పు నీళ్లు ఇస్తారో మంచి నీళ్లు ఇస్తారో అని ఆలోచించే వాళ్ళము అటువంటి పరిస్థితి నుండి నేడు ఇంటి ఇంటికి మిషన్ భగీరథ ద్వారా దేశంలో ఎక్కడా లేని విధంగా మంచి నీరు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. కాంగ్రెస్ పాలనలో గిరిజన, మారుమూల గ్రామాలకు తాగునీరు, కరెంట్, రవాణా సౌకర్యం లేక ఎన్నో ఇబ్బందులు పడిన పాలమూరు ప్రజలు ఈ రోజు ఏ విధంగా కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని కాంగ్రెస్ నాయకులను నిలదీస్తున్నారు. నేడు పక్కనే ఉన్న కర్ణాటక రాష్ట్రంలో కరెంట్ కోసం రైతులు రోడ్లపై ధర్నాలు చేస్తున్న సంఘటనలు చూస్తున్నాము.
పాలమూరు ప్రజలు ఒక్కప్పుడు ఒక పూట భోజనానికి ఎదురు చూసిన పరిస్థితి నుంచి నేడు బీఆర్ఎస్ పాలనలో దేశానికే అన్నం పెట్టే స్థాయికి ఎదుగుతామని పాలమూరు ప్రజలు అనుకోలేదు, ఎన్నికల సమయంలో వివిధ పార్టీల నాయకులు పాలమూరు వలసల, కరవు జిల్లా మా పార్టీ అధికారంలోకి వస్తే పాలమూరు రూపు రేఖలు మారుస్తామని హమీలు ఇచ్చిన వారి అభివృద్ధికై ఏ రోజు పరితపించలేదు. గత కాంగ్రెస్ పాలనలో రైతుల ఆత్మహత్యలు కరెంట్ కోతలు కరెంట్ కై ఎదురు చూస్తూ బోరు బావి దగ్గర ప్రాణలు వదిలిన రైతన్నలు ఎందరో త్రాగు నీరుకై మైళ్ళ దూరం నడిచిన రోజులు, గత కాంగ్రెస్ ఎలువడిలో ఎవ్వరైనా కాలం చేస్తే స్నానం చేయడానికి పడ కష్టాలు అసెంబ్లీ సాక్షిగా ప్రస్తుత పీసీసీ రేవంత్ రెడ్డి చెప్పిన సందర్భం చూ శాము. ఈనాడు పాలమూరు ప్రజలను మాయ మాటలతో మభ్యపెట్టె ప్రయత్నం చేస్తున్నారు, కానీ పాలమూరు ప్రజలు గత పాలనలో పడిన కష్టాలను అంత సులువుగా మరచిపోలేదు. ఒక్కప్పుడు కృష్ణమ్మ పక్కనే ప్రవహిస్తున్న చుక్క నీరు అందలే నేడు కేసీఆర్ పాలనలో ప్రతి గుంట భూమి తడుస్తుంది అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన విశేషమైన కృషి అని చెప్పవచ్చు. గతంలో ముంబై, హైదరాబాద్ కి వలసలు వెళ్లిన పాలమూరు వాసులు నేడు ఉమ్మడి మహబూబ్ నగర్ సరిహద్దు రాష్ట్రాలైన కర్ణాటక ఆంధ్ర, చత్తీస్ గఢ్ మహరాష్ట్ర ప్రాంతాల నుండి ఉపాధికై వస్తున్నారు. పాలమూరు ప్రజల కష్టాలను దగ్గరి నుంచి చూసిన కేసిఆర్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో పాలమూరు ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి సాధించి వడి వడిగా పనులు పూర్తి చేసి ప్రతి ఎకరాకు నీరు అందించే విధంగా ముందుకు పోతున్నాడు కేసీఆర్. నేడు పాలమూరు పచ్చబడుతుంటే ఓర్వలేని కాంగ్రెస్, బీజేపీ నాయకులు ప్రాజెక్టులపై కేసులు వేస్తు అభివృద్ధికి ఆటంకం సృష్టించిన చరిత్ర వారిది. నేడు అసత్య ప్రచారంతో పాలమూరు ప్రజలు ఓట్లు రాబట్టుకోవాలని ప్రయత్నిస్తున్నారు కానీ పాలమూరు ప్రజలు మాత్రం కేసీఆర్ వైపే ఉన్నారు అనడానికి గత ఎన్నికల్ల ఫలితాలే నిదర్శనం. కొత్తగా ఏర్పడిన రాష్ట్రమైన అభివృద్ధిలో ముందుకు పోతూ ధాన్యగార దిగుబడిలో తెలంగాణ ముందుంది అంటే దానిలో పాలమూరు వాటానే అధికం.
కేసీఆర్ ఉద్యమ సమయంలో కాంగ్రెస్ కు పెద్ద పీఠ వేస్తామని ఇచ్చిన హమీ ప్రకారం పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టు ఆయకట్టు ద్వారా ఉమ్మడి మహబూబ్ నగర్, ఉమ్మడి రంగారెడ్డి, నల్గొండ జిల్లాలకు నీరు అందిస్తుంది. ఈ ప్రాజెక్టు ద్వారా దాదాపు 12.30 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది, 1200 గ్రామాలకు తాగునీరు అందించే విధంగా ప్రాజెక్టును నిర్మించారు, దీని నీటి నిల్వ సామర్థ్యం 67.67 టీఎంసీలు 4 పంపు హౌజులు 145 మేఘావాట్లతో విద్యుత్తు సామర్థ్యము కల్గిన 34 పంపులను ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు తర్వాతి స్థానం పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టు. నేడు పాలమూరులో పశు సంపద పెరిగి పాలు, పెరుగు, మాంసంతో పౌష్టికాహారం పొందుతున్నారు. పాలమూరులో జీవ వైవిధ్యం అడవుల శాతం వన్య ప్రాణుల సంఖ్య పెరిగిందని పలు నివేదికలు తెలుపుతున్నాయి. జూరాల ప్రాజెక్టు వద్ద కృష్ణానది నుంచి 70 టీఎంసీల వరద నీటిని ఎత్తిపోయడం ద్వారా మహబూబ్నగర్ జిల్లాలో 7 లక్షల ఎకరాలకు, రంగారెడ్డి జిల్లాలో 2.7 లక్షల ఎకరాలకు, నల్లగొండ జిల్లాలో 0.3 లక్షల ఎకరాలకు సాగునీరు అందనునంది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా కాలువలను చెరువు, కుంటలను నింపి కాకతీయుల నాటి పూర్వ వైభవాన్నికి మీషన్ కాకతీయ ద్వారా కుంటలు, చెరువులను మరమ్మతు చేసి సాగు నీరు అందిస్తున్న ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిది.
కాంగ్రెస్ దాదాపు ఆరు దశాబ్దాలు పరిపాలించి దేశానికి చేసింది ఏమి లేదు, పాలమూరు ప్రజల సంక్షేమానికి కృషి చేసింది ఏమి లేదు కానీ నేడు పాలమూరులో 14 స్థానాలు సాధిస్తామని ప్రగల్భ ములు పలుకుచున్నారు పాలమూరు ప్రజలు ఎందుకు కాంగ్రెస్ కు ఓటు వెయ్యాలని ప్రజలకు చేప్తే బాగుండు పక్కనే ఉన్న కృష్ణానది నీళ్లు ఆంధ్రకు తరలిస్తుంటే వత్తాసు పలికినందుకు ఓటు వెయ్యాల్నా పాలమూరు ప్రజలు ఆలోచించాలి. ప్రస్తుత ఎన్నికల ప్రచారంలో ఆరు గ్యారంటీలతో అధికారంలోకి వస్తామని భ్రమ పడుతుంది. దేశాన్ని పాలిస్తున్న బీజేపీ పాలమూరు ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వకుండా మత రాజకీయాలతో సీట్లు రాబట్టుకో వాలని ప్రయత్ని స్తుంది. గతంలో పాలమూరు లేబర్ అంటే ప్రపం చానికే ఎరుక అన్న మాటకు భిన్నంగా పాలమూరును అన్ని విధాలుగా అభివృద్ధి చేసి ప్రంపంచ పటంలో ప్రత్యేక గుర్తింపు వచ్చే విధంగా పాలమూరు ప్రజల సంక్షేమానికై కృషి చేస్తుంది భారత రాష్ట్ర సమితి.

మిద్దె సురేష్
9701209355