దేశంలో అన్ని ప్రాంతాల ప్రజలకు మహేశ్వరం నిలయం

మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి
* కారు గుర్తు పై ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి

మహేశ్వరం అర్బన్‌ , ప్రజాతంత్ర, నవంబర్‌ 19: భరత దేశంలో అన్ని ప్రాంతాల ప్రజలకు మహేశ్వరం నియోజకవర్గం నిలయంగా మరిందని అందరు అన్నదమ్ములు వల్లే ఉంటూ ఈ ప్రాంత అభివృద్ధిలో భాగస్వాములు అవుతున్నారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి అన్నారు.శనివారం రాత్రి రాజస్థాన్‌ చత్రియ సమాజ్‌ అధ్వర్యంలో మహేశ్వరం పోతర్ల బాబయ్య ఫంక్షన్‌ హాల్‌ ఏర్పాటు చేసిన మార్వాడిల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమాని జెడ్పీ చైర్‌ పర్సన్‌  తీగల అనితారెడ్డితో కలిసి మంత్రి సబితా ఇంద్రారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఈ సందర్భంగా ఆమె మట్లాడుతు ఈ ప్రాంతంలో దేశంలో వ్యాపార వాణిజ్య సంస్థలె కాకుండా ప్యాక్స్‌ ఖాన్‌, ఆమెజాన్‌, మాల్బార్‌ గోల్డ్‌ లాంటి జాతీయ, అంతర్జాతీయ ప్రపంచ స్థాయి సంస్థలకు ఈ ప్రాంతం మారిందన్నారు.

రాజస్థాని సమాజ్‌ వారి సమస్యల పరిష్కారానికి కృషిచేస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికల అనంతరం సమాజ్‌ భవన నిర్మాణానికి స్థలం కేటాయిస్తామన్నారు. ఈ నెల 30న జరిగే ఎన్నికల్లో ఈవిఎంలో కె నెంబర్‌ ఉండే కారు గుర్తు పై ఓటు వెసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. మర్పాడిల అందరు సబితమ్మకు సంపూర్ణ మద్దతు ప్రకటించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్వాడిల సంఘం అద్యక్షుడు గణేష్‌,ప్రధాన కార్యదర్శి బికారం,బి ఆర్‌ ఎస్‌ నాయకులు కర్నాటి మనోహర్‌, కరోళ్ల చంద్రయ్య, కూన యాదయ్య, పి అంబయ్య యాదవ్‌, ఎన్‌ సుధీర్‌ గౌడ్‌, దోమ శ్రీనివాస్‌ రెడ్డి, కంది రమేష్‌,కడమోని ప్రభాకర్‌, పోల్కం బాలయ్య, , ఆదిల్‌ అలీ, ఎం సమీర్‌, బోలారం, ఓం ప్రకాష్‌ రాజు రామ్‌, లుంబారం జగదీష్‌ చౌదరి, చిలారం తో మహిళలు తధితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *