నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 7 : రాష్ట్ర గిడ్డంగుల శాఖ కార్పొరేషన్ చైర్‌పర్సన్‌గా వేద రజని నియామకం అయ్యింది. ఆ సంస్థ చైర్మన్‌గా ఉన్న గాయకుడు సాయిచంద్.. ఇటీవలే గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సాయిచంద్ భార్య రజనికే ఆ పోస్టును ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. కేసీఆర్ ఆదేశాల మేరకు సాయిచంద్ భార్య రజనిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
సాయిచంద్ కుటుంబానికి రూ. కోటిన్నర ఆర్థిక సాయాన్ని బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు.
ఈ మొత్తాన్ని తమ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధుల ఒక నెల వేతనం నుంచి సమకూరుస్తు న్నట్లు కేటీఆర్ వెల్లడించారు. సాయిచంద్ 1984, సెప్టెంబరు 20న వనపర్తి జిల్లా, అమరచింతగ్రామంలో వెంకట రాములు, మణెమ్మ దంపతులకు జన్మించాడు. ఆయన అమరచింతలో పదో తరగతి, ఆత్మకూరులో ఇంటర్, హైదరాబాద్‌లో డిగ్రీ, ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ పూర్తి చేశాడు. సాయిచంద్‌కు ఉస్మానియా యూనివర్సిటీలో పరిచయమైన రజనీని 2012లో ప్రేమ వివాహం చేసుకున్నాడు. వారికి కుమారుడు చరీష్ (చెర్రీస్), కుమార్తె నది ఉన్నారు.




