డ్రగ్స్ కేసులో రోహిత్ రెడ్డికి బెయిల్

– రేపు జైలు నుంచి విడుదలయ్యే అవకాశం

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 28 : మొయినాబాద్ ఫాంహౌస్ డ్రగ్స్ కేసులో తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో గత మార్చి 14న రాత్రి రోహిత్‌ను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో మొత్తం ముగ్గురిని అరెస్టు చేశారు. వారిలో పైలట్ రోహిత్ రెడ్డి, ఆయన సోదరుడు రితేష్ రెడ్డి, వ్యాపారవేత్త నమిత్ శర్మ ఉన్నారు. రోహిత్ రెడ్డి తరఫున మాత్రమే న్యాయవాదులు హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. బెయిల్ మంజూరు కావడంతో బుధవారం చంచల్‌గూడ జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మార్చి 14న మొయినాబాద్ ఫాంహౌస్‌లో దాడులు చేసిన పోలీసులు కొకైన్, లిక్కర్ బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. పార్టీలో పాల్గొన్న 11మందికి డ్రగ్స్ పరీక్షలు నిర్వహించగా వారిలో ఆరుగురికి డ్రగ్స్ పాజిటివ్‌గా తేలింది. ఈ కేసులో రోహిత్ రెడ్డి నెలకుపైగా చంచల్‌గూడ జైలులో ఉన్నారు. ఏపీ¾కి చెందిన ఓ ఎంపీ కూడా దొరికినా స్టేషన్ బెయిల్‌తో బయటకు వచ్చారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *