నిమ్స్‌లో కొత్త బ్లాక్ నిర్మాణానికి సిఎం కెసిఆర్ శంకుస్థాపన
గర్భిణులకు రెండో విడత న్యూట్రిషన్ కిట్ ప్రారంభం
గర్భంలోనే పిల్లల ఎదుగుదల సక్రమంగా ఉండాలి
వారి ఆరోగ్యం కోసమే న్యూట్రిషన్ కిట్లు
సర్కార్ చర్యలతో ప్రభుత్వ హాస్పిటళ్లలో పెరిగిన ప్రసవాలు
వైద్యరంగం బలోపేతమే లక్ష్యంగా….పెద్ద ఎత్తున హాస్పిటళ్ల నిర్మాణం
కొరోనాను మించిన విపత్తు వొచ్చినా ఎదుర్కునేందుకు సిద్ధం
బడ్జెట్లో ఏటేటా వైద్యరంగానికి నిధుల పెంపు
పటిష్ట వైద్యారోగ్య వ్యవస్థతో నష్టాలు తక్కువని ఎంటమాలజిస్టులు చెప్పారు
వైద్యశాఖ సమర్థత తెలిసేలా పిఆర్ పెంచాలి
హైదరాబాద్,ప్రజాతంత్ర, జూన్ 14 : దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గర్భిణీలకు న్యూట్రిషన్ కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని బుధవారం ముఖ్యమంత్రి కెసిఆర్ లాంఛనంగా ప్రారంభించారు. కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ లబ్దిదారులు పార్వతి, పర్వీనమ్మ, శిరీషమ్మ, తేజశ్విని, సుజాతమ్మ, రేణుకమ్మలకు న్యూట్రిషన్ కిట్లను సిఎం కేసీఆర్ స్వయంగా అందచేశారు. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ…‘పుట్టే బిడ్డలు ఒడ్డూ పొడుగు బాగుండాలంటే వాళ్ళు గర్భంలో ఎదిగే కాలంలో ఎలాంటి ఆటంకం ఉండకూడదు. ఒకసారి స్టంటింగ్ సమస్య ఏర్పడితే, మళ్ళీ ఎదుగుదల చూడాలంటే వంద సంవత్సరాల కాలం పడుతుంది. చాలా మందికి ఈ విషయం తెలియదు. పెరుగుదలలో సమస్య రాకుండా ఉండాలంటే ముందస్తుగా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ సమస్యను అధిగమిం చేందుకు పంచబడుతున్నవే న్యూట్రిషన్ కిట్లు. వీటి పరమార్థం ఇదే’ అని వివరించారు. గతంలో పేద గర్భిణులు ప్రసవానికి ప్రైవేట్ హాస్పిటల్‌కి పోయేవారని, ప్రభుత్వం తెచ్చిన కేసీఆర్ కిట్ల ద్వారా వారికి నగదు సాయంతో పాటు, ప్రసవానంతరం ఇచ్చే కిట్లతో నేడు ప్రభుత్వ హాస్పిటళ్లలో ప్రసవాలు పెరిగాయన్నారు. గతంలో హాస్పటల్స్‌లో 30 శాతం ప్రసవాలు జరిగితే, నేడు 70 శాతం ప్రసవాలు హాస్పటల్స్‌లోనే జరుగుతున్నాయని, దానివల్ల మహిళల ఆరోగ్యం బాగుంటున్నదని, అనవసరమైన అబార్షన్లు, దుర్మార్గపూరిత చర్యలు కూడా ఉండటం లేదని, దీంతో సమాజాన్ని కాపాడుకోగలుగుతున్నామని సిఎం కెసిఆర్ తెలిపారు. మాతా, శిశు మరణాలు చాలా తగ్గాయని కెసిఆర్ అన్నారు. నిమ్స్‌లో కొత్త బ్లాక్ శంకుస్థాపన సందర్భంగా సిఎం కెసిఆర్ వి•డియాతో మాట్లాడుతూ…రెండు వేల పడకలతో నిమ్స్‌లో కొత్త బ్లాక్ నిర్మాణం చేపట్టామన్నారు. రూ.1571 కోట్లతో 32 ఎకరాల విస్తీర్ణంలో కొత్త బ్లాక్ నిర్మాణం జరుగుతుందని, కొత్త బ్లాక్ నిర్మాణంతో 38 విభాగాల సేవలు అందుబాటులోకి రానున్నాయని కెసిఆర్ తెలిపారు. నిమ్స్ కొత్త బ్లాక్ నిర్మాణానికి శంఖుస్థాపన, న్యూట్రీషన్ కిట్స్ పంపిణీ సందర్భంగా సిఎం కేసీఆర్ మాట్లాడుతూ…ఎంచుకున్న రంగంలో ఉన్నతస్థాయికి చేరుకోవాలనే మనిషి తపన వొకచోట ఆగేదీకాదు వొడిసేదీ కాదని, నిరంతరం కొనసాగుతూనే వుంటుందని స్పష్టం చేశారు. ఇప్పటికే పలు రంగాలతో పాటు రాష్ట్ర వైద్యారోగ్య రంగంలో కూడా అద్భుతమైన అభివృద్ధిని నమోదు చేసుకున్న నేపథ్యంలో, అత్యద్భుత రీతిలో నిర్మించబోయే నిమ్స్ దవాఖానా విస్తరణ పనులకు శంఖుస్థాపన చేయడం భారతదేశ వైద్యారోగ్య రంగంలోనే చారిత్రక సందర్భమని సీఎం స్పష్టం చేశారు. ఈ సందర్భోంగా వైద్యారోగ్య అధికారులు, సిబ్బందిని ఉద్దేశించి సీఎం కేసీఆర్ మాట్లాడుతూ…‘సమాజ పురోగమనానికి అప్పిచ్చేవాడు ఉండాలి. వైద్యుడు ఉండాలి అంటూ వైద్యుని ప్రాముఖ్యత గురించి శతకకారుడు వివరంగా చెప్పారు. వైద్యానికి, మానవ జీవితానికి ఎడతెగని సంబంధం ఉంటుంది. ఈ ప్రపంచంలో మానవ జీవనం ఉన్నంత కాలం వైద్యం కూడా తప్పకుండా కొనసాగుతూనే ఉంటుంది. వైద్యారోగ్య శాఖ చాలా ప్రాధాన్యత కలిగిన శాఖ. ఏ సందర్భంలో నైనా చాలా లైవ్ గా ఉండాల్సిన శాఖ. వైద్యారోగ్య శాఖను చాలా అనూహ్యంగా విస్తరిస్తున్నాం. 17 వేల పడకల నుండి 50 వేల పడకలకు విస్తరించాం. వందో, రెండొందలో ఉన్న ఆక్సిజన్ బెడ్లను 50 వేలకు పెంచుకున్నాం. కేంద్రాన్ని ప్రాధేయపడకుండా సొంతంగా 550 టన్నులు ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేసే ప్లాంట్లను ఏర్పాటు చేసుకున్నాం. 2014లో వైద్యరంగానికి బడ్జెట్లో రూ.2001 కోట్లు కేటాయించామని, 2023-24 నాటికి అది రూ.12,367 కోట్లకు చేరిందని వెల్లడించారు. వైద్యరంగానికి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యానికి ఇది నిదర్శనమని పేర్కొన్నారు. ‘నాకొక విచిత్రమైన అనుభవం ఉంది. మన ప్రాంతానికి సాధారణంగా మిడతల దండు రాదు. ఈ మధ్య మిడతల బెడద లేదు. వెనుకటి కాలంలో ఉండేది. మహాకవి శ్రీనాథుడు నిర్బంధంలో ఉండి చనిపోయే సమయంలో పాడతాడు. పొలం కౌలుకు చేసుకుంటుంటే కృష్ణవేణమ్మ కొంత తీసుకుని పోయింది. బిలబిలాక్షులు(మిడతలు) కూడా కొంత తీసుకుపోయిందని బాధపడతాడు. ఈ మధ్యకాలంలో మన దగ్గర మిడత బెడద లేదు. మధ్య ఆసియా నుండి ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ వి•దుగా గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రానికి మిడతల దండు వస్తూంటుంది. నేను చాలా ఇంట్రస్టింగ్ స్జబెక్ట్ చెప్తున్నాను.ఈ మిడతల దండు హర్యానాలోకి వొచ్చి అక్కడి నుండి మధ్యప్రదేశ్, మహారాష్ట్ర లోకి ప్రవేశించి, ఆదిలాబాద్ సరిహద్దు దాకా విస్తరిస్తూ వొస్తున్నది. భారత ప్రభుత్వం హెచ్చరిక జారీ చేస్తే ఆదిలాబాద్ ఉత్తర భాగాన ఉన్న కలెక్టర్లను, ఎస్పీలను అప్రమత్తం చేసి ప్రజలను, పంటలను కాపాడుకునేందుకు ఫెరిరజన్లు, స్ప్రేలతో సన్నద్ధంగా ఉన్నాం. ఆ సందర్భంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుండి ఒక మహిళా ఆఫీసర్, మన దగ్గర అగ్రికల్చర్ యూనివర్సిటీలోని ఇద్దరు ఎంటమాలజిస్టులు దీని పర్యవేక్షణ కోసం వొచ్చారు. వారికి హెలికాప్టర్ ఇచ్చి సరిహద్దులకు పంపాం. మహారాష్ట్రలోనే మిడతల దండును చంపేయడం వల్ల, అవి మన దాకా రాలేదు. అనంతరం ఆ ఇద్దరు ఎంటమాలిస్టులు మమ్మల్ని కలిసి మాకు హెలికాప్టర్ ఇచ్చి, మమ్మల్ని గౌరవించి బాగా చూసుకున్నారని ధన్యవాదాలు తెలిపారు. సైన్స్ ఇంతగా అభివృద్ధి చెందిన ఈ కాలంలోనూ ఈ సమస్యకు పరిష్కారం ఎందుకు కనుక్కోలేదని నేను వారిని నా అకాడమిక్ ఇంట్రస్ట్ కొద్దీ ప్రశ్నించాను. సార్ మిడతలను చంపలేము. నిర్మూలించ లేము. అది అసాధ్యమని చెప్పారు. మనిషి 4 లక్షల సంవత్సరాల క్రితం భూమి వి•దకు వొచ్చాడు. కానీ ఈ మిడతలు, బాక్టీరియాలు, ఇతరత్రా 8 లక్షల సంవత్సరాల క్రితమే ఉద్భవించాయి. అవి నిద్రాణంగా ఉంటాయి. వాటికి వ్యతిరేక చర్యలతో ప్రకోపం చెంది ఇబ్బందులు కలిగిస్తాయని ఎంటమాలజిస్టులు చెప్పారు. కొరోనా కూడా అటువంటి దేనా అంటే అటువంటిదే అని వారు చెప్పారు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ప్రజల్ని ఎలా రక్షించు కోవాలో సలహాలివ్వాలని అడిగితే, ఎక్కడైతే వైద్యారోగ్య వ్యవస్థ పకడ్బందీగా ఉంటుందో అక్కడ తక్కువ నష్టాలు జరుగుతాయని వారు చెప్పారు. లేకపోతే నష్టాలు ఎక్కువగా జరుగుతాయని వారు తెలిపారు. ఆరోగ్యశాఖ ప్రాధాన్యతను దీన్ని ద్వారా అర్థం చేసుకోవచ్చు. అప్పటి నుండి ఎలాంటి ఆరోగ్య అత్యవసర పరిస్థితినైనా ఎదుర్కునేలా ఆరోగ్యశాఖను తీర్చిదిద్దాలని భావించి, ఆరోగ్య శాఖ మంత్రులను, అధికారులను పిలిచి గంటలు, రోజులు, వారాల తరబడి చర్చించి అవసరమైన ఆర్థిక ప్రేరణ ఇవ్వడానికి బడ్జెట్ కేటాయింపులు కూడా భారీగా పెంచి ఈ శాఖను మనం ముందుకు తీసుకుపోతున్నాం’ అని కెసిఆర్ వివరించారు. ‘ఈ రోజు మనం ఏ స్టేజ్ లో ఉన్నాం, ఇంకా ఎంత ముందుకు పోవాల్సి ఉంది ? జరగాల్సిన కొత్త ఆవిష్కరణలు ఏంటి ? చేపట్టాల్సిన చర్యలు ఏంటి ? అనే ప్రణాళికల కోసం ఎక్కువ సమయం కేటాయించాలని నేను ఆరోగ్యశాఖ అధికారులను కోరుతున్నాను. బెస్ట్ ప్లానింగ్ ఈజ్ హాఫ్ సక్సెస్ అంటే.. ఉత్తమ ప్రణాళికతో సగం విజయం సాధించినట్లే అని చెప్పినట్లు, వైద్యారోగ్య రంగం ఇంకెంత గొప్పగా ఉండాలి. ఇంకా ఎంతో ముందుకు పోవాలి. ఎలా ఈ లక్ష్యాలను ఎలా సాధించవచ్చో వి•రు బాగా ఆలోచించగలరు. డాక్టర్లు గొప్పవారు. మంచి మనసున్న వాళ్ళు. నిరుపేదల వైద్యం కోసం వస్తే, బెడ్లు అందుబాటులో లేనప్పుడు ఉదారమైన హృదయంతో ఒక అరగంట ఎక్కువ పని చేసైనా కిందనే బెడ్డు వేసి వైద్యం అందిస్తారు. అది వాస్తవం. కానీ పత్రికలు, జర్నలిస్టులు అవాస్తవాలను ఉస్మానియాలో బెడ్లు లేవు. పేషెంట్లను కింద పడుకోబెడుతున్నరు అంటూ వక్రీకరణలు చేస్తారు. వైద్యారోగ్య శాఖ అధికారులకు పబ్లిక్ రిలేషన్స్ చాలా తక్కువ. మిమ్మల్ని విమర్శించే వాళ్ళు తప్ప మెచ్చుకున్న వాళ్ళు లేరు. నేను వి•తో గంటల తరబడి మాట్లాడిన సందర్భాల్లో కలిగిన అనుభవాలు ఇవి. మనం కూడా మానవత్వ కోణంలో ఆలోచించాలి. వైద్యం ప్రత్యేక చదువు. ప్రత్యేకమైన అర్హత. ఐఎఎస్ లైనా, మంత్రులైనా, ముఖ్యమంత్రులైనా డాక్టర్ల దగ్గరకు రావాల్సిందే. ఒకసారి విచిత్రమైన సందర్భం వొచ్చింది. వైద్యులకు ములుగు, భూపాలపల్లి ప్రాంతానికి పోస్టింగ్‌లు ఇచ్చారు. వాళ్ళు జాయిన్ కావడం లేదు. కారణమేంటని నేను వాళ్ళను పిలిచి అడిగాను. మేం పోవడానికే సిద్ధమే కానీ మా భార్యలు రావడం లేదని చెప్పారు. ఎందుకని అడిగితే అక్కడ ఒక ఒక సినిమా హాల్ లేదు, ఇతరత్రా సౌకర్యాలు లేవని తమ సమస్యలు చెప్పారు. ఈ సందర్భంగా వాళ్ళు తాలూకా కేంద్రంలో లేదా జిల్లా కేంద్రంలో ఉండేలా రూల్స్ సడలింపు చేయాలని చెప్పి అప్పుడున్న హెల్త్ సెక్రటరీకి చెప్పాను. దాంతో పాటు వారికి ఎక్స్ ట్రా అలవెన్స్ కూడా ఇవ్వాలని చెప్పాను’ అని సిఎం కెసిఆర్ ఈ సందర్భంగా తెలిపారు.
వైద్యశాఖ సమర్థత తెలిసేలా పిఆర్ పెంచాలి
వైద్యారోగ్య శాఖ మంత్రి మంచి చురుకైన వ్యక్తి కాబట్టి వైద్యశాఖ అందించే సేవలు ప్రజల్లోకి పోయేలా పిఆర్‌ను పెంపొందించాలని ఆయనకు సూచిస్తున్నట్లు మంత్రి హరీష్ రావును ఉద్దేశించి సిఎం కెసిఆర్ తెలిపారు. ప్రజలతో పెనవేసుకున్న విభాగం కాబట్టీ వైద్యారోగ్య రంగం పిఆర్ బాగా పెరగాలని, వైద్యారోగ్య శాఖ ప్రజల బాగు కోసం ఏం చేస్తుంనేది ప్రజలకు బాగా తెలిసేలా చర్యలు చేపట్టాలని, ప్రయత్నిస్తే ఫలితముంటుందని అన్నారు. ‘వి• పీఆర్ బాగా పెరగాలి, వి• ప్లానింగ్ బాగుండాలి అని నేను మంత్రిని కోరుతున్నాను. రాష్ట్రంలో గొప్పగా హాస్పటల్స్ కట్టుకుంటున్నాం. వరంగల్ లో ప్రపంచంలో ఎక్కడలేనటువంటి సూపర్ స్పెషాలిటి హాస్పటల్‌ను కడుతున్నాం. ఒకప్పుడు నిమ్స్‌లో 900 పడకలుంటే తెలంగాణ వొచ్చిన తర్వాత 1500 పడకలకు తీసుకునిపోయాం. మరో 2000 పడకలను మనం కట్టుకుంటున్నాం. హైదరాబాద్ లో టిమ్స్ కింద నాలుగువైపులా నాలుగు సూపర్ స్పెషాలిటి హాస్పటల్స్ కట్టుకుంటున్నాం. విదేశాలకు పోకుండా ఇక్కడే అద్భుతమైన వైద్య సేవలు, టెలిమెడిసన్ బాగా వినియోగించడం, వీటి సమాహారంగా అద్భుతాలను ఆవిష్కరించే అవకాశం ఉంటుంది. ప్రజల బాగు కోసం ఇంకా ఏం చేయాలనే తపన వైద్యాధికారులకు ఉండాలి’ అని కెసిఆర్ సూచించారు. క్వెస్ట్ ఫర్ ఎక్స్ లెన్స్ నెవర్ ఎండ్స్ (శ్రేష్ఠత కోసం పడే తపన నిరంతరమైనది)అంటే శ్రేష్ఠత, సంస్కరణల కోసం చేసే పనులకు ముగింపు ఉండదని పిఎం ఈ సందర్భంగా ఉద్భోదించారు.

కొరోనా సమయంలో గాంధీ వైద్యుల గొప్ప సేవలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా…
ఉత్తమోత్తమ సేవలు ప్రజలకు అందించడానికి, కొరోనా వంటి మహమ్మారి వ్యాపిస్తే కూడా ఎదుర్కువడానికి సిద్ధంగా ఉండాలని సిఎం కెసిఆర్ వైద్యులకు సూచించారు. కొరోనా కాలంలో తెలంగాణ వైద్యారోగ్య శాఖ గొప్పగా పనిచేసిందని, ప్రైవేట్ హాస్పటల్స్‌లో కొరోనా సోకిన పేషెంట్ పరిస్థితి విషమిస్తే గాంధీ హాస్పటల్స్‌కు పంపించే వారని, గాంధీ డాక్టర్లు అటువంటి పేషెంట్స్‌ను కూడా బతికించారని, వారి సేవలకు నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని అన్నారు సిఎం కెసిఆర్. వైద్య విధానం కొత్త పుంతలు తొక్కుతున్న నేటి కాలంలో మన రాష్ట్రంలోని పరిస్థితులకు అధ్యయనం చేసి, అందుకు అనుగుణంగా వైద్యసేవలు అందించేలా వైద్యులు ప్రణాళికలు రూపొందించాలని కెసిఆర్ సూచించారు. వైద్యారోగ్య శాఖ వి•దున్న అపవాదును తొలగించుకొని, రాష్ట్రంలో వైద్యశాఖే నెంబర్ వన్ అని పేరొచ్చేలా కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. వైద్యారోగ్య సాధించిన విజయాలను మనస్ఫూర్తిగా అభినందిస్తూ, మరోసారి వి•కు తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు, మంత్రులు మహమూద్ అలీ, వేముల ప్రశాంత్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, రాజ్యసభ సభ్యులు కె.కేశవరావు, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, ముఠా గోపాల్, మాగంటి గోపీనాథ్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, తాత మధు, మహిళా కమిషన్ చైర్మన్ సునితా లక్ష్మారెడ్డి, వైద్యారోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ, డైరక్టర్ గడల శ్రీనివాస్, మెడికల్ హెల్త్ డైరక్టర్ రమేశ్ రెడ్డి, టిఎస్ ఎంఎస్ ఐడీసీ చైర్మన్ ఎర్రోల్ల శ్రీనివాస్, నగర మేయర్ విజయలక్ష్మి, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మ, సిఎం ప్రధాన సలహాదారు సోమేశ్ కుమార్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి,సిఎం కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి, సిఎం వోఎస్డీ గంగాధర్, చంద్రశేఖర్ రెడ్డి, నిమ్స్ డైరక్టర్ బీరప్ప, పర్యాటక శాఖ చైర్మన్ గెల్లు శ్రీనివాస్ యాదవ్, వికలాంగుల కార్పోరేషన్ చైర్మన్ వాసుదేవ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.