కార్యకర్తలే పార్టీ నేతలపై తిరగబడతారు
రాష్ట్ర సంపదను దోచుకుని చిప్పచేతికి
కవితపై 8వేల పేజీల చార్జిషీట్‌కు సమాధానం చెప్పాలి
కెటిఆర్…ఖబర్దార్ నోరు అదుపులో పెట్టుకో..
మంత్రి కోమటిరెడ్డి ఘాటు విమర్శలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 23 : ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే జూన్ 5 తర్వాత భారాస దుకాణం మూతపడుతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చెప్పారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాల అనంతరం భారాస నేతలను ఆ పార్టీ కార్యకర్తలే వెంటపడి కొడతారన్నారు. గురువారం హైదరాబాద్‌లో నిర్వహించిన వ్నిడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… రాష్ట్ర సంపదనంతా దోచుకున్నది చాలక కేసీఆర్ కుటుంబం దిల్లీకి వెళ్లిందన్నారు. అవినీతి చేయకుండానే భారాస ఎమ్మెల్సీ కవితపై 8 వేల పేజీల ఛార్జిషీట్ దాఖలు చేశారా..అంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి అప్పుల ఖజానా మాత్రమే ఇచ్చారని మండిపడ్డారు. ఇక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నోరు అదుపులో పెట్టుకోవాలంటూ కేటీఆర్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మరోసారి తమ ముఖ్యమంత్రి రేవంత్‌ని తిడితే పరిస్థితి తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు. కేటీఆర్ బచ్చా అని.. తండ్రి పేరు చెప్పుకుని మంత్రి అయ్యారని ఎద్దేవా చేశారు. కానీ, రేవంత్ రెడ్డి ఇండిపెండెంట్‌గా గెలిచి లీడర్ అయ్యారని పేర్కొన్నారు. రేవంత్ వయసులో పోలిస్తే కేటీఆర్ చిన్న పిల్లాడు అని వ్యాఖ్యానించారు. సిరిసిల్లలో కేకే మహేందర్ రెడ్డి పొట్ట కొట్టి కేటీఆర్ ఎమ్మెల్యే అయ్యాడని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విమర్శించారు.
పార్లమెంట్ ఎన్నికల రిజల్టస్ తరువాత బీఆర్ఎస్ భూస్థాపితం అవడం ఖాయం అని అన్నారు. మేడిగడ్డ మాదిరిగానే బీఆర్ఎస్ పార్టీ కూలిపోవడం ఖాయం అన్నారు. కేసీఆర్ కూతురు కవిత చేసిన పనికి రాష్ట్రం పరువు పోతుందని వ్యాఖ్యానించారు. 5వ తేదీ నుంచి బీఆర్ఎస్ కార్యకర్తలే కేటీఆర్, హరీష్ రావులను తరిమి కొడుతారని అన్నారు. నందినగర్ నుండి కారులో న్యూట్రల్లో వెళ్లినా అసెంబ్లీకి చేరుకోవచ్చునని..కట్టే పట్టుకుని అసెంబ్లీకి రాలేదు కానీ, బీజేపీ కోసం కెసిఆర్ బస్సులో తిరిగారని కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు. అసలు తెలంగాణ కోసం కొట్లాడిరది తామేనని మంత్రి కోమటిరెడ్డి అన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి రెండు మూడు స్థానాల్లో మాత్రమే డిపాజిట్ వొస్తుందని.. అన్ని స్థానాల్లో ఓడిపోతుందని మంత్రి కోమటిరెడ్డి జోస్యం చెప్పారు. 12 రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ లేకుండా పోతుందన్నారు. బీఆర్ఎస్ పార్టీకి లీడర్, క్యాడర్ లేకుండా పోతారని అన్నారు. 5వ తేది తర్వాత తెలంగాణ భవన్‌కి తాళం వేసుకోవాల్సి వొస్తుందన్నారు. కవితకు బెయిల్ రావట్లేదని కేటీఆర్ పూర్తిగా ఫ్రస్టేషన్లోకి వెళ్లారని.. అందుకే ఇష్టారీతిన తమ ప్రభుత్వంపై కారుకూతలు కూస్తున్నారంటూ కేటీఆర్‌పై మంత్రి కోమటిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలకు ఉచిత బస్సు ఇస్తున్నందుకు మా రేవంత్‌ని తిడుతున్నావా..అంటూ కోమటిరెడ్డి మండిపడ్డారు.
500 రూపాయలకు సిలిండర్, ఉచిత విద్యుత్ ఇవ్వడమే మేం చేస్తున్న పాపమా అని, హాస్టల్స్, పేదవారికి ఇచ్చే ఉచిత బియ్యం పూర్తిగా సన్నబియ్యం ఇద్దామనుకోవడం తప్పా అని ప్రశ్నించారు. తాము ఇచ్చిన నోటిఫికేషన్ కాంగ్రెస్ క్లెయిమ్ చేసుకుంటుందంటున్నావ్..మరి వ్నిరే ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేకపోయారని ప్రశ్నించారు. తమ ముందు చూపుతోనే హైదరాబాద్ అభివృద్ధి జరిగిందని, కేసీఆర్ చేసిన పనికి మూడు డ్యాములు కొట్టుకుని పోయే ప్రమాదం ఉందని నిపుణులు చెప్తున్నారని, కాళేశ్వరం పేరుతో కోట్ల రూపాయలు వృథా చేశారని కోమటిరెడ్డి దుయ్యబట్టారు. వైన్ షాపుల పేరు వ్నిద కేసీఆర్ నాన్ రిఫండబుల్ పైసలు గుంజిండని ఆరోపించారు. తాము ఏకకాలంలో రుణమాఫీ చేయబోతున్నామన్నారు. మల్లన్నపై కేసులు ఉన్నాయని అంటున్నావ్.. మరి మీ చెల్లిపై 8000 పేజీల ఛార్జ్ షీట్ పై ఏమంటావ్ కేటీఆర్..అంటూ కోమటిరెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. ఆయన పేరు పలకాలంటే సిగ్గుగా ఉందని కేటీఆర్‌పై ఫైర్ అయ్యారు.
ఇక ఏం పైరవీ చేసుకుని పదవి తెచ్చుకున్నావంటూ బీజేఎల్పీ నాయకుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డిపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. ఈ డిపార్ట్మెంట్కి వెళ్లినా మహేశ్వర్ రెడ్డి ఆర్టీఐ అప్లికేషన్లే ఉంటున్నాయని అన్నారు. బ్లాక్ మెయిల్ చేసి పైసలు సంపాదించాలని మహేశ్వర్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారని మంత్రి కోమటిరెడ్డి ఆరోపించారు. ఆర్టీఐలు కోరుతున్న మహేశ్వర్ రెడ్డి.. నిర్మల్ నియోజకవర్గానికి ఏం కావాలని ఒక్కసారైనా అడిగారా..అంటూ మంత్రి ప్రశ్నించారు. ఇకపోతే జిల్లాల్లో మున్సిపాలిటీల అనుమతులు లేకుండానే భారాస కార్యాలయాలు నిర్మించారని, ప్రభుత్వ హాస్పిటళ్ల భవనాలు 14 అంతస్తులు మించరాదని నిబంధనలు చెబుతున్నాయని, ఎల్బీనగర్ హాస్పిటల్ స్థలానికి ఎన్వోసీ లేకుండా నిర్మాణం చేపట్టారని కోమటిరెడ్డి తెలిపారు. అందెశ్రీ గీతాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించాలని గత ప్రభుత్వాన్ని కోరామని, ఆడిటోరియానికి కాళోజీ పేరు పెట్టాలంటే పెట్టలేదని, నల్గొండ జిల్లాకు ఎస్ఎల్బీసీ సొరంగం మంజూరు చేయిస్తే.. భారాస ప్రభుత్వం నిలిపివేసిందని విమర్శలు చేశారు. ఇచ్చిన హావ్నిలను ప్రాధాన్య క్రమంలో నెరవేర్చుకుంటూ వెళ్తున్నామని, వేసవిలో వడగళ్ల వాన కారణంగా పంటనష్టం జరిగితే రైతులకు రూ.1500 కోట్ల పరిహారం చెల్లించినట్లు మంత్రి కోమటిరెడ్డి వెల్లడించారు.




