ఎంత బాగుండేవి ఆ రోజులు?
పాలమీగడ లాంటి
మనసున్న మనుషుల
మృదు మధుర భాషణలు
విరిజల్లులా నిండుగా రాలుతూ
మదిని తాకుతోంటే,
మానసవీణ
పురివిప్పిన మయూరమై
పరవశించేది.

మరి నేడో…
ఎక్కడున్నాయి
మనసును పులకరింపచేసే
ఆ ఆత్మీయ పలకరింపులు?
మనిషితనం కోల్పోయి,
మంచితనం ఆవిరై,
కృత్రిమత్వమే అంతటా..
ఎటుచూసినా,ఎక్కడచూసినా
కమిలిపోతున్న మృదుత్వమే.

ఆశలన్నీ కలువపూలై
కనుదోయిలో పూస్తుంటే,
కడలి నురగల స్వచ్ఛత
సంతరించుకున్న మనసులకోసం,
మృదువైన హృదయ వాకిళ్ళకోసం
ఎంతో ఆశతో
అను నిత్యం ఎదురుచూస్తున్నా,
నిరాశకు గురవుతున్నా!

మళ్ళీ వినగలమా
మనసులను పులకరింపచేసే,
ఆ జుంటె తేనె పలకరింపులు?
తడిసి ముద్దవ్వగలమా
మృదు సంభాషణల జడివానలో!

నా ఈ కమ్మని ఆశ నెరవేరేనా?

   – వేమూరి శ్రీనివాస్‌, 9912128967,
                                   ‌తాడేపల్లిగూడెం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *