పాలమూరు-రంగారెడ్డిని ఆపొద్దు

  • ఇప్పటికే 90శాతం పనులు పూర్తి చేశాం
  • ముందుగా రాయలసీమ సంగమేశ్వరను ఆపాలి
  • ప్రధానితో మాట్లాడి జాతీయహోదా తేవాలి
  • విూడియా సమావేశంలో ఎమ్మెల్సీ కవిత

మహబూబ్‌నగర్‌,ప్రజాతంత్ర,జనవరి9:పాలమూరు`రంగారెడ్డి ఎత్తిపోతల పథకం టెండర్లను రద్దు చేయాలనే ఆలోచనను పక్కనపెట్టి ఆ ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయడంపై సీఎం రేవంత్‌ రెడ్డి దృష్టి సారించాలని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సూచించారు. సీఎం రేవంత్‌ రెడ్డి ప్రాజెక్టు టెండర్లను రద్దుచేసి మళ్లీ టెండర్లను ఆహ్వానిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయని, టెండర్లను రద్దుచేసి మళ్లీ పిలువడం ఎందుకో ప్రజలకు చెప్పాలన్నారు. దీనిపై అసెంబ్లీలో పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇవ్వాలని కవిత డిమాండ్‌ చేశారు. డిజైన్‌ మార్చకపోయినా, ఆయకట్టు పెంచకపోయినా టెండర్లను ఎందుకు రద్దు చేస్తున్నారని ప్రశ్నించారు. పాలమూరు`రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కోసం కేంద్ర ప్రభుత్వంపై సీఎం ఒత్తిడి చేయాలని సూచించారు. ప్రధాని మోదీతో కేసీఆర్‌కు సత్సంబంధాలు లేకనే ప్రాజెక్టుకు జాతీయ హోదా రాలేదని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారని, ఇప్పుడు ఆయన ప్రధానితో సత్సంబంధాలు పెట్టుకొని జాతీయ హోదా సాధించాలని కోరారు.

మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌ రెడ్డి సోదరుడు ఆల శశివర్ధన్‌ రెడ్డి ఇటీవల మరణించిన నేపథ్యంలో అన్నసాగర్‌ గ్రామంలో ఆయన చిత్రపటానికి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను ఎమ్మెల్సీ కవిత పరామర్శించారు. అనంతరం మహబూబ్‌నగర్‌ జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌, బీఆర్‌ఎస్‌ ఎంపీ మన్నె శ్రీనివాస్‌ రెడ్డితో కలిసి విూడియాతో మాట్లాడారు. గతంలో రేవంత్‌ రెడ్డి కోర్టు కేసులతో పాలమూరు`రంగారెడ్డి ప్రాజెక్టును ఆపే ప్రయత్నం చేసినా.. తాగునీటి ప్రాజెక్టు కాబట్టి ఆపకుండా రిజర్వాయర్లను పూర్తిచేశామని అన్నారు. ప్రాజెక్టుకు పూర్తిస్థాయి అనుమతులు పొందడంపై సీఎం రేవంత్‌ రెడ్డి దృష్టి సారించాలని, తద్వారా జాతీయ హోదా వచ్చే అవకాశం ఉంటుందని కవిత సూచించారు. రీటెండర్లంటూ కాలయాపన చేస్తే మరో రెండు పంటలకు నీళ్లు ఆగిపోయే ప్రమాదం ఉందన్నారు. త్వరగా పనులు పూర్తిచేస్తే వచ్చే వర్షకాలంలో నీళ్లు ఇచ్చే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు. కేసీఆర్‌ సీఎంగా ఉన్న పదేళ్లలో ఏపీ సర్కారు సంగమేశ్వరం వద్ద రాయలసీమ ప్రాజెక్టును నిర్మించే ధైర్యం చేయలేదని, అనుమతిలేని రాయలసీమ ప్రాజెక్టును కేసీఆర్‌ ఆపారని, రేవంత్‌ రెడ్డి కూడా ఆ ప్రాజెక్టును కొనసాగించకుండా చూడాలని కోరారు. పక్కనే కృష్ణా నది ఉన్నా కూడా పంటలు పండక ఇక్కడి ప్రజలు వలస వెళ్లే పరిస్థితి ఉండేదని, రాష్ట్రం ఏర్పడిన తర్వాత పాలమూరు పచ్చబడాల్సిందేనన్న సంకల్పంతో తెలంగాణ తొలి సీఎం కేసీఆర్‌ పనిచేశారని కవిత చెప్పారు. కృష్ణా జలాలను శాశ్వతంగా పాలమూరుకు మళ్లించే పాలమూరు`రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును బీఆర్‌ఎస్‌ హయాంలో 90 శాతం పూర్తి చేశారని గుర్తుచేశారు.

ఇప్పుడు ఆ ప్రాజెక్టు పరిస్థితి ’ఏనుగు ఎల్లింది.. తోక చిక్కింది’ అన్నట్లుగా ఉందని చెప్పారు. 69 టీఎంసీల నీటిని ఎత్తిపోయాలన్న లక్ష్యంతో చేపట్టిన ప్రాజెక్టులో ఐదు రిజర్వాయర్లు ఉన్నాయని, కాలువల పనులు కూడా దాదాపు పూర్తయ్యాయని, నార్లాపూర్లో కేసీఆర్‌ ట్రయల్‌ రన్‌ను కూడా ప్రారంభించారని తెలిపారు. మొత్తం ప్రాజెక్టులో కేవలం 10 శాతం పనులే మిగిలి ఉన్నాయని, అవి పూర్తి చేసుకుంటే మరో 10 లక్షల ఎకరాలకు సాగు నీళ్లు అందే ఆస్కారం ఉందని కవిత అభిప్రాయం వ్యక్తం చేశారు. పెండిరగ్లో ఉన్న కల్వకుర్తి, నెª`టటెంపాడు, కోయిల్‌ సాగర్‌, బీమా వంటి ప్రాజెక్టులను పూర్తిచేసి మంచి నీటి కొరత లేకుండా చేశామని, 11 లక్షల ఎకరాలకు సాగునీటి సదుపాయం కల్పించామని తెలిపారు. వివిధ కారణాల రీత్యా ఎన్నికల్లో అనుకున్న ఫలితాలు సాధించలేదన్నారు. బీఆర్‌ఎస్‌ కార్యకర్తలకు ఒక అడుగు వెనుకకుపడితే పది అడుగులు ముందుకు లంకించేంత శక్తి ఉంటుందని, గుండె ధైర్యంతో ముందుకు వెళ్లాలని సూచించారు. ఇకపోతే మహబూబ్‌ నగర్‌ జిల్లాకు తనకు ఓ ప్రత్యేక అనుబంధం ఉందని.. కేసీఆర్‌, ఇక్కడి నుంచి పోటీ చేసిన నాటినుంచి తనకు అనుబంధం ఉందని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. తనకుకు నిజామాబాద్‌ ఎట్లనో.. మహబూబ్‌ నగర్‌ అట్లేనని చెప్పారు.  ఇక్కడి ఎంపీగా ఉండే.. కేసీఆర్‌ తెలంగాణ సాదించాడని… అది చాలా గర్వ కారణమన్నారు. ఈ జిల్లా నుంచి వలసలు ఎట్లా ఆపాలో.. చాలా స్టడీ చేసినమని తెలిపారు. ఇక్కడ సాగు యోగ్య భూమి 35 లక్షల ఎకరాలు ఉండి.. నీరు లేకనే ప్రజలు వలస పోతున్నరని.. ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసీఆర్‌ వెంటనే 11 లక్షల ఎకరాలు సాగులోకి తెచ్చారని చెప్పారు.

ఎన్నికలలో మనం ఆశించిన స్థాయిలో ఫలితం రాలేదు.. కానీ మనం ఉద్యమ కారులం.. తప్పు ఎక్కడ జరిగిందో తెలుసుకోవాలి.. పోరాడాలి.. అదైర్య పడాల్సిన పనిలేకుండా ముందుకు సాగాలని కార్యకర్తులకు పిలుపునిచ్చారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనుల్లో 90 శాతం పనులు పూర్తి అయ్యాయి.. మిగతా 10 శాతం పనులు మాత్రమే పూర్తి కావాలని అన్నారు. ఇదే పాలమూరు నుంచి సీఎంగా రేవంత్‌ రెడ్డి ఉన్నారని.. కానీ, ఈ ప్రాజెక్టు టెండర్లు కాన్సల్‌ చేస్తామంటున్నారని.. ఎందుకు చేస్తారో చెప్పాలని ఆమె డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ హావిూ ఇచ్చినట్లు కొత్త పెన్షన్స్‌, 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ ఉసే లేదని… ప్రభుత్వానికి వంద రోజులు టైమ్‌ ఇస్తామని.. హావిూలు నెరవేర్చకపోతే ప్రజల తరుపున కొట్లాడుతామని హచ్చరించారు.  పార్లమెంట్‌ లో తెలంగాణ కోసం పొరాడేది కేవలం బీఆర్‌ఎస్‌ మాత్రమేనని.. కాబట్టి వచ్చే లోక్‌ సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్తులను గెలిపించాలని ఎమ్మెల్సీ కవిత కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *