- నాలుగు దశాబ్దాల క్రితం ఇదే రోజున అంటే …
- 1980 లోక్‌సభ ఎన్నికల ముందు భారతీయ జనతా పార్టీ పేరుతో ఎప్రిల్ 6న కొత్త రాజకీయ పార్టీని స్థాపించారు.
- ఈ నేపథ్యాన్ని పరిశీలిస్తే…
1951 అక్టోబర్ 21న ఢల్లీిలో శ్యాంప్రసాద్ ముఖర్జీ భారతీయ జనసంఫ్‌ు పార్టీని ఏర్పాటు చేశాడు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఫ్‌ు భావనలపై ఏర్పాటు చేసిన ఈ పార్టీకి ఎన్నికల చిహ్నంగా దీపం గుర్తు లభించింది. 1952లో జరిగిన పార్లమెంటు ఎన్నికలలో ఈ పార్టీకి 3 లోక్‌సభ స్థానాలు లభించాయి. అందులో ఒక స్థానం పార్టీ స్థాపకుడైన శ్యాంప్రసాద్ ముఖర్జీ విజయం సాధించింది. 1967 తరువాత ఈ పార్టీ బలపడిరది. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఫ్‌ు భావనలపై ఆధారపడిన పార్టీ కావడంతో ఈ పార్టీ హిందూ జాతీయవాద లక్షణాలను కలిగిఉంది. ఈ పార్టీలో ప్రముఖ స్థానాలను కలిగిన నాయకులు కూడా ఆర్.ఎస్.ఎస్ కార్యకర్తలే. 1964లో ఏర్పడిన విశ్వ హిందూ పరిషత్తు ఈ పార్టీకి సన్నిహితంగా ఉంది. జవహర్ లాల్ నెహ్రూ కాలంలో ఆయన సోషలిస్టు భావనలకు విసుగు చెందిన పలు భారతీయ జాతీయ కాంగ్రెస్ నేతలు ఈ పార్టీ పట్ల ఆకర్షితులయ్యారు. రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలలో ఈ పార్టీ ఉనికి నిలుపుకుంది.
1975లో దేశంలో ఇందిరా గాంధీ ప్రభుత్వం అత్యవసర పరిస్థితి విధించడంతో విపక్షాలకు చెందిన పలు నేతలను ఎలాంటి కారణం లేకుండానే జైళ్ళకు తరలించారు. అదే కాలంలో భారతీయ జనసంఫ్‌ు ప్రముఖ నేతలు కూడా జైలుజీవితం గడిపారు. 1977లో అత్యవసర పరిస్థితిని తొలిగించి ఎన్నికలు జరుపడంతో దేశంలో మారిన రాజకీయ సమీకరణాల వలన భారతీయ జనసంఫ్‌ుతో పాటు భారతీయ లోక్‌దళ్, కాంగ్రెస్ (ఓ), సోషలిస్ట్ పార్టీలు కలిసి ఉమ్మడిగా జనతా పార్టీని ఏర్పాటు చేసు కున్నాయి. 1951లో శ్యాంప్రసాద్ ముఖర్జీ చే స్థాపించబడిన జనసంఫ్‌ు 1977లో జనతా పార్టీలో విలీనం చేయబడిరది. ఎన్నికలలో ఈ పార్టీ విజయం సాధించడంతో భారతదేశంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన తొలి కాంగ్రెసేతర ప్రభుత్వంగా జనతా ప్రభుత్వం పేరు సంపాదించింది. మురార్జీ దేశాయ్ నేతృత్వం వహించిన జనతా ప్రభుత్వంలో పూర్వపు జనసంఫ్‌ు నేతలైన అటల్ బిహారీ వాజపేయికి విదేశాంగ మంత్రిత్వ శాఖ లభించగా, లాల్ కృష్ణ అద్వానీకి సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ లభించింది.
జనతా ప్రభుత్వం విచ్ఛిన్నం కావడంతో 1980 లోక్‌సభ ఎన్నికల ముందు జనసంఘ నేతలు జనతా పార్టీ నుండి బయటకు వచ్చి భారతీయ జనతా పార్టీ పేరుతో ఎప్రిల్ 6న కొత్త రాజకీయ పార్టీని స్థాపించారు. ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ భారత దేశంలో ప్రముఖ జాతీయ రాజకీయ పార్టీలలో ఒకటి. రాజకీయ కురు పితామహుడు అటల్ బిహారీ వాజపేయి భారతీయ జనతా పార్టీకి తొలి అధ్యక్షుడిగా పనిచేశారు. 1980లో ప్రారంభించిన ఈ పార్టీ దేశములోని హిందూ అధికసంఖ్యాక వర్గం యొక్క మత సాంఘిక, సాంస్కృతిక విలువల పరిరక్షణను ధ్యేయంగా చెప్పుకుంటుంది. సాంప్రదాయ సాంఘిక నియమాలు, దృఢమైన జాతీయ రక్షణ దీని భావ జాలాలు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఫ్‌ు ప్రధానపాత్ర పోషిస్తున్న సంఫ్‌ు పరివార్ కుటుంబానికి చెందిన వివిధ రకాల హిందూ జాతీయవాద సంస్థలు భారతీయ జనతా పార్టీకి కార్యకర్తల స్థాయిలో గట్టి మద్దతు ఇస్తున్నాయి.
1989 తరువాత ఈ పార్టీ బలపడిరది. అటల్ బిహారీ వాజపేయి 3 సార్లు ప్రధానమంత్రి పదవిని కూడా చేపట్టినారు. భాజపా, అనేక ఇతర పార్టీల మద్దతుతో 1999 నుండి 2004 వరకు భారతదేశ ప్రభుత్వము భారత కేంద్ర ప్రభుత్వాన్ని పాలించింది. దాని సీనియర్ నాయకులైన అటల్ బిహారీ వాజపేయి ప్రధాని గాను, లాల్ కృష్ణ అద్వానీ ఉప ప్రధాన మంత్రి గానూ పనిచేశారు. జాతీయ ప్రజాస్వామ్య కూటమిలో ప్రధాన పార్టీ అయిన భాజపా, భారత పార్లమెంటులో ప్రధాన ప్రతిపక్షముగా 2014 మే వరకు కొనసాగింది. సార్వత్రిక ఎన్నికలలో లోక్ సభ లోని 543 స్థానాలకు మునుపెన్నడూ లేనన్ని 281 స్థానాలు గెలుచుకున్న భాజపా (మిత్ర పక్షాలతో కలిసి జాతీయ ప్రజాస్వామ్య కూటమికి 337 స్థానాలు) నరేంద్ర మోడీ నాయకత్వంలో అధికారం చేబట్టింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో లోక్ సభ ఎన్నికల్లో 303 స్థానాల్లో విజయం సాధించింది. నరేంద్ర మోడీ నాయకత్వంలో మళ్లీ అధికారం చేపట్టింది. ప్రస్తుతం రెండవసారి నరేంద్ర మోడీ ప్రధానిగా బీజేపీ రెండవ ప్రభుత్వంగా కొనసాగుతున్నది.
-రామకిష్టయ్య సంగనభట్ల
9440595494





