కాకతీయ మెడికల్ కాలేజీలో మరో పిజి విద్యార్థిని లాస్య ఆత్మహత్యా యత్నం
వరంగల్, ప్రజాతంత్ర, జూన్ 24 : వరంగల్ కాకతీయ మెడికల్ కళాశాలలో నిద్రమాత్రలు వేసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ సంఘటన చోటు చేసుకుంది. పీజీ ఆర్థోపెటిక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న లాస్య స్వస్థలం హైదరాబాద్‌గా తెలుస్తుంది. మైగ్రేన్‌తో బాధపడుతున్న లాస్య శుక్రవారం రాత్రి 8ఎం లో విధులు నిర్వహించిన అనంతరం తలనొప్పి ఎక్కువ కావడంతో నిద్రమాత్రలు వేసుకున్నట్లు తెలుస్తున్నది.
దాంతో స్పృహ కోల్పోయిన లాస్యను ఎంజిఎం హాస్పిటల్‌కు తరలించగా వైద్యులు ఆమెకు చికిత్సనందిస్తున్నారు. కొద్ది కాలం క్రితం జరిగిన ప్రీతి ఘటన మరవక ముందే మరో ఘటనతో మెడికల్ కాలేజీ విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది. కాలేజీలో ఇలా వరుస సంఘటనలు చోటుచేసుకుంటుండడంతొ పీజీ విద్యార్థులు, ర్యాగింగ్‌కు గురవుతున్నారా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఏది ఏమైనా మెడికల్ కళాశాలలో జరుగుతున్న సంఘటనలు పలు అనుమానాలకు తావిస్తున్నాయి.



