తెలంగాణ ఆత్మగౌరవం దిల్లీలో తాకట్టు

వైద్యానికి పెద్దపీట వేస్తానని..కార్పొరేట్‌కు దాసోహం
వి•డియాపై ఆంక్షలు, విద్యార్థులపై లాఠీ చార్ఝ్ అ‌ప్రజాస్వామికం
సిఎం రేంవత్‌ ‌తీరుపై మండిపడ్డ బిజెపి శాసన సభా పక్ష నేత ఏలేటి

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 1 : తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని సీఎం రేవంత్‌ ‌రెడ్డి దిల్లీలో తాకట్టు పెట్టారని భాజపా శాసన సభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్‌ ‌రెడ్డి విమర్శించారు. వైద్యానికి పెద్దపీట వేస్తామన్న ముఖ్యమంత్రి కార్పొరేట్‌ ‌హాస్పిటళ్లను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. వరంగల్‌లో కార్పొరేట్‌ ‌హాస్పిటల్‌ని ముఖ్యమంత్రి ప్రారంభించి..కార్పొరేట్‌ను ప్రోత్సహిస్తున్నారన్నారు. గాంధీ హాస్పిటల్‌ ‌వద్ద వి•డియాకు ఆంక్షలు విధించడమే ప్రజాపాలనా అని ప్రశ్నించారు. నిరుద్యోగ యువతపై కనికరం లేకుండా లాఠీఛార్జ్ ‌చేయించడం అప్రజాస్వామికమన్నారు. రాష్ట్రంలో రెండు లక్షల ఉద్యోగాలు ఎప్పటి వరకు భర్తీ చేస్తారో చెప్పాలని డిమాండ్‌ ‌చేశారు.

 

ఎమ్మెల్యేలు పార్టీ మారితే వారి ఇళ్ల ముందు చావు డప్పు కొట్టమన్నారు. ఇప్పుడు భారాస ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌ ‌పార్టీ చేర్చుకుంటోంది. మరి ఆ ఎమ్మెల్యేల ఇంటి ముందు ఏ డప్పు కొట్టాలో చెప్పాలని ప్రశ్నించారు. పార్టీ ఫిరాయింపులపై స్పీకర్‌కు ఫిర్యాదు చేద్దామంటే అందుబాటులో ఉండటం లేదు.. సమయం ఇవ్వడం లేదు. పౌర సరఫరాల శాఖ అవినీతిపై ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి సమాధానం చెప్పడం లేదు. పీడీఎస్‌ ‌బియ్యాన్ని రీసైక్లింగ్‌ ‌చేస్తూ.. అతిపెద్ద కుంభకోణానికి పాల్పడుతు న్నారు. నీటి పారుదల, పౌర సరఫరాలశాఖలో జరుగుతున్న అవినీతిని ఆధారాలతో సహా త్వరలో బయట పెడతా. అవినీతిని అసెంబ్లీలో ప్రశ్నిస్తా.. వి•డియా ముందు పవర్‌ ‌పాయింట్‌ ‌ప్రజెంటేషన్‌ ఇస్తా. దానం నాగేందర్‌పై అనర్హత పిటిషన్‌ ఇస్తున్నాం. త్వరలో  పార్టీ మారిన మిగతా ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్‌ ‌వేస్తాం. దానం ఒక పార్టీ ఎమ్మెల్యేగా ఉండి.. మరో పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేశారు అని మహేశ్వర్‌ ‌రెడ్డి విమర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *