నేర్చుకుందాం రా రండి!

పిల్లలూ రండి రా రండి
ఆంగ్ల నెలలు నేర్చుకుందాం రా రండి
గుర్తులతో నేర్చుకుందాం రా రండి

మొదటి నెల జనవరి
నూతన ఆంగ్ల సంవత్సరం ప్రారంభం
సంక్రాంతి సెలవులు ఆరంభం
రిపబ్లిక్‌ ‌డే వేడుకలు కూడా ఈనెలే
రెండవది ఫిబ్రవరి
సంవత్సర మొత్తంలో చిన్నది
తక్కువ రోజుల నెలండి
మూడవ నెల మార్చి
పరీక్షలు ప్రారంభం అయ్యే నెల
నాల్గవది ఏప్రిల్‌
‌పరీక్షలన్నీ ముగింపు
వేసవి సెలవులు ప్రారంభం
ఐదవ నెల మే
ఎండలు మండే నెలండి
మామిడి పండ్ల మజా అండి
ఆరోది జూన్‌
ఋతుపవనాల రాక,
వర్షాలు ఆరంభం

ఏడో నెల జూలై
వర్షాలు మెండుగా కురియును
వరదలతో ఊర్లన్నీ మునుగును
ఎనిమిదోది ఆగస్టు
స్వాతంత్య్ర దినోత్సవం
ఊరువాడ జరుపుకుంటాం
తొమ్మిదవ నెల సెప్టెంబర్‌
‌సర్వేపల్లి జయంతి
ఉపాధ్యాయ దినోత్సవం
పదవది అక్టోబర్‌
‌గాంధీ జయంతి ఈ నెలలోనే
పదకొండవ నెల నవంబర్‌
‌చాచా నెహ్రూ పుట్టినరోజు
బాలల దినోత్సవం జరుపుకుంటాం
పన్నెండవది డిసెంబర్‌
‌క్రిస్మస్‌ ‌జరుపుకునే నెల
సంవత్సరంలో చివరి నెల

పిల్లల్లారా నేర్చుకున్నారా
వరుస క్రమంలో నేర్చుకోండి!
గుర్తుల సహాయంతో గుర్తుపెట్టుకోండి!!

     –  ఏడుకొండలు కళ్ళేపల్లి,
                        మచిలీపట్నం
                      9490832338

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *