నేడు టెన్త్‌ ఫలితాలు

ఉదయం 11 గంటలకు విద్యా శాఖ కార్యదర్శిచే విడుదల

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 29 :  తెలంగాణలో పదోతర గతి పబ్లిక్‌ పరీక్షల ఫలితాలను ఏప్రిల్‌ 30న మంగళవారం విడుదల చేయనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని ఎస్‌సిఇఆర్‌టి కాంప్లెక్స్‌, గోదావరి ఆడిటోరియలో విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం ఫలితాలను విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు.

ఈ ఏడాది మార్చి 18 నుంచి ఏప్రిల్‌ 2 వరకు రాష్ట్రవ్యాప్తంగా 2,676 పరీక్షా కేంద్రాల్లో టెన్త్‌ పరీక్షలు నిర్వహించారు. పరీక్షలకు మొత్తం 5,08,385 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇందులో బాలురు 2,57,952 మందిబీ బాలికలు 2,50,433 మంది ఉన్నారు. ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లోనూ అందుబాటులో ఉంచనున్నారు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *