కన్నీటి బొట్టు

గుండె అంతా ఆవిరి
అయిపోయిన
తరువాత మిగిలిందేమో
బయటలోకానికి
తను కనబడటానికి
ఎంత తటపటాయించిందో!
బండరాయిగా మారిన
గుండెల్లో అట్టడుగున తన
ఉనికే లేనట్లు దాక్కుంది!
భావం లేని ఎడారి మనసులో
ఎక్కడో కాస్తంత చెమ్మగా
మిగిలిపోయింది!
పరువుపోతుందని
దిగాలుపడింది కానీ
తన బరువుకు
ఆ గుండే ఆగిపోతుందని
గ్రహించలేదనుకుంటా!
హాలహలం పోసి మనసు
గర్భాన్ని మధనం చేస్తేనే
కానీ  అగుపడలేదు!
ఎన్నో తిట్లు, మరెన్నో
శాపనార్థాలు,ఇంకెన్నో
వ్యంగ్య బాణాలు కానుకగా
ఇస్తే కానీ కదిలి రాలేదు!
మొత్తానికి గుండె తలుపులు తోసి,
కళ్ళల్లో జలపాతంలా జారుతూ
చెంపల వెంట పాకుడు కట్టుకుంటూ
కారిపోయింది!
– ఉషారం, 9553875577

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *