భారత సంతతికి మళ్ళీ అవకాశం
భారతీయ సంతతికి చెందిన లియో వరద్కర్ ఐర్లాండ్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. ఐర్లాండ్ దేశంలో మూడు రాజకీయ పార్టీల కూటమి చేసుకున్న ఒప్పందం మేరకు ప్రధానిగా ఉన్న మైకెల్ మార్టిన్ రాజీనామా సమర్పించి, లియో వరద్కర్ కు మార్గదర్శనం చేయించడంతో రెండవసారి భారత మూలాలు కలిగిన వరద్కర్ కు ప్రధాని పదవి మళ్లీ లభించింది. అమెరికా ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్ ఎన్నిక కాగా, బ్రిటన్ ప్రధానిగా రిషి సునాక్ ఇటీవలే ప్రధాని పదవి అలంకరించారు. ఇంగ్లండ్ సమీప ఐర్లాండ్ ప్రధానిగాన్ లియో వరద్కర్ రెండోసారి ఎన్నిక అయ్యారు. భారతీయ మూలాలు కలిగిన వారు విదేశాల్లో తమ శక్తి యుక్తుల ద్వారా రాజకీయాల్లో సత్తా చాటుతున్నారు. 43 ఏళ్ల లియో ఇది వరకే 38 ఏళ్ల వయసులో 2017లో ఒక పర్యాయం ఐర్లాండ్ ను పాలించారు. మళ్ళీ 17 డిసెంబర్ 2022న తిరిగి బాధ్యతలు స్వీకరించారు. ప్రధాని అయిన లియో జనవరి 18, 1979 డబ్లిన్ లో జన్మించారు. అతని తండ్రి అశోక్ మహారాష్ట్ర లోని సింధుదుర్గ్ జిల్లాలోని వరడ్ గ్రామానికి చెందిన వారు.’ ఆయన తల్లి మేరీ ఐర్లాండ్ నుండి వచ్చింది. నర్సుగా పనిచేసింది. తండ్రి వృత్తి రీత్యా వైద్యుడు, 1960 లలో ఇంగ్లాండ్ నేషనల్ హెల్త్ సర్వీస్ లో పనిచేశారు. నర్సుగా పనిచేస్తున్న సమయంలో ఆయన్ను ఇంగ్లాండ్ లో కలుసుకుంది. తరవాత ఆయన ఐర్లాండ్ లో స్థిరపడ్డాడు. నియో, అశోక్ చిన్న కుమారుడు.
లియో ప్రారంభ విద్య సెయింట్ ఫ్రాన్సిస్ నేషనల్ స్కూల్ లో జరిగింది. లియో డబ్లిన్ లోని ట్రినిటీ కళాశాలలో మెడిసిన్ చదివాడు. వైద్యవిద్య పూర్తి చేసుకుని ఆయన రాజకీయాల్లోకి అడుగు పెట్టారు.
2007 లో డబ్లిన్ వెస్ట్ నుండి కౌన్సిలర్ అయ్యాడు. ఆ సమయంలో రవాణా, పర్యాటకం, క్రీడల మంత్రిగా నియమించ బడ్డాడు. అయితే జూలై 2014లో జరిగిన క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణలో, జేమ్స్ రీల్లీ స్థానంలో వరద్కర్ ఆరోగ్య మంత్రిగా నియమితు లయ్యారు. 6 మే 2016న, ప్రభుత్వ ఏర్పాటు చర్చలు ముగిసిన తర్వాత, సామాజిక రక్షణ మంత్రిగా వరద్కర్ను నియమించారు. లియో వర్కర్ 2020 లో ఉప ప్రధానిగా ఎన్నికయ్యారు. దేశం కోవిడ్ మహమ్మారితో పోరాడుతున్న సమయంలో ఆయన అనేక సవాళ్లను ఎదుర్కొన్నాడు. ఇంటి నుండి పని త్వరలో సాధారణ మవుతుందని చెప్పారు. లియో వరద్కర్ గతంలో 2017 నుంచి 2020 వరకు ఐర్లాండ్ ప్రధానిగా పనిచేశారు. మొదటి సారి ప్రధాని అయినప్పుడు లియో వయసు కేవలం 38 ఏండ్లు, ఐర్లాండ్ చరిత్రలో అతి పిన్న వయసులో ప్రధాని అయిన వ్యక్తిగా రికార్డు సృష్టించారు. తాను స్వలింగ సంపర్కుడినని లియో 2015లో బహిరంగంగా ప్రకటించారు. ఫైన్ గేల్, మార్టిన్ ఫియాన్నా ఫెయిల్ పార్టీల మధ్య రొటేషన్ లో మైకేల్ మార్టిన్ స్థానంలో టావోయిసాచ్ (ప్రీమియర్) గా వరద్కర్ నియమించ బడ్డాడు. 2020 ఎన్నికల తరువాత ఐర్లాండ్ గ్రీన్స్ తో సంకీర్ణంలో భాగంగా వారు రొటేటింగ్ ప్రధాని పదవికి అంగీకరించారు. 43 సంవత్సరాల వయస్సులో ఆయన ఇప్పటికీ ఐర్లాండ్ అత్యంత పిన్న వయస్కుడైన నాయకులలో ఒకరు. అలాగే, ప్రధానిగా రెండవసారి కూడా ఉండటం విశేషం. మొదటి సారి ప్రధాని అయిన సమయాన లియో వయసు కేవలం 38 ఏండ్లు. ఐర్లాండ్ చరిత్రలో అతి పిన్న వయసులో ప్రధాన మంత్రి అయిన నేతగా రికార్డు స్వంతం చేసుకున్నారు. టైమ్ మ్యాగజైన్ 2018 యొక్క 100 మంది అత్యంత ప్రతిభా వంతమైన వ్యక్తులలో వరద్కర్ చేర్చబడడం గమనార్హం.
– రామ కిష్టయ్య సంగన భట్ల…
9440595494




