నేడు రైతుల ఖాతాల్లోకి పిఎం కిసాన్‌ ‌యోజన డబ్బులు

ఝార్ఖండ్‌ ‌నుంచి విడుదల చేయనున్న ప్రధాని
ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్, ‌నవంబర్‌ 14 : ‌నేడు పిఎం కిసాన్‌ ‌సమ్మాన్‌ ‌యోజన పథకం కింద రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ కానున్నాయి. బుధవారం ప్రధాని మోదీ ఝార్ఖండ్‌ ‌నుంచి ఉదయం 11.30 గంటలకు లబ్దిదారుల ఖాతాల్లోకి ఈ నిధులను విడుదల చేయనున్నారు. 15వ విడతగా అర్హులైన 8 కోట్ల మందికి పైగా రైతుల ఖాతాల్లోకి రూ. 2 వేల చొప్పున జమ చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ-కెవైసీ పూర్తి చేసిన వారందరి ఖాతాల్లోకి ఈ నిధులు జమకానున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *