తెలంగాణకు భారీ వర్ష సూచన

ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం
పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్

‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 29 : ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుంది. అల్పపీడనం కారణంగా రాష్ట్రంలో వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్‌ ‌వాతావరణశాఖ వెల్లడించింది. రెండ్రోజుల పాటు తెలంగాణలో మోస్తరు వర్షాలకు అవకాశం ఉందని వెల్లడించింది. పలు జిల్లాలకు వర్షాల నేపథ్యంలో ఎల్లో అలర్ట్ ‌జారీ చేసింది. నేడు, రేపు హైదరాబాద్‌లో తేలికపాటి వర్షాలకు ఛాన్స్ ఉం‌దని తెలిపింది. కరీంనగర్‌, ‌పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, ఖమ్మం,కొత్తగూడెం, వికారాబాద్‌ ‌సంగారెడ్డి, మెదక్‌, ‌కామారెడ్డి..ఉమ్మడి మహబూబ్‌నగర్‌ ‌జిల్లాల్లో ఈదురుగాలూలతో కూడిన మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని తెలిపింది.

బలమైన/ స్థిరమైన ఉపరితల గాలులు రాష్ట్రంలోని ఆదిలాబాద్‌, ‌కొమరంభీం ఆసిఫాబాద్‌, ‌మంచిర్యాల, నిర్మల్‌, ‌కరీంనగర్‌, ‌పెద్దపల్లి, జయశంకర్‌ ‌భూపాలపల్లి, ములుగు, భదాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, ‌వరంగల్‌, ‌హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, మేడ్చల్‌ ‌మల్కాజిగిరి, సంగారెడ్డి, మెదక్‌, ‌కామారెడ్డి జిల్లాలలో వీచే అవకాశం ఉంది.అల్పపీడనం, రుతుపవనాలు చురుగ్గా మారడంతో ఉత్తర కోస్తాకు భారీ వర్ష సూచన చేసింది వాతావరణశాఖ.. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. గంటకు 55 కిలోవి•టర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని పేర్కొంది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారుల సూచనలు చేశారు. రానున్న రెండు రోజులు ఏపీలో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ చెబుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *