కౌంట్‌ ‌డౌన్‌..11 ‌ప్రజా‘తంత్రం’

అంబరాన్ని తాకింది స్టార్‌ ‌వార్స్
‌రంగంలోకి దిగారు టాప్‌ ‌లీడర్స్
‌గగనతలంలో ప్రైవేటు చాపర్స్
‌సొంత విమానాలే నయా ఫోర్స్

‌ఖర్చుతో కూడిన మేలా అదుర్స్
ఎచ్చులు పోతోంది మనీ మేటర్స్
‌రచ్చరేపుతోంది ఈ మొత్తం ఫార్స్
ఎవర్ని మెచ్చుతారో మరి వోటర్స్!
– ‌వి.రమేష్‌ ‌బాబు

బీఆర్‌ఎస్‌ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ ‌రావు ఆలంపూర్‌, ‌కొల్లాపూర్‌, ‌నాగర్‌కర్నూల్‌ ‌మరియు కల్వకుర్తి ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొన్నారు.కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం హయాంలోనే పాలమూరు జిల్లాకు తీవ్ర అన్యాయం జరిగిందనీ..ఇక్కడి ప్రజలు పేదరికం వలసలతో సతమతమయ్యారనీ..హైదరాబాదులో ఆటోలు నడుపుకుంటూజీవనం కొనసాగించారనీ, పాలమూరు ప్రాజెక్టులు పెండింగ్‌లో పడ్డాయని కేసీఆర్‌ అన్నారు. ఏఐసిసి ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కొమరం భీం ఆసిఫాబాద్‌ ‌జిల్లా కేంద్రంలో నిర్వహించిన కాంగ్రెస్‌ ‌పార్టీ విజయభేరీ సభకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సంద ర్భంగా ఆమె మాట్లాడుతూ..దేశం కోసం ఇందిరా గాంధీ ప్రాణ త్యాగం చేసి 40 సంవ త్సరాలు గడిచిన దేశ ప్రజల హృదయాలలో చిరస్థాయిగా ఉందని అన్నారు.

తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో నిర్వహించిన మీట్‌ ‌ది ప్రెస్‌ ‌కార్యక్రమంలో రేవంత్‌ ‌రెడ్డి పాల్గొన్నారు.. కాంగ్రెస్‌ ‌మేనిఫెస్టో బీఆర్‌ఎస్‌ ‌పార్టీని భయపెడుతుందని రేవంత్‌ ‌విమర్శించారు. అధికారం కోల్పోతున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌విచక్షణారహితంగా మాట్లాడుతున్నారని విరుచుకుపడ్డారు. తాము అధికారంలోకి రాగానే 2 లక్షలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీనిచ్చారు.భద్రాచలం అంబేడ్కర్‌ ‌సెంటర్‌లో జరిగిన రోడ్‌షోలో మంత్రి కెటీఆర్‌ ‌పాల్గొన్నారు.. రాములవారిని దర్శించుకోలేదని కొంతమంది విమర్శిస్తున్నారని, తెల్లం వెంకట్రావును గెలిపించిన వారం రోజుల్లోనే రాములవారిని దర్శించుకోవడానికి వొస్తానని తెలిపారు. ఎన్నికల కోడ్‌ ఉం‌డటం వలన ఇప్పుడు దర్శించుకోలేకపోయానని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *