దేశంలో పెండింగ్‌ ‌కేసులే అతిపెద్ద సమస్య

  • లిస్టింగ్‌ ‌విషయంలో తీవ్ర జాప్యం
  • సారీ.. పరిష్కరించలేకపోయా
  • పదవీ విరమణ సందర్భంగా సిజెఐ ఎన్వీ రమణ
  • ఉచిత వాగ్దానాలపై సుప్రీమ్‌ ‌కోర్టులో చర్చ… అంశంలో సంక్లిష్టత నేపథ్యంలో కేసును త్రిసభ్య ధర్మాసనానికి రిఫర్‌

న్యూ దిల్లీ, అగస్ట్ 26 : ‌దేశంలో పెండింగ్‌ ‌కేసులు పెను సమస్యగా మారాయని, కానీ భారతీయ న్యాయ వ్యవస్థను ఒక్క ఆదేశంతో లేదా ఒక తీర్పుతో నిర్ణయించలేమని జస్టిస్‌ ఉన్వీ రమణ అన్నారు. కేసుల లిస్టింగ్‌, ‌పోస్టింగ్‌ అం‌శంలో జాప్యం జరుగుతుందని, ఈ అంశంపై దృష్టి పెట్టలేకపోయినట్లు ఎన్వీ రమణ అన్నారు. ఈ క్రమంలో సీజేఐ ఎన్వీ రమణ సారీ చెప్పారు. శుక్రవారం రిటైర్‌ అవుతున్న సందర్భంగా సుప్రీమ్‌ ‌కోర్టులో కేసుల లిస్టింగ్‌ అం‌శంలో జరుగుతున్న జాప్యం పట్ల ఆయన క్షమాపణలు తెలిపారు. కోర్టులోని ఆఫీసర్లే ఈ వ్యవస్థ విశ్వసనీయతను కాపాడాలన్నారు. విశ్వసనీయతను రక్షించలేని క్షణం సమాజంలో ప్రజల నుంచి గౌరవాన్ని పొందలేమన్నారు. భారతీయ న్యాయవ్యవస్థ కాలక్రమేన వృద్ధి చెందిందని, దీన్ని ఒక్క తీర్పుతో అభివర్ణించలేమన్నారు. ఈ వ్యవస్థలోని న్యాయమూర్తిని రక్షించే బాధ్యత బెంచ్‌, ‌బార్‌ ‌వి•దే ఆధారపడి ఉంటుందని ఎన్వీ రమణ తెలిపారు. కోర్టు సమస్యల్ని పరిష్కరించేందుకు ఆధునిక టెక్నాలజీ, ఆర్టిఫిషియల్‌ ఇం‌టెలిజెన్స్ అవసరమని ఆయన అన్నారు. బార్‌ ‌సహకరిస్తేనే కోర్టులో మార్పులు సాధ్యమన్నారు. జూనియర్లను సరైన పథంలో నడిపించాలని ఆయన బార్‌ ‌సీనియర్‌ ‌సభ్యుల్ని కోరారు.

ఉచిత వాగ్దానాలపై సుప్రీమ్‌ ‌కోర్టులో చర్చ… అంశంలో సంక్లిష్టత నేపథ్యంలో కేసును త్రిసభ్య ధర్మాసనానికి రిఫర్‌
‌రాజకీయ పార్టీలు ఇచ్చే ఉచిత వాగ్దానాల అంశం గురించి శుక్రవారం సుప్రీమ్‌ ‌కోర్టులో విచారణ జరిగింది. ఈ అంశాన్ని నిపుణుల కమిటీ పరిశీలించాలని సీజేఐ ఎన్వీ రమణ తెలిపారు. అఖిల పక్ష భేటీలో దీన్ని చర్చించాలని ఆయన అన్నారు. అయితే ఇవాళ తొలిసారి జరిగిన లైవ్‌ ‌స్ట్రీమిగ్‌లో ఈ కేసును విచారించారు. ఎన్నికల వేళ రాజకీయ పార్టీలు ఉచిత వాగ్దానాలు ఇస్తున్నాయని, ఆ పార్టీల గుర్తింపు ఎత్తివేయాలని దాఖలైన పిటిషన్లపై విచారణ జరిగింది. ప్రజాస్వామ్యంలో అసలైన శక్తి వోటరు వద్దే ఉంటుందని, వాళ్లే పార్టీలను, అభ్యర్థులను ఎంపిక చేస్తారని సీజే రమణ అన్నారు. అయితే ఈ అంశాన్ని పరిశీలించేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు సీజే అన్నారు. ఈ అంశంపై ఆల్‌ ‌పార్టీ వి•టింగ్‌ ‌కూడా ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరినట్లు సీజే గుర్తు చేశారు. తాము చేస్తున్న వాగ్దానాలు ఉచితాలు కాదని, అవి సంక్షేమ పథకాలని అనేక రాజకీయ పార్టీలు కోర్టులో వాదించాయి. అయితే ఇలాంటి కేసుకు సంబంధించిన 2013 నాటి తీర్పును పరిశీలించనున్నట్లు కోర్టు తెలిపింది. ఉచితాల అంశంలోని సంక్లిష్టత నేపథ్యంలో కేసును త్రిసభ్య ధర్మాసనానికి రిఫర్‌ ‌చేస్తున్నట్లు సుప్రీమ్‌ ‌కోర్టు తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *