కేసీఆర్‌ స్వయంకృతం

తెలంగాణ రాజకీయ ముఖచిత్రంలో ఇప్పుడు బిఆర్‌ఎస్‌ను అణచివేసే ప్రక్రియ మొదలయ్యింది. బిఆర్‌ఎస్‌ను అణచివేయడం బిజెపి, కాంగ్రెస్‌లకు అవసరం. గతంలో కెసిఆర్‌ అనుసరించిన విధానామే ఇది. ఇందులో కొత్తదనం ఏవిూలేదు. ప్రజల సమస్యలను పట్టించుకోకుండా, భ్రమలను కల్పించిన పాపానికి కెసిఆర్‌ అధికారం కోల్పోయారు. తెలంగాణ సెంటిమెంట్‌ను ఉపయోగించుకుని పదేళ్ల పాలనలో కెసిఆర్‌ దగా చేశారు. ఈ క్రమంలో కెసిఆర్‌ టార్గెట్‌గా విపక్షాలు గత అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఏకమయ్యాయి. ఓటమి తరవాత కూడా ఆత్మపరిశీలన చేసకోవడంలో కెసిఆర్‌, ఆయన పార్టీ నేతలు విఫలం అయ్యారు. అందుకే ఇప్పుడు అంతా కెసిఆర్‌, ఆయన కుటుంబం లక్ష్యంగా విమర్శల దాడులకు పదును పెడుతున్నాయి. ఈ క్రమంలో నేతలంతా కారు దిగుతున్నారు. ఒక్కొక్కరే అధికార పార్టీకి దగ్గరవుతున్నారు. తాజా రాజకీయాల్లో అధికారం ఎటువుంటే అటు బయలుదేరడం నేతలు అలవాటు చేసుకున్నారు.

ఇకపోతే కవిత అరెస్ట్‌పై  గగ్గోలు పెడుతున్న నేతలు గతంలో చేసిన పాపాలు గుర్తుకు తెచ్చుకోవాలి. లిక్కర్‌ కేసులో అడ్డంగా దొరికి బుక్‌ అయిన  కవితను అరెస్ట్‌ చేస్తే కెటిఆర్‌ ఫ్రస్టేషన్‌ ఫీలవుతున్నారు. 10 ఏళ్ళు  అధికారం అడ్డం పెట్టుకొని ఎంతమందిపై కేసులు పెట్టించారో గుర్తుకు తెచ్చుకోవాలి. నేటి సిఎం రేవంత్‌ రెడ్డిని కూతురు పెళ్ళి  కూడా చేయలేని దుస్థితికి తెచ్చారు.. జైలులో ఉండేలా చేశారు. అలాగే ఎంతమందిని అక్రమంగా జైల్లో పెట్టించారో గుర్తులేదా అన్న విమర్శలు ఇప్పుడు ప్రజల నుంచే వొస్తున్నాయి. వాళ్ల భార్య పిల్లల ఉసురు తలగదా అని అంటున్నారు. నేరెళ్ల బాధితులని  అడుగు, రాజా సింగ్‌ ని అడుగు, రైతులని అడుగు, మానేర్‌ నిర్వాసితులని అడుగు, మల్లన్న సాగర్‌ బాధితులని అర్థరాత్రి 300 మంది పోలీస్‌లతతో దాడికి దిగినప్పుడు గాయ పడ్డ వారిని అడుగు బాధ  అంటే ఏమిటో అని సోషల్‌ విూడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. అక్రమ కేసులు అంటే ఏమిటో చెబుతారు. కవితపై పెట్టిన కేసు తప్పుడు కేసు కాదు అని అందరికీ తెలుసు.
పదేళ్లలో ఉద్యమకారులను దూరం పెట్టారు. స్వీయ అస్థిత్వం, స్వపరిపాలన కోసం తెలంగాణ ప్రజలు ఉద్యమిస్తే.. దానిని హైజాక్‌ చేసిందెవరో ప్రజలకు తెలియనిది కాదు. ఇప్పుడీ వ్యవహారమంతా సోషల్‌ విూడియాలో వైరల్‌ అవుతోంది. నిజానికి ఉద్యమనేతగా ఉన్న కేసీఆర్‌ గౌరవంగా ఉండకుండా కేవలం రాజకీయాల కోసం నిర్ణయాలు తీసుకున్న కారణంగా ప్రజల్లో చులకన అయ్యారు.

తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం పనిచేస్తున్న వారిని పక్కన పెట్టిన కెసిఆర్‌ను గద్దెదించాలని కాంగ్రెస్‌, బిజెపిలు చేసిన పోరాటాల కారణంగానే బిఆర్‌ఎస్‌ అధికారం కోల్పోయింది. అయినా ఆ పార్టీలో ఆత్మవిమర్శ చేసుకోవడం లేదు. కేవలం పరనిందతో కాలక్షేపం చేస్తున్నారు. అధికార పార్టీని దుమ్మెత్తి పోయడంలో హరీష్‌ రావు, కెటిఆర్‌, కెసిఆర్‌లు ముందున్నారు. ప్రతిష్టాత్మకంగా చెప్పుకున్న కాళేశ్వరం ప్రాజెక్ట్‌ అవినీతిపైనా, డొల్లతనంపైనా మాట్లాడడం లేదు. ఆత్మగౌరవం, స్వయంపాలన కోసం ఉద్యమించి సాధించుకున్న తెలంగాణను తమ స్వప్రయోజనాల కోసం కెసిఆర్‌ వాడుకున్నారు.ఈ క్రమంలోనే కెసిఆర్‌ను గద్దె దించాలని, కుటుంబ పాలనను పక్కన పెట్టాలన్న నినాదంతో కాంగ్రెస్‌, బిజెపిలు పోరాడాయి. గత పదేళ్ల కాలంలో కెసిఆర్‌ సామాన్యులకు అందుబాటులో ఉండరన్న విషయం తేలిపోయింది. సమస్యలపై ప్రస్తావిస్తే దాటవేతలు లేదా విమర్శలు ఎక్కువయ్యాయి. తెలంగాణ ఏర్పడ్డది మొదలు ప్రజల పక్షాలన నిలిచి పనులు చేసుకుంటూ పోతే ఇవాళ టిఆర్‌ఎస్‌ ఇంతగా నష్టపోయేది కాదు. ప్రజలను పట్టించుకుని ఉంటే తెలంగాణ ఆకాంక్షను నెరవేర్చిన నేతగా కెసిఆర్‌కు ప్రజలు బ్రహ్మరథం పట్టేవారు. అలాగే ఆ పార్టీని ప్రజలు విస్మరించేవారూ కాదు. కానీ పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. అధికారం చేజారక ఇప్పుడు సెంటిమెంట్‌ను రెచ్చగొడితే వోట్లు ్ల రాలే పరిస్థితి లేదు.

ఆరు దశాబ్దాల వివక్ష కారణంగా దెబ్బతిన్న  తెలంగాణ ప్రాంతానికి నూతన దిశానిర్దేశం చేయడానికి, చరిత్రలో ఒక విశిష్ట నాయకుడిగా నిలవడానికి వొచ్చిన అవకాశాలను కెసిఆర్‌ తనకు తానుగా  చేజార్చుకున్నారని గుర్తించాలి. ఎందరో బలిదానాలు చేస్తే తెలంగాణ రాష్ట్రం సిద్ధించినా, ఆ విజయం తనదేనని కెసిఆర్‌ అన్నా ఎవరుకూడా పెద్దగా అభ్యంతరం చెప్పలేదు. ఒక ఆశయం కోసం సుదీర్ఘపోరాటం జరిపి, దాని విజయాన్ని ప్రజలకు అందించడంలో కెసిఆర్‌ పూర్తిగా విఫలం అయ్యారని అనడంలో సందేహం లేదు. సిఎం అయిన తరవాత అధికారాన్ని సంఖ్యాబలాన్ని సుస్థిరం చేసుకోవడానికి ప్రజలకు పింఛన్లు, తాయిలాలు ఇస్తూ సాదాసీదా నాయకుడిగా మిగిలిపోయారు. ప్రజలు ఇలాంటి పందారాలను కోరుకోలేదు. పనులు చేయాలని చూశారు. హావిూలను అమలు చేసి కొత్త తెలంగాణకు దారులు వేయాలని చూశారు. నీటిపారుదల, ఉద్యోగ నియామకాలకు సంబంధించి ఆయన చర్యలు తీసుకున్నట్లు కనిపించారు తప్ప ఎలాంటి పురోగతి లేదని తేలింది.అందుకే ఇప్పుడు కెసిఆర్‌ అవినీతిపై ఎందుకనో పెద్దగా ప్రజల్లో స్పందన కనిపించడంలేదు. గ్రావిూణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కోసం ఆయన కులవృత్తుల కు ఆర్థిక సాయం అందించినా అది వోట్ల కోసం చేస్తున్న ప్రయత్నంగా మిగిలింది. వోటుకునోటు పథకాలు అమలవు తున్నాయన్న భావన ప్రజల్లో ఏర్పడిరది. చెరువుల పూడికతీత అంతా ప్రచారంగా సాగింది. మిషన్‌ భగీరథ కూడా అంతే. ఇలాంటి వాటి ద్వారా లబ్ది పొందాలనుకున్నప్పుడు పటిష్టంగా కార్యక్రమాలు అమలుచేసి ఉంటే బాగండేది.  అవేవీ చేయకుండా కేవలం ఎదుటి వారిని తిటటడం ఇప్పుడు రాజకీయ ప్రచారంగా మారింది. అటు విపక్షాలు కూడా ఇదే పనిలో ఉన్నాయి. ఈ క్రమంలో కవితను అరెస్ట్‌ చేసినా ప్రజల్లో ఆందోళన కానరావడం లేదు.
 ప్రజాతంత్ర డెస్క్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *