లక్ష కోట్లుతో రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్…
వలసల వనపర్తిని వరి పంటల పర్తిగా మార్చాం…
ప్రజా ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి కెసిఆర్
వనపర్తి, ప్రజాతంత్ర, అక్టోబర్ 26 : దేశంలో ఏ రాష్ట్రంలో లేని రైతుబంధు. దళిత బంధు పథకాలను సృష్టించింది ఈ కేసీఆర్ అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. వనపర్తి జిల్లా కేంద్రంలో ప్రజా ఆశీర్వాద సభ లో మాట్లాడుతూ. లక్ష కోట్లు ఖర్చుపెట్టి రైతులకు 24 గంటల కరెంటు అందిస్తున్నామని ఆయన అన్నారు. గత పది సంవత్సరాల ముందు తెలంగాణ ప్రాంత అభివృద్ధి ఒక విధంగా ఉండేదని 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ ప్రాంతం అంతా పచ్చని పంటలుగా మారాయని ఆయన అన్నారు. తెలంగాణ ఉద్యమం పిరికెడు మందిలో నిరంజన్ రెడ్డి కూడా ఒకరని ఎమ్మెల్యేగా గెలిపించినందుకు ఉద్యమకారుడునికి మంత్రి పదవి ఇచ్చి సముచిత స్థానం కల్పించామని ఆయన అన్నారు. తెలంగాణ ప్రాంతం మొత్తం అభివృద్ధి చేసిన తర్వాత గతంలో అభివృద్ధిని విస్మరించిన అఖిలపక్ష పార్టీలు నేడు చిన్నతరం.
పెద్దతరం. లేకుం డా ఎట్లా మాట్లాడుతున్నారో చూడాలని ఆయన ప్రజలను కోరారు. 14 సంవత్సరాల ఉద్యమం లో గంజి నీళ్లు తాగి. చావు నోట్లో తలపెట్టిన తర్వాత రాష్ట్ర ం వచ్చిందని ఆయన గుర్తు చేశారు. కల్వకుర్తి లిఫ్టు తో పాటు డి8 కాలువ పనులకు మంత్రి నిరంజన్ రెడ్డి కొట్లాడి నిధులు తీసుకొచ్చి పనులు చేశారని ఆయన అన్నారు. ఏదుల రిజర్వాయర్‌కు కాంగ్రెస్ వంటి పార్టీలు అక్కడ ప్రజలను రెచ్చగొట్టి సమస్యలను సృష్టించిన కూడా పనులు వేగవంతం చేసి వనపర్తి జిల్లాకు సాగునీరు తీసుకువచ్చిన ఘనత నిరంజన్ రెడ్డిది అని ఆయన అన్నారు. ప్రస్తుతం అడ్డంపొడువు మాట్లాడుతు నోళ్లంతా.. నాడు ఎవరి బూట్లు మోసుకుం టు ఉన్నరో ప్రజలకు తెలుసునని సీఎం కేసీఆర్ అని విమర్శించారు. ఎన్నికలు వచ్చేశాయ్. తెలంగాణ సాధన తర్వాత పదో సంవత్సరం జరుగుతున్నది.

ఈ పదేళ్లలో ఏం జరిగిందో అదంతా నిలువెత్తుగా కళ్ల ముందు ఉన్నది. నేను మిమ్మల్ని ప్రార్థించేది ఒక్కటే. ఎలక్షన్లు చాలాసార్లు వస్తుంటాయ్.. పోతుంటాయ్. నేను చెప్పే నాలుగుమాటలను గ్రామాలు, బస్తీలకు పోయిన తర్వాత చర్చ జరుపాలని కోరుతున్నాను. నిజానిజాలు తేల్చాలని కోరుతున్నాను. కారణం ఏంటంటే రు పేపర్లలో చూస్తున్నారని అన్నారు. 24ఏళ్ల నాడు పిడికెడు మందిమి.. ఇందులో నిరంజన్‌రెడ్డి ఒక్కరూ. ఎవరూ లేనినాడు ఉద్యమాన్ని ప్రారంభించాం. ఆ నాడు ఎవరు ఎక్కడ ఉన్నరో తెలుసు. ఎవరి బూట్లు మోసుకుంటు ఉన్నరో కు తెలుసు. కానీ, ఇవాళ కేసీఆర్ నువ్వు కొడంగల్‌కు రా.. అని ఒకడు. నువ్వు గాంధీ బొమ్మకాడికి ఇంకొకడు. 119 నియోజకవర్గాల్లో కేసీఆర్‌లు ఉన్నారు.
వనపర్తి కేసీఆర్ నా పక్కన నిలబడి ఉన్నడు కాదా? నీ దమ్ము.. నా దమ్ము ఏంటంటే.. ఏ దమ్ము లేకుండా.. దమ్ము కోల్పోయి.. గంజి కేంద్రాలు, అంబలి కేంద్రాలకు ఆలవాలమైన పాత మహబూబ్‌నగర్ జిల్లా ఆ నాడు వలసపడి, గోసపడి ఎవరో వచ్చి గంజి, అంబలి కేంద్రాలు పెడితే బతకాలని ఒక శాపగ్రస్తమైన జిల్లా. ఆ నాడు పక్షుల్లా తిరుగుతుంటే ఈ నాడు ఉన్న నాయకులు ఎక్కడున్నరో కు తెలుసు’ అని చెప్పారు.అవాకులు, చెవాకులు.. చిన్న పెద్దంతరం లేకుండా నోటికి వచ్చేది వాగేది ఎవలో.. వాళ్లు ఏం పనిలో ఉన్నరో కు తెలుసు. మేం తిరిగిన నాడు.. ధైర్యం లేదు.. మంది లేరు.. నాయకులు లేరు. మంత్రి పదవులు లేవు అయినా పక్షుల్లా రాష్ట్రం నలుమూలల కలియదిగిరి.. జానాన్ని చైతన్యపరిచి.. అద్భుతమైన పాటలు రాసి..
ఇవాళ లేడు కానీ.. నా తమ్ముడు సాయిచంద్, గోరటి వెంకన్నలాంటి కవులు కళాకారులు.. ఎందరో బిడ్డలను ఏకం చేసి తెలంగాణ ఒక్క గొంతై నినదిస్తే అదికూడా 2004లో మన పొత్తుతో గెలిచి.. మన ఆగం చేయాలని చూసి.. 14 సంవత్సరాల తర్వాత నేను చావునోట్లో తలకాయపెట్టి చావునోట్లో ఆమరణ నిరాహార దీక్షకు కూసుకుంటే తెలంగాణ వచ్చింది. ఇవాళ మాట్లాడేది ఎవరో.. ఆ నాడు పోట్లాడింది ఎవరో ఆలోచన చేయాలని కోరుతున్నానన్నారు.గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రులు పెద్ద పెద్ద మంత్రులు ఉన్నారని కానీ మెడికల్ కాలేజీ గాని ఇంజనీరింగ్ కాలేజీలు కానీ తీసుకొచ్చారని ఆయన ప్రశ్నించారు. మహబూబ్‌నగర్ ఉమ్మడి జిల్లాకు ఐదు మెడికల్ కళాశాలలో కేటాయించిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. పశు వైద్య నూతన కళాశాలను మంజూరు చేయాలని నిరంజన్ రెడ్డి అడుగుతున్నాడని రాబోయే కాలంలో మంజూరు చేస్తానని ఆయన అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ముస్లిం మైనార్టీల వోటు వేయించుకొని బీదవారిని చేశారని.
కానీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో మైనార్టీ గురుకుల షాదీ ముబారక్ రంజాన్ పండుగ సందర్భంగా పథకాలు వంటి ప్రవేశపెట్టి ఆదుకున్నామని ఆయన అన్నారు. ఆసరా పెన్షన్ ఎందుకంటే ప్రమాదంలో కాలు చెయ్యి విరిగి వికలాంగులుగా మారిన వారు. భర్త లేని మహిళలకు. కురవృద్ధులకు ఆసరాగా ఉండాలనే ఉద్దేశంతో పథకాన్ని ప్రవేశ పెట్టడం జరిగిందని ఆయన అన్నారు. రైతు బిడ్డను కాబట్టే ధరణి పోర్టల్ ను ప్రవేశపెట్టానని. రైతు బోటన వేలు ముద్రబెడితేనే భూమి మార్పిడి జరుగుతుందాన్ని. గతంలో వీఆర్వోలు. ఆర్ఐలు. ఎమ్మార్వోలు. జాయింట్ కలెక్టర్లు. కలెక్టర్లు ద్వారా రైతుల భూమార్పిడితో ఇబ్బందులు పడేవారని మోసపడి. గోసపడి. భూమికోసం హత్యలు కూడా చేసుకునేవారని ప్రస్తుత పరిస్థితి లేదని ఆయన అన్నారు.
అంతకుముందు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ వనపర్తి కి సాగునీరు తీసుకొచ్చి ఒక లక్ష 25 వేల ఎకరాలను ఒక లక్ష 25 వేల ఎకరాలను భూమిని సాగులోకి తీసుకొచ్చామని ఆయన అన్నారు. వనపర్తి నియోజకవర్గన్ని అభివృద్ధి చేశానని. ప్రస్తుతం మళ్ళీ మీ ముందుకు వచ్చానని ఆయన అన్నారు. ఇక్కడ వరి పంట తో పాటు వేరుశనగ పంటలు బాగా పండుతున్నాయని పరిశ్రమలు ఇక్కడికి అవసరమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్. ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్ రెడ్డి. అబ్రహం. మధుసూదనా చారి. దేశపతి శ్రీనివాసులు. గిడ్డంగుల సంస్థ చైర్మన్ రజిని సాయిచంద్. మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్ రెడ్డి. మంద జగన్నాథం. గట్టు చిన్న తిమ్మప్ప. వెంకటేశ్వర్ రెడ్డి. బండారి భాస్కర్. ప్రమోద్ కుమార్ రెడ్డి. గట్టు యాదవ్. కురుమూర్తి యాదవ్. లక్ష్మయ్య. తదితరులు పాల్గొన్నారు..