డిలిమిటేషన్‌లో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం

ఆయా రాష్ట్రాలు తమ వాణిని వినిపించాల్సందే
ట్విట్టర్‌ ‌వేదికగా మంత్రి కెటిఆర్‌ ‌పిలుపు

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే30 :  2026వ సంవత్సరం తర్వాత జనాభా ప్రతిపాదికన జరుగనున్న లోక్‌సభ స్థానాల వల్ల దక్షిణాది రాష్టాల్రకు  తీవ్రమైన అన్యాయం జరుగుతుందని మంత్రి కె.తారక రామారావు అన్నారు. అధిక జనాభాతో సతమతమవుతున్న దేశాన్ని కాపాడుకునేందుకు జనాభా నియంత్రణ పద్ధతులు పాటించాలని దశాబ్దాల నుంచి కేంద్రం చెబుతున్న మాటలను, విధానాలను నమ్మి ప్రగతిశీల విధానాలతో జనాభా నియంత్రణ చేసిన దక్షిణాది రాష్టాల్రు ఈరోజు తీవ్ర అన్యాయానికి లోనయ్యే అవకాశం ఉందన్నారు. ప్రగతిశీల విధానాలతో ముందుకు పోతున్న దక్షిణాది రాష్టాల్రు ఈ నూతన డిలిమిటేషన్‌ ‌వల్ల తక్కువ లోక్‌సభ స్థానాలు పొందడం అన్యాయం, బాధాకరమని ట్విట్టర్‌ ‌వేదికగా తెలిపారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వ విజ్ఞప్తులను పట్టించుకోకుండా జనాభా నియంత్రణ చేయని రాష్టాల్రు, ముఖ్యంగా ఉత్తరాది రాష్టాల్రు లోక్‌సభ సీట్ల పెంపులో లబ్దిపొందుతున్నాయని.. ఇది దురదృష్టకరమన్నారు. జనాభాను నియంత్రించిన కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ , ‌కర్ణాటక, తెలంగాణ రాష్టాల్రు  తమ ప్రగతిశీల విధానాలకు తీవ్రంగా శిక్షించబడుతున్నాయని మంత్రి కేటీఆర్‌ ‌వెల్లడించారు. కేవలం జనాభా
నియంత్రణ మాత్రమే కాకుండా అన్ని రకాల మానవాభివృద్ధి సూచీల్లోనూ దక్షిణాది రాష్టాల్రు ముందు వరుసలో ఉన్నాయని చెప్పారు. కేవలం 18 శాతం జనాభా కలిగిన దక్షిణాది రాష్టాల్రు 35 శాతం జాతీయ స్థూల జాతీయోత్పత్తికి నిధులు అందిస్తున్నాయని తెలిపారు. జాతీయ ఆర్థిక అభివృద్ధికి, దేశ అభివృద్ధికి ఎంతగానో దోహదం చేస్తున్న దక్షిణాది రాష్టాల్రు అసంబద్ధమైన లోక్‌సభ డిలిమిటేషన్‌ ‌విధానం వల్ల భవిష్యత్తులో తమ ప్రాధాన్యత కోల్పోరాదని చెప్పారు. తమ ప్రగతిశీల విధానాలకు లబ్దిపొందాల్సిన చోట తీవ్రమైన అన్యాయానికి గురవుతున్న దక్షిణాది రాష్టాల్రు వాణిని వినిపించాల్సిన అవసరం ఉన్నదని, ఈ విషయంలో రాజకీయాలకు అతీతంగా జరుగుతున్న అన్యాయంపైన నాయకులు, ప్రజలు గళమెత్తాలని మంత్రి కేటీఆర్‌ ‌పిలుపునిచ్చారు

ట్యాంక్‌బండ్‌ను పరిశుభ్రంగా ఉంచుదాం
హైదరాబాద్‌ ‌బ్రాండ్‌ ఇమేజ్‌ ‌కాపాడుదాం
ట్వట్టర్‌లో పోస్ట్ ‌చేసిన మంత్రి కెటిఆర్‌

‌హైదరాబాద్‌ ‌మహానగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌నాయకత్వంలో, పట్టణాభివృద్ధి, మున్సిపాలిటీ శాఖల మంత్రి కేటీఆర్‌ ‌పర్యవేక్షణలో ప్రభుత్వ యంత్రాంగం విరామం లేకుండా శ్రమిస్తోంది. ప్రపంచ పర్యాటకులను ఆకర్షించే విధంగా హైదరాబాద్‌లోని పర్యాటక ప్రాంతాలను సుందరీకరిస్తున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర పట్టణాభివృద్ధి, మున్సిపాలిటీ శాఖల మంత్రి కేటీఆర్‌ ‌తన ట్విట్టర్‌ ‌ఖాతాలో ఓ వీడియోను విడుదల చేస్తూ.. సందేశమిచ్చారు. మహానగరానికి మణిహారం ట్యాంక్‌బండ్‌! ‌శతాబ్దాల ఘన చరిత్రకు ప్రతీక ట్యాంక్‌బండ్‌! అం‌దుకు తగ్గట్టే ట్యాంక్‌బండ్‌ ‌సుందరీకరణను ప్రతిష్టాత్మకంగా తీసుకొని, ఈ విశిష్ట నిర్మాణానికి మరిన్ని మెరుగులు అద్ది ట్యాంక్‌బండ్‌ను అత్యంత అందంగా తీర్చిదిద్దింది తెలంగాణ ప్రభుత్వం అని కేటీఆర్‌ ‌పేర్కొన్నారు. నగర ప్రజలకు, పర్యాటకులకు ఆహ్లాదాన్ని, ఆనందాన్ని అందిస్తూ, హైదరాబాద్‌ ‌బ్రాండ్‌ ఇమేజ్‌ను పెంచుతున్న ట్యాంక్‌బండ్‌ ‌పరిసరాలను పరిశుభ్రంగా ఉండేలా చూడటం మనందరి బాధ్యత అని సూచించారు. మనం నివసించే ఇంటిలాగానే మనకు గర్వకారణం అయిన పర్యాటక ప్రదేశాల్లో కూడా పరిశుభ్రతను పాటించాలని ప్రజలందరికి విజ్ఞప్తి చేస్తున్నాను అని కేటీఆర్‌ ‌తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *