కాంగ్రెస్‌ హామీ ఇంటర్నేషనల్‌ మోడల్‌ స్కూల్‌

వొచ్చే విద్యా సంవత్సరానికి అందుబాటులో వొస్తుందా ?

తెలంగాణ స్వరాష్ట్రం అనేక ప్రజా ఉద్యమాల తర్వాత ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిరది. అయితే సుమారు పదేళ్ల తర్వాత కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ రాష్ట్ర మూడో అసెంబ్లీ ఎన్నికలలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన కనీస ఎమ్మెల్యేల సంఖ్యను ఈ మూడో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో 64 సీట్లతో అత్యధికంగా సీట్లు సాధించిన ఒకే ఒక పార్టీగా కాంగ్రెస్‌ ఈ ఎన్నికలలో ఆవిర్భవించింది. అయితే, అందరికీ కాకపోయినా రాష్ట్రంలో ఉన్న కొంతమందికి ఉన్న సందేహం ఏమిటంటే గత ఏడాది బై ఎలక్షన్లలో కనీసం డిపాజిట్‌ దక్కని పార్టీ మరియు క్షేత్రస్థాయిలో చెప్పుకోదగ్గ కేడర్‌ కూడా లేని కాంగ్రెస్‌ పార్టీ ఈ ఎన్నికలలో ఏ విధంగా ఒకే ఒక పార్టీ అత్యధిక మెజార్టీ ఎమ్మెల్యే సీట్లను గెలుచుకున్నదనేది, అయితే ఈ విజయానికి కారణం కేవలం కాంగ్రెస్‌ పార్టీ నాయకత్వమే కాదు, తెలంగాణ విద్యార్థి సంఘాలు, నిరుద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగాల కోసం సన్నద్ధం అవుతున్నవారు, పౌరహక్కుల నాయకులు మరియు సంఘాలు,ఇంకా అనేక మేధావులు, పాత్రికలు. అయితే ఎన్నికలలో విజయానికి కారణం ఏమైనాప్పటికీ ఈ వ్యాసంలో కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల హామీల లేక మేనిఫెస్టోలో ఇచ్చిన అనేక హామీలలో ఒక ప్రధాన హామీ తెలంగాణలోని మండల పరిధిలో ప్రతి మండలానికి తెలంగాణ ఇంటర్నేషనల్‌ స్కూల్స్‌ నిర్మిస్తామని చెప్పిన హామీని దాన్ని సాధ్య అసాధ్యాల గురించి ఈ వ్యాసంలో చర్చిద్దాం.

కాంగ్రెస్‌ పార్టీ 2023 ఎన్నికల మేనిఫెస్టో హామీ ప్రకారం తెలంగాణలోని అన్ని మండలాలలో తెలంగాణ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ అనే పేరుతో అత్యంత ఆధునిక ప్రమాణాలతో ఇంటర్నేషనల్‌ స్కూల్స్‌ స్థాయి ప్రమాణాలతో మండల స్థాయిలో విద్యార్థులకు బస్సు సౌకర్యాన్ని కూడా కల్పిస్తామని హామీ ఇచ్చారు, విద్యారంగంలో అట్టడుగున ఉన్న తెలంగాణ రాష్ట్రానికి విద్యారంగంలో కేవలం ఈ తెలంగాణ ఇంటర్నేషనల్‌ స్కూల్స్‌ మాత్రమే కాకుండా వాళ్ల హామీ ప్రకారం చెప్పిన మూతపడ్డ 6000 స్కూళ్లు, మరియు రాష్ట్రంలో ఎక్కడైతే ప్రైమరీ పాఠశాలలు లేవో ఆ గ్రామాలలో కనీస ప్రాథమిక పాఠశాలను ఏర్పాటు చేయడం, స్పోర్ట్స్‌ యూనివర్సిటీ ఏర్పాటు చేయడం ఇలా చెప్పుకుంటూ పోతే వాళ్లు మేనిఫెస్టోలో చెప్పిన హామీలతోపాటు విద్యారంగంలో అనేక విప్లవాత్మకమైన మార్పులు తీసుకొని రావాలి. విద్యారంగం పటిష్ట అభివృద్ధికి అధికారంలో వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ నాయకత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉందో ఇప్పుడే చెప్పడం కష్టం గానీ, వారి ఎన్నికల మేనిఫెస్టోని చదివితే పూర్తిగా కాకున్నా చెప్పుకోదగ్గ అవగాహన, ఆలోచన ఉంది అని మాత్రం కచ్చితంగా చెప్పవచ్చు, తెలంగాణ రాష్ట్రం విద్యారంగంలో ఎదుర్కొంటున్న సమస్యల గురించి కనీస సంక్షేమ దృష్టి ఉందని కూడా గ్రహించవచ్చు. అయితే మిగతా విషయాల మాట తర్వాత గాని, ముందుగా చర్చించిన తెలంగాణ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ గురించి ఇప్పుడే ఎందుకు మాట్లాడాలంటే కాంగ్రెస్‌ పార్టీ దీన్ని ఎన్నికల ప్రచార సమయంలో ప్రధాన అంశంగా అనేక చర్చల్లో వాళ్ల తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ ప్రెసిడెంట్‌, మరియు రాష్ట్ర ప్రధాన నాయకులు అంతే కాకుండా వారి అగ్ర నాయకులు రాహుల్‌ గాంధీ కూడా తెలంగాణలో ప్రచారంలో పాల్గొంటున్నప్పుడు పలుమార్లు ఈ అంశాన్ని ప్రస్తావించారు. దీన్నిబట్టి కాంగ్రెస్‌ నాయకత్వం ప్రధానంగా చెప్పిన 6 గ్యారంటీలతోపాటు ఈ మండలానికి ఒక ఇంటర్నేషనల్‌ స్కూల్‌ కట్టడం కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయాన్ని గ్రహించవచ్చు.

మండలాలలో ఈ స్కూల్స్‌ కట్టడాల గురించి ఓసారి ఆలోచిస్తే మనకి ఏం అర్థం అవుతుంది అంటే, తెలంగాణ రాష్ట్ర సమితి (భారత రాష్ట్ర సమితి) వారి 2014 ఎన్నికల హామీలలో భాగంగా కేజీ టు పీజీ ఉచిత విద్య ప్రతి మండల పరిధిలో అందిస్తామని చెప్పారు అయితే దానిని ఆచరణలో పెట్టక తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ వైఫల్యం చెందిన విషయం మనకు తెలిసిందే. అయితే ఆ మాదిరిగానే ఈ మండల స్థాయిలో ఇంటర్నేషనల్‌ స్కూల్స్‌ ని ఏర్పాటు చేయడం అందులో భాగంగానే కనిపిస్తుంది ఏది ఏమైనా ఈ పాఠశాలలను ఏర్పాటు చేయాలనుకునే ఆలోచన మంచిది, అయితే దానిని ఆచరణలో సాధ్యం చేయడానికి ఎటువంటి మార్గదర్శకాలు ఇప్పటికైతే అందుబాటులో లేవు. అయితే నిజంగా ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ ఈ పనిని చేయాలనుకుంటే దీని గురించి ఇప్పటి నుంచే ఆలోచన చేయడం మొదలుపెట్టాలి కేవలం ఆలోచన పెడితే కూడా సరిపోదు ఆచరణలో తీసుకురావాలి అంటే ఇప్పటి నుంచే పైలెట్‌ ప్రాజెక్టు కనీసం మొదలుపెట్టాలి అంటే మొదటిగా ప్రతి జిల్లాలో ఎక్కడెక్కడ ఈ స్కూల్స్‌ ని ప్రయోగాత్మకంగా తీసుకొనిరావాలనుకుంటున్నారో ఆ మండలాలను యుద్ధ ప్రాతిపాదికన మొదలు చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే, నిజానికి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ హామీని అమలు చేయాలంటే వచ్చే విద్యా సంవత్సరం నుంచి మొదలు పెట్టాల్సి వస్తుంది అనగా జూన్‌ లేదా జూలై నెలలో విద్యా సంవత్సరం మొదలు అవుతుంది అందుకుగాను కనీసం ఇప్పటినుంచి మొదలు పెడితే ఏ ఏ ప్రాంతాలలో ప్రయోగత్మకంగా ఈ పాఠశాలలను మొదలు పెట్టవచ్చు అనేది ప్రభుత్వం వద్ద ఓ ప్రణాళిక ఉంటుంది. వచ్చే 2024-25 విద్యా సంవత్సరం అంటే జూన్‌ లేదా జూలై అనుకున్న ప్రభుత్వానికి కనీస ఆరు నెలలు మాత్రమే సమయం ఉంది.

ఈ సమయంలో ఏ ఏ మండలాలలో ఈ పాఠశాలను మొదటి విడతగా నిర్మించాలో అనేది గుర్తించాలి అంతేకాకుండా పాఠశాల కట్టడానికి ప్రదేశాన్ని కూడా నిర్ణయించాలి, దీనితోపాటు టెండర్లను పిడవడం దాని గురించి పూర్తి మార్గదేశాలు జారీ చేయడం, అనేది జరగాలి. ఇంకా అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ పాఠశాలను నిర్మిస్తాం అంటున్నారు కాబట్టి ఇక్కడ ఎటువంటి సౌకర్యాలు ఉంటాయి, అనేవి ఈ ప్రభుత్వ మార్గదేశాలలో విద్యశాఖ పూర్తిగా పొందుపరచాలి, ఇంకా మండల పరిధిలో కేవలం ఒకటే పాఠశాల కాబట్టి ఈ పాఠశాలలో ప్రవేశం పొందాలంటే ఎటువంటి అర్హతలు ఉండాలి, అనేది కూడా ఆ మండలాల్లో ఉన్న విద్యార్థి మరియు వారి తల్లిదండ్రులను తెలియజేయాలి ఇంతే కాకుండా, వీటితో పాటు ప్రధానంగా ఉపాధ్యాయులు వారిని ఏ ఏ ప్రాతిపాదికన వృత్తిలో చేర్చుకుంటారు అంతర్జాతీయ ప్రమాణాలు అంటున్నాము కాబట్టి మంచి అర్హత ఉన్న మరియు ట్రైన్‌ చేయబడిన టీచర్స్‌, ఇంకా ఇతర సిబ్బందిని కూడా భర్తీ చేయవలసి ఉంటుంది. దీనితోపాటు అనేక పాలనాపరమైన సమస్యలను కూడా అధికమించవలసి ఉంటుంది, అయితే ప్రభుత్వాలు చిత్తశుద్ధితో ఉండి చెయ్యాలి అనుకుంటే ఆ పనిని చేయడం అంత కష్టమేమీ కాదు. అయితే ఇది ఇప్పటి నుంచి మొదలు పెట్టకపోతే సమస్య ఎక్కడ వస్తుందంటే 2024- 25 విద్యా సంవత్సరానికి ఈ పాఠశాలను అందుబాటులోకి తీసుకొని రాలేము అయితే దానిని మరింత నిర్లక్ష్యం చేయడం ఈ ప్రతిష్టాత్మకమైన కాంగ్రెస్‌ పార్టీ హామీ కేవలం కనీసం 2024- 25 లో ప్రాథమిక పాలనాపరమైన పనులు మొదలు పెడితే అది 2025-26 విద్యాసంవత్సరానికి అక్కడక్కడైనా కొన్ని మండలాలలో విద్యార్థులకు అందుబాటులో వచ్చే అవకాశం ఉంటుంది. దీని వాళ్ళ అప్పటికి కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటు అయి ఒకటిన్నర సంవత్సరాలు పూర్తవుతుంది.

అయితే ఇది ఎలా ముందుకు సాగుతుంది అనేది కాలమే చెబుతుంది అయితే ఇప్పుడున్న ప్రస్తుత సమస్యలతో పోల్చినప్పుడు కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వానికి ఈ సమస్య పెద్ద సమస్యగా అనిపించకపోవచ్చు, కానీ ప్రస్తుతానికి తెలంగాణలో ఉన్న నిరుద్యోగ సమస్య ప్రత్యేకంగా డీఎస్సీ ఉన్న ఉపాధ్యాయుల ఖాళీలతో పాటు, కొత్తగా ఈ పాఠశాలల్లో కూడా కొంతమేరకు ఉద్యోగాలను ప్రభుత్వం కల్పించవచ్చు అంతేకాకుండా కేజీ టు పీజీ విద్య అని చెప్పి అమలు చేయలేకపోయినా టిఆర్‌ఎస్‌ పార్టీ, మరియు ఇప్పుడు అదే మాదిరిగా తీసుకువచ్చిన మండలానికి ఒక తెలంగాణ ఇంటర్నేషనల్‌ స్కూల్స్‌ అని తీసుకువచ్చిన కాంగ్రెస్‌ కూడా దీనిని టిఆర్‌ఎస్‌ కేజీ టు పీజీ విద్యను అమలు చేయనట్టు చేస్తే? కాస్తో కూస్తో కొంత మెరుకైన విద్యారంగం బాగుపడుతుంది అని ఆశించిన విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు, మరియు తెలంగాణ సమాజానికి దీని నిర్లక్ష్యం చేయడం వల్ల వారిని మోసం చేసినట్టే అవుతుంది. అందుకే యుద్ధ ప్రాతిపాదికన ఇప్పటి నుంచే మొదలు పెడితే ఎంతో కొంత విద్యను పటిష్టం చేయడంతో పాటు ఉద్యోగ అవకాశాలు లేకుండా ఎంతో నిరోత్సాహంగా ఉన్న అర్హులైన ఉపాధ్యాయ నిరుద్యోగ యువతకు కొన్ని ఉద్యోగాలు కల్పించినట్టు కూడా అవుతుంది. చివరిగా మొన్ననే ఏర్పడిన ప్రభుత్వానికి ఇప్పుడు అయితే విద్యా శాఖకు మంత్రి కేటాయించడం జరగలేదు, ఇంకో కొన్ని రోజుల్లో అది ఎలాగో జరిగిపోతుంది. ఇప్పటికీ ఏ విధంగా ఈ పథకాన్ని అమలు చేస్తారో చెప్పలేము కానీ, అతి త్వరలో అమలు మరియు ఆచరణ దిశగా అడుగులు వేయాలని ఆశిద్దాం.

 -అశోక్‌ ధనావత్‌
సీనియర్‌ రీసెర్చ్‌ నేషనల్‌ క్యాంపెయిన్‌
ఆన్‌ దళిత్‌ హ్యూమన్‌ రైట్స్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *