తొమ్మిదేండ్ల ప్రగతి నివేదన ప్రజామోదం..!

తెలంగాణ ఉద్య మంలో నీళ్లు, నిధులు, నియా మకాలు అనే నినాదంతో కొట్లాడి తెచ్చుకున్న స్వరా ష్ట్రంలో ఉద్యమ నేత, నేటి ముఖ్య మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ ‌రావు ఉద్యమ సమయంలో ఎలాగైతే తెలం గాణ అవసరం ఎందుకో నిరం తర చర్చ జరిగిలా ఆనాడు బహిరంగసభలు నిర్వహించి, తెలంగాణ ఉద్యమ వ్యాప్తిని విశ్వం వ్యాప్తం చేసి సాకారం చేసినారో..తెలంగాణ సీఎం గా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత రాష్ట్రంలో తొమ్మిదేండ్లలో జరిగిన అభివృద్ధి, చేయాల్సిన ప్రగతిపై మూడోవ దఫా ఎన్నికల్లోకి వెళుతున్న క్రమంలో పూసగుచ్చినట్టు వివరించేం దుకు ఆశీర్వా దాసభలను వేదికగా ఎంచుకొని దిశానిర్దేశం చేస్తున్నారు.

నాటి బీఆర్‌ఎస్‌ ‌పార్టీ ఆవిర్భావం సందర్భంగా 2001లో ఏర్పాటు చేసిన కరీంనగర్‌ ‌సభనుంచి, రాష్ట్రంలో జరిగిన పలు ఉపఎన్నికల్లో నిర్వహించిన సభలు కేసీఆర్‌ ‌నాయకత్వాన్ని సమర్థిస్తూ గులాబీ జెండా రెపరెపలాడేందుకు దోహదపడింది.అందుకే తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారి పట్టం కట్టింది.2016లో వరంగల్‌ ‌సభకు విశేష స్పందన లభించింది.తెలంగాణ ప్రధాత కేసీఆర్‌ ‌కు వెన్నుదన్నుగా నిలిచింది.2018 సెప్టెంబర్‌ 2,‌రంగారెడ్డి జిల్లా,కొంగరకలాన్‌ ‌సభలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పథకాలు,సాధించిన అభివృద్ధి, ప్రగతి నివేదనతో ప్రజలు ప్రతిపక్షాల కలలు పటాపంచలు చేస్తూ రెండోసారి ఘనవిజయాన్ని కట్టబెట్టారు. కేసీఆర్‌ అం‌టే తెలంగాణ ..తెలంగాణ అంటే కేసీఆర్‌ అన్న రీతిలో ఎక్కడ తగ్గాలో,ఎక్కడ నెగ్గాలో తెలిసిన లౌక్యంతో రాజకీయ వ్యవస్థలో ఒక ట్రెండ్‌ ‌సెట్టర్‌ ‌గా మారారు.ఈ లాజిక్‌ ‌తోనే బీఆర్‌ఎస్‌ అ‌ప్రతిహత విజయాలతో జైత్రయాత్ర సాగిస్తున్నది.ఈ నెల 15వ తేదీన హుస్నాబాద్‌ ‌లో ఎన్నికల శంఖారావాన్ని పూరించిన బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ‌మొదటి దశలో ఏడు నియోజకవర్గాల్లో ప్రజా ఆశీర్వా దాసభలు విజయవంతం అయ్యాయి.ప్రతీ సభకు అశేషమైన సంఖ్యలో ప్రజానీకం హాజరయ్యారు.భవిష్యత్‌ ఆకాంక్షల నెరవేర్చేందుకు బీఆర్‌ఎస్‌ ‌హ్యాట్రిక్‌ ‌కొట్టాలని తెలంగాణ సమాజం ఆరాటపడుతుంది.

తెలంగాణ నూతన రాష్ట్రంలో అడుగడుగునా అడ్డంకులు సృష్టించిన ఇసమంతు కూడా జంకలేదు.ప్రజలకు సుపరిపాలన అందించేందుకు సైనికుడు లా కేసీఆర్‌ ‌పడ్డ కఠోర శ్రమ వృధా కాలేదు. తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్‌ ‌వన్‌ ‌గా తీర్చిదిద్దారు.కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఒకానొక సందర్భములో ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నం ముమ్మరం చేసి ద్రోహిగా నిలబడ్డది.తొమ్మిది ప్రభుత్వాలను కూలగొట్టిన మోడీ అనుభవం తెలంగాణ ప్రజల చైతన్యం ముందు తలొగ్గక తప్పలేదు. ప్రతిపక్షాలు టికెట్ల పంపకం పూర్తికాకముందే రెండవ దఫా ప్రచారంలో భాగంగా 36 సభల షెడ్యూల్‌ ఇవ్వడంతో ప్రతిపక్షాలు ఆత్మరక్షణలో పడ్డారనే చెప్పవచ్చు.ఇంతెందుకు ఒక్కొక్కసభతో తెలంగాణ ప్రజల్లో ఒకరకమైన చర్చ జరుగుతుందంటే అతిశయోక్తికాదు.

విచిత్రం ఏమిటంటే సీఎం కేసీఆర్‌ ‌ప్రతిపక్షాల కుట్రల తెరువు పోకుండా చేసిన అభివృద్ధి పై వివరించి మళ్ళి ఆశీర్వదిస్తే ఏం చేస్తామో ప్రజలకు వివరిస్తున్నారు. అధికారం మాట దేవుడెరుగుకాని, అభ్యర్థులు దొరకక ఇప్పటికి మల్లగుల్లాలు పడుతున్నారు. ఒకపార్టీలో కుస్తీలు పడుతున్నారు. రెండవ దశ ప్రచారంలో ఏం చెబుతారేమోనని ప్రతిపక్షాలే కాదు, పౌర సమాజం ఎదిరిచూస్తున్నది.ఇప్పటికే నీళ్లు,నిధులు నియామకాలతో సీఎం కేసీఆర్‌ ‌విప్లవాత్మక మార్పులు తీసుకవచ్చారు. తొమ్మిదేండ్లలో తెలంగాణ ప్రభుత్వం సాధించిన ప్రగతిని ఆశీర్వాదాసభల్లో శ్వేతపత్రంగా తన మాటల్లో చెప్పి, బీఆర్‌ఎస్‌ ‌నూతన సంస్కృతికి నాంది పలికింది. తెలంగాణ ప్రజలు కలలు కన్నా బంగారు తెలంగాణ ఇక ఆమెడదూరంలో ఉన్నది, ఇది కేసీఆర్‌ ‌ముఖ్యమంత్రిగా ఉంటేనే సాధ్యం అవుతుందని సబ్బండ వర్గాలు బలంగా నమ్ముతున్నారనేది నిర్వివాదాంశం.

ప్రతిపక్షాలు కేసీఆర్‌ ‌ప్రభుత్వం పై పనిగట్టుకొని గోబెల్స్ ‌ప్రచారం చేసినా 2018లో  ప్రజలు మళ్ళీ కేసీఆర్‌ ‌సర్కార్‌ ‌నే గద్దె నెక్కించారు. 2014లో కంటే కూడా ఎక్కువ సంఖ్యాబలాన్ని అందించారు. దశాబ్ద కాలంగా అధికారానికి దూరమైన వారంటీ లేని కాంగ్రెస్‌ ఆరు గ్యారెంటీ పథకాలతో మేనిఫెస్టో విడుదల చేసి హడాహుడి చేస్తుంది.విశ్వసనీయత అనేది ఆయా పార్టీల గతం, వర్తమానం మీద ఆధారపడి ఉంటుంది. కేసీఆర్‌ ‌మాత్రం నాలుగు గోడల మధ్య ప్రసంగాలకు ఇష్టపడలేదు, ప్రజల్లోకి వెల్లితేనే నిజాలు తెలుస్తాయని బలంగా నమ్మి,బహిరంగసభలే ఆయువు పట్టుగా భావించారు. ఉద్యమ సమయంలో సభల నిర్వహణ సత్పలితాలు ఇచ్చాయి, రాష్ట్ర ఏర్పాటు తర్వాత తెలంగాణ ప్రభుత్వం చేసిన అభివృద్ధి,సంక్షేమ పథకాలు,సాధించిన ఫలితాలు భవిష్యత్‌ ‌కాలంలో చేయబోయే కార్యక్రమాలు ప్రజలకు వివరించడానికి సరైన వేదికగా గట్టిగా నమ్ముతారు.అదే వేదిక ద్వారా వచ్చే ఎన్నికల్లో నేను అభివృద్ధి చేయలేదని భావిస్తే నాకు ఓట్లు వేయకండని ముక్కు చూటీగా చెప్పి ప్రజలే న్యాయనిర్ణేతలంటూ తన ప్రతిపాదన ముందుంచారు. తెలంగాణ నాలుగు కోట్ల ప్రజల మనోభావాలను కేసీఆర్‌ ఒక్క గొంతుకతో సమూలంగా ఆవిష్కరించే నేర్పరితనం,సభల నిర్వహణలో బీఆర్‌ఎస్‌ ‌ది అందెవేసిన చేయి, సభ సాక్షిగా కేసీఆర్‌ ‌భవిష్యత్‌ ‌ప్రణాళికలను, సాధించిన ప్రగతిని, చేదించిన కుట్రలను ప్రజల ముందు ఉంచి శభాష్‌ అనిపించుకున్న రోజులు మర్చిపోలేదు. బీఆర్‌ఎస్‌ ‌ప్రకటించిన అభ్యర్థులలో స్వంత బలం ఉన్నా, లేకున్నా కేసీఆర్‌ ‌పేరుతోనే విజయదుందుభి మోగిస్తారనేది స్పష్టమవుతుంది. ఊక దంపుడు ఉపన్యాసాలు ఇవ్వడానికి ఎందరు టూరిస్టులు వచ్చినా ప్రజాస్వామ్యంలో అంతిమ నిర్ణేతలు ప్రజలే.
image.png
డా. సంగనిమల్లేశ్వర్‌
‌విభాగాధిపతి, జర్నలిజం శాఖ,
కాకతీయ విశ్వవిద్యాలయం,
వరంగల్‌, 9866255355

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *