కిషన్ రెడ్డి ఇంటిముందు విద్యార్థి సంఘాల ఆందోళన
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 22 : నీట్ పరీక్ష రద్దు చేయాలంటూ హైదరాబాద్ కాచిగూడలోని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంటి ఎదుట విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి ఇంటిని విద్యార్థి సంఘాల నేతలు ముట్టడిరచారు.
జాతీయ స్థాయి వైద్యవిద్య ప్రవేశ పరీక్ష నీట్‌లో అవకతవకలకు నైతిక బాధ్యత వహిస్తూ.. నీట్ ఛైర్మన్ రాజీనామా చేయాలంటూ నినాదాలు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళన చేస్తున్న బల్మూరి వెంకట్ సహా విద్యార్థి సంఘాల నాయకులను నల్లకుంట ఠాణాకు తరలించారు. ఇప్పటికైనా కేంద ప్రభుత్వం తక్షణం స్పందించి నీట్‌పై దిద్దుబాటు చర్యలు చేపట్టాలని బల్మూరి వెంకట్ డిమాండ్ చేశారు.





