కాశ్మీర్ సమస్యపై వివరణ చారిత్రక వాస్తవం
ఆర్టికల్ 370 ఉండడం వల్లనే కాశ్మీర్ సమస్య ఉత్పన్నమవుతున్నదనీ దాన్ని రద్దు చేస్తే సరిపోతుందనే వాదన అప్పుడు, ఆర్టికల్ 370 రద్దు అయిన ఇప్పుడు, మనం తెలుసుకోవాల్సింది. 1947 ఆగస్టు 15 అధికార మార్పిడి వరకు బ్రిటిష్ వాళ్లు ఏనాడు భారత ఉపఖండాన్ని మొత్తంగా ప్రత్యక్షంగా పరిపాలించలేదు. హైదరాబాద్, జూనాగడ్, కాశ్మీర్ ఇతర ప్రాంతాలను/ రాజ్యాలను రాజులు, సంస్థానాధీశులు, జాగీర్లు సామంతులుగా ఉండేవారు. వీళ్ళు బ్రిటిష్ ప్రభుత్వానికి నిబద్ధులై వాళ్లు వెళ్లిపోగానే తమ ప్రాంతాలను స్వతంత్రంగా పలుపాలించుకోవచ్చు ననే నెపంతో ప్రజలను పీడిస్తూ కపం కట్టేవాళ్ళు. అధికార మార్పిడి తర్వాత నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ చిన్న పెద్ద రాజ్యాలు గా ఉన్న వాటిని ఆశ చూపో నయాన భయానో సైనిక బలం ఉన్నందున భయపెట్టో ఇండియన్ యూనియల్లో కలుపుకున్నారు.
ఒక కశ్మీర్ ను తప్ప..! ఎందుకంటే అక్కడ మెజారిటీ ప్రజలు ముస్లింలు, అధికులు ముస్లింలు కాబట్టి ఆ ప్రాంతం పాకిస్తాన్ కు కావాలనో.. చెందుతుందనో, రాజు హిందూ కాబట్టి ఇండియన్ యూనియన్ లో కల్వక పోతుందా అని ఆశించిన పాక్ ఇండియా పాలకులు కాశ్మీర్ ప్రాంతంలో ప్రత్యేకమైన సామాజిక వ్యవస్థ సంస్కృతి, కుల వ్యవస్థ, బహమనీయ మతం, రెవెన్యూ విధానం, భాషలు, ఆచారాలు సమ్మళితంగా ఉన్నవి కాబట్టి వాళ్లు స్వతంత్రంగా ఉండదల్చారు. వారి సార్వభౌమాధికారాన్ని పాక్ ఇండియా లు ఏమాత్రం గౌరవించి చిత్తశుద్ధి ప్రదర్శించివుంటే కాశ్మీర్ పై పాలకులకు సమస్య ఉండేదే కాదు.
1947 అక్టోబర్ 26న పాక్ ముఠాలను కాశ్మీర్ పై పంపడంతో ఆ దాడికి బెదిరిపోయిన రాజు ఇండియన్ యూనియన్ లో కలువనికై ప్రభుత్వాలతో విలీన ఒడంబడిక చేసుకున్నాడు. అయితే రక్షణ, విదేశీ వ్యవహారాలు, ప్రసారం వంటి వాటిపై మాత్రమే కేంద్రానికి అధికారం ఉన్నది ఆ ఒడంబడిక. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకుంటే ఎంతటి శాసనాధికారాన్నైన యూనియన్ ప్రభుత్వం పొందవచ్చు. ఈ కారణం చేతనే 1953 నుండి 2019 ప్రజాస్వామ్య గాని పారదర్శకంగా గాని ఏనాడు కాశ్మీర్ లో ఎన్నికలను జరుపలేదు. రిగ్గింగ్ తోనో, హింసతోనో తప్ప. యు.ఎన్ లో చెప్పినట్టుగా ప్రజాభిప్రాయ సేకరణ చేయకపోగా కేంద్రానికి తొత్తులైన వారిని రాష్ట్ర ప్రభుత్వాలుగా కొనసాగించి కాశ్మీరి స్వేచ్ఛకి ప్రాతినిధులైన ప్రభుత్వాలను బస్తరఫ్ చేశారు.చివరికి 2019 లో అత్యధిక మెజారిటీ ఉన్నందున భారతీయ జనతా పార్టీ ఆర్టికల్ 370 ని సైనికీకరణతో రద్దు చేసింది. వాస్తవానికి 1953లో శవమైన దాన్ని 2019లో కాటికి పంపింది బిజెపి.. ఇది చారిత్రక వాస్తవం. దీనిపై మాట్లాడడం రాయడం దేశద్రోహమా..?
ఈ దేశంలో అణచివేయబడ్డ, మైనారిటీ, దళిత, ఆదివాసి, అంబేడ్కర్, మావోయిస్టుల గురించి తాను గొంతుకై వినిపిస్తున్నది పాలకులను ప్రశ్నిస్తున్నందున అరుంధతి రాయ్, వరవరరావు తదితరులపై దేశద్రోహం వంటి అప్రజాస్వామిక రాజ్యాంగ వ్యతిరేక ఉపా వంటి చట్టాలను ప్రయోగిస్తున్నారు. దీన్ని కేవలం అరుంధతి రాయి పైనో షేక్ షౌకత్ హుస్సేన్ పైనో దాడిగాను చూడవద్దు. ఇది మైనారిటీ ప్రజల వారి అభిప్రాయాలపై దళితులపై ఆదివాసులపై అంబేడ్కరిస్టులపై మావోయిస్టులపై దాడిగానే అణిచివేతకు గురైన వారిపై దాడిగానే చూడాలి .
ఎందుకు మోదీ ప్రభుత్వం 14 ఏళ్ల తర్వాత అరుంధతి రాయ్ ఇతరులపై ఈ చర్యలకు పాల్పడుతున్నది ఎందుకంటే ఈ పాలకులు కార్పొరేట్ల కొరకై ఉన్నవారు వారి ప్రయోజనాలె దేశ ప్రయోజనాలుగా ప్రచారం చేసే ప్రచార ప్రసార సాధనాలు కలిగి ఉన్నవారు ఎవరైతే వీరిని ధిక్కరిస్తారో అంటే రాజ్యాంగబద్ధ పాలన కోరుకుంటారో ఈ దేశ అడవుల్లో కార్పొరేట్ కంపెనీలతో వందల కోట్ల ఎం ఓ యూ లు అమలుపరచడానికై ఆదివాసీలను కట్టు బానిసలుగా చేసుకొని వారి ఆచార సంప్రదాయాలపై దాడి చేస్తూ ప్రపంచమే మార్కెట్టుగా మార్చే వారిని ఎదిరిస్తారో వారిపై వారి పక్షాన మాట్లాడే కొట్లాడే వాళ్లను ఈ బ్రాహ్మణీయ భూస్వామ్య ఫాసిస్టు పాలకులు అట్టడుగు వర్గాల ఆలోచనలపై సంస్కృతిపై ఆచారాలపై భాషా జీవనంపై వేస్తున్న అప్రజాస్వామిక దాడిని తిప్పి కొట్టవలసి ఉన్నది.. ఆ గొంతుకులను నులుమే ప్రయత్నం చేస్తున్నప్పటికీ అది అసాధ్యం. ఉపా చట్ట ఉపసంహరణకు రాజకీయ ఖైదీల విడుదలకై గొంతెత్తుదాం.
(దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అరుంధతి రాయ్, షేక్ షౌకత్ హుస్సేన్ తదితరులపై
ఉప చట్టం కింద విచారణ కొరకు ఆదేశించడాన్ని నిరసిస్తూ…)
-స్టాలిన్
న్యాయ శాస్త్ర విద్యార్థి
(కాకతీయ విశ్వవిద్యాలయం)
ఎస్.ఎఫ్.ఐ హనుమకొండ
జిల్లా అధ్యక్షులు
7416420830
(దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అరుంధతి రాయ్, షేక్ షౌకత్ హుస్సేన్ తదితరులపై
ఉప చట్టం కింద విచారణ కొరకు ఆదేశించడాన్ని నిరసిస్తూ…)
-స్టాలిన్
న్యాయ శాస్త్ర విద్యార్థి
(కాకతీయ విశ్వవిద్యాలయం)
ఎస్.ఎఫ్.ఐ హనుమకొండ
జిల్లా అధ్యక్షులు
7416420830





