నేడు వరంగల్‌ కు సిఎం రేవంత్‌ ‌రెడ్డి

రెండో రాజధానిగా ఓరుగల్లు అభివృద్ది
పలు పరిశ్రమల ఏర్పాటు, హాస్పిటల్‌ ‌నిర్మాణాలపై పరిశీలన
అధికారులతో సమీక్ష ఉంటుందన్న మంత్రి కొండా సురేఖ

వరంగల్‌, ప్రజాతంత్ర, జూన్ 27:‌ వరంగల్‌ ‌ను రెండో రాజధాని చేసే లక్ష్యంగా  సీఎం రేవంత్‌ ‌రెడ్డి కార్యాచరణ ఉందని మంత్రి కొండా సురేఖ అన్నారు. శుక్రవారం వరంగల్‌ ‌లో  సీఎం రేవంత్‌ ‌రెడ్డి పర్యటన  ఉందన్నారు. మధ్యాహ్నం 1గంటకు  టెక్స్ ‌టైల్‌ ‌పార్క్ ‌కు చేరుకుని పరిశ్రమల స్థాపన, ఉపాధి కల్పన పై సీఎం  పరిశీలస్తారని తెలిపారు. వరంగల్‌లో నూతనంగా నిర్మిస్తున్న సూపర్‌ ‌స్పెషాలిటీ హాస్పిటల్‌ ‌ను సందర్శిస్తారని చెప్పారు. హనుమకొండ కలెక్టరెట్‌ ‌పరిధిలో చేపట్టాల్సిన అభివృద్ది పనులపై సీఎం రివ్యూ చేస్తారని వెల్లడించారు.  వరంగల్‌ ‌మాస్టర్‌ ‌ప్లాన్‌ అం‌శం చర్చకు వస్తాయని, గతంలో ఉన్న మాస్టర్‌ ‌ప్లాన్‌ ‌ప్రతిపాదనలు సొంత ఎజెండాతో చేసిందని అర్థం అయ్యిందన్నారు.

దాన్ని మార్చాల్సి ఉందని చెప్పారు. 3 నెలల కాలవ్యవధి పెట్టి మాస్టర్‌ ‌ప్లాన్‌ ‌తయారీ చేస్తామని స్మార్ట్ ‌సిటీ పనుల అంశం చర్చ ఉంటుందని అండర్‌ ‌గ్రౌండ్‌ ‌డ్రైనేజీ అంశం చర్చిస్తామని సురేఖ తెలిపారు. ఇన్నర్‌ ‌రింగ్‌ ‌రోడ్డు నిర్మాణం, దాని సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్తామని, మమూనూర్‌ ఎయిర్‌ ‌పోర్ట్ అం‌శం కూడా చర్చకు వస్తుందని మంత్రి కొండా సురేఖ తెలిపారు. సీఎం రేవంత్‌ ‌రెడ్డి వరంగల్‌ ‌పర్యటన కోసం అన్ని ఏర్పాట్లు చేశామని వరంగల్‌ ‌వెస్ట్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌ ‌రెడ్డి తెలిపారు. హెలికాప్టర్‌లో హైదారాబాద్‌ ‌నుంచి టెక్స్ ‌టైల్‌ ‌పార్క్ ‌కు 12 గంటలకు సీఎం చేరుకుంటారని చెప్పారు.  టెక్స్ ‌టైల్‌ ‌పార్క్ ‌సందర్శించి  కొత్త కంపెనీల స్థాపన, ఉపాధి కల్పన,కోసం ప్రభుత్వ పరంగా చేపట్టాల్సి అంశాలపై సీఎం పరిశీస్తారని తెలిపారు.

అక్కడ నుంచి  సెంట్రల్‌ ‌జైల్‌ ‌కూల్చి ఆ స్థలంలో నిర్మిస్తున్న హాస్పిటల్‌ ‌నిర్మాణ పనులను సీఎం పరిశీలిస్తారని చెప్పారు. అనంతరం  హనుమకొండ కలెక్టరేట్‌ ‌కు చేరుని వనమహోత్సం ప్రారంభించి ప్రజాప్రతినిధులు , అధికారులతో కలిసి రివ్యూ చేపడతారని వెల్లడించారున.  హనుమకొండ కలెక్టరేట్‌ ‌లో 15 అంశాలపై సీఎం రేవత్‌ ‌రెడ్డి సుదీర్ఘంగా రివ్యూ చేస్తారని చెప్పారు. శ్రీ భద్రకాళి గుడి మాఢ వీధుల నిర్మాణం, వరంగల్‌ ‌నూతన మాస్టర్‌ ఎ•-‌లాన్‌,  ‌కాలోజీ  కళాక్షేత్రం,  అండర్‌ ‌గ్రౌండ్‌ ‌డ్రైనేజీ,  స్మార్ట్ ‌సిటీ పనులు,  రింగ్‌ ‌రోడ్‌,  ‌మామునూరు ఎయిర్‌ ‌పోర్ట్ ‌పునరుద్దరణలంటి అంశాలపై రివ్యూ టింగ్‌ ఉం‌టుందని తెలిపారు. ఎన్నికల కోడ్‌ ఎఫెక్ట్ ‌వల్ల రెండు నెలలు పనులు చేయలేకపోయామని ఇప్పటికే నయింనగర్‌ ‌నాలా పనులు, బ్రిడ్జి నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. గ్రేటర్‌ ‌వరంగల్‌ ‌లో పెండింగ్‌  ‌పలనులను స్పీడ్‌ ‌గా పూర్తిచేసేందుకు సీఎం రివ్యూలో ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌ ‌రెడ్డి చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *