చెరిగిన ముద్రలు

కాలగర్భంలో కలిసిపోయిన
మనుషుల జ్ఞాపకాల నుంచి
లేచిన స్పందన!
మనిషికి మరణించడం
కూడా ఒక ఆయుధమే
ఎందుకంటే ఆ ఆయుధం
ఉన్న వాళ్ల మనసులను
గుణపం వలే తొలుస్తుంది!
వెళ్లిపోయిన వాళ్లకి ఏలా తెలుస్తుంది
ఉన్న వాళ్ళ బాధ ..?
బరువైన గుండె వ్యధ…?
ప్రతిరోజూ  వారితో గడిపిన జ్ఞాపకాల్ని ..
ప్రతినిత్యం వారి ఆలోచనల్నీ నెమరు వేసుకుంటూ…
అయినా కాలం ఎంతో విచిత్రమైనది
మనిషి మనసూ చిత్రమైనదే
జరిగిపోయిన గతాన్ని ఒక పక్కన తవ్వుతూనే…
కాలం గడిచే కొద్ది మనసు పై
పొరలు పొరలుగా ఏర్పడిన
చేదు జ్ఞాపకాల ముద్రలకు
చెరిగిపోయే స్వభావాన్ని
మనిషి మనసుకిచ్చిన
కనిపించని శక్తికి
శతకోటి ధన్యవాదాలు
అనంత కోటి కృతజ్ఞతలు!

– ఏడుకొండలు కళ్ళేపల్లి,
మచిలీపట్నం, 9490832338

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *