కెసిఆర్‌ను గద్దె దించాలంటే కలసికట్టుగా పోరాటం

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 1 : ‌బీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ను గద్దె దించాలంటే అంతా కలిసికట్టుగా పనిచేయాలని పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి పిలుపునిచ్చారు. అవినీతి, కుటుంబ పాలనకు తెలంగాణలో తెరదించాలని అన్నారు. ఇది కాంగ్రెస్‌తోనే సాధ్యమన్నారు. బిజెపిని వీడి కాంగ్రెస్‌లో చేరిన
వివేక్‌ ‌వెంకటస్వామిని కూడా ఇదే కోరడం జరిగిందని అన్నారు. గాంధీ కుటుంబంతో వివేక్‌కు ఎంతో అనుబంధం ఉందని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి అన్నారు. వివేక్‌ ‌కాంగ్రెస్‌ ‌పార్టీలో చేరిన సందర్బంగా బుధవారం ఆయన నోవాటెల్‌ ‌హోటల్‌ ‌వద్ద వి•డియాతో మాట్లాడుతూ..వివేక్‌తో కాంగ్రెస్‌ అ‌గ్రనేత రాహుల్‌ ‌గాంధీ ఫోన్‌లో మాట్లాడి కాంగ్రెస్‌లో చేరాలని కోరారని, ఆయన కోరిక మేరకు రాహుల్‌ ‌సమక్షంలో పార్టీలో చేరారన్నారు. వివేక్‌ ‌తిరిగి కాంగ్రెస్‌లో చేరడమంటే ఆయన సొంత కుటుంబంలో చేరినట్లేనని, ఆయన్ను కాంగ్రెస్‌లోకి సాదరంగా ఆహ్వానిస్తున్నానని రేవంత్‌ అన్నారు.

వివేక్‌ ‌చేరిక కాంగ్రెస్‌కు వెయ్యేనుగుల బలాన్ని చేకూర్చిందన్నారు. కీలక సందర్భంలో ఆయన కాంగ్రెస్‌లో చేరడంతో తెలంగాణ ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. వొచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వొస్తుందని, కాంగ్రెస్‌ ‌రావాలనే ప్రజల ఆకాంక్షకు వివేక్‌ ‌చేరిక బలాన్నిస్తుందని రేవంత్‌ ‌వ్యాఖ్యానించారు. కాగా బీజేపీకి రాజీనామా చేసిన మాజీ ఎంపీ వివేక్‌తో ఏఐసీసీ ప్రెసిడెంట్‌ ‌మల్లికార్జున ఖర్గే ఫోన్‌ ‌చేసి మాట్లాడగా..తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన వి•లాంటి వాళ్లు కాంగ్రెస్‌లోకి రావాలని కోరిన ఖర్గే ఆహ్వానం మేరకు ఆయన బుధవారం నోవాటెల్‌లో రాహుల్‌ ‌గాంధీని కలిసి పార్టీలో చేరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *