ఎన్నికల రణంలో భారాస ఓటమికి స్వయంకృత అపరాధాలే కారణం

ఇందిరాగాంధీని  పోలి ఉండడంతో,‘‘అచ్చం ఇందిరాగాంధీని చూస్తున్నట్లే ఉంది’’అని, భావించి ఆమె కష్టానికి ఫలితం ఇచ్చారు.  రాజీవ్‌ గాంధీ ప్రధాని పదవి చేపట్టి సాంకేతిక పరంగా దేశాన్ని అభివృద్ధి చేశారని, కంప్యూటర్ల యుగం ఆయనతోనే దేశంలో ప్రారంభమయిందనే భావన కూడా తోడైంది.   కర్ణాటక  ఎన్నికల్లో మాదిరి తెలంగాణ ఎన్నికల్లో  ఆమె  ప్రధాన ఆకర్షణగా నిలిచారు. కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావడంలో  ప్రియాంక గాంధీ పాత్ర నిర్వివాదాంశం  తెలంగాణలో  ఆమె ప్రచార సభలకు కావలసినంత మంది జనం. ఆమె నవ్వు, హావభావాలు అన్నీ ఇందిరమ్మను చూసి నట్లే ఉండటంతో ఎక్కువ మంది ఆమెను దగ్గరగా చూసేందుకు వచ్చారు.

తెలంగాణలో కాంగ్రెస్‌ పుంజుకుంది గతంలో కంటే  బాగా మెరుగింది. అధికార పార్టీ బీఆర్‌ఎస్‌ పై వ్యతిరేకత సమర్థవంతంగా తన వైపు తిప్పుకుని, అందరినీ కలుపుకుని  ఈ ఎన్నికలలో విజయం సాధించింది.  కొన్ని జిల్లాల్లో కాంగ్రెస్‌ పార్టీ అనూహ్యంగా పుంజు కుంటున్నది. జనంలో సానుభూతి పెరిగి   ఒక్కసారి అధికారం ఇచ్చిందని స్పష్టమయింది. బీఆర్‌ఎస్‌ ను వెనక్కు నెట్టి కాంగ్రెస్‌  పుంజుకున్నది   జనంలో మార్పు కోరుకుంటున్నారన్నమట నిజమ యింది. కాంగ్రెస్‌ విజయానికి  కారణలు ఎక్కువ అధికార బి ఆర్‌ ఎస్‌ పై వ్యతిరేకత గెలుపొందిన స్థానాల్లో ఆధిక్యత ఋజువు చేస్తున్నది. బీజేపీకి వోటు బ్యాంకు లేదు.  సంస్థాగతంగా కూడా పార్టీ బలంగా లేదు. కానీ కాంగ్రెస్‌ ను అంత సులువుగా అంచనా వేయడానికి వీలులేదని తేలింది.. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్టీ అది. క్షేత్రస్థాయిలో క్యాడర్‌ తో పాటు వోటు బ్యాంకు ఉన్న కాంగ్రెస్‌ పుంజుకోవడం విశేషమేమీ కాదు. ప్రజలు ఒక్కసారి చూద్దాం అని భావించి అవకాశమిచ్చారు.

కాంగ్రెస్‌ అగ్ర నేతలు తెలంగాణ లో సుడిగాలి లా పర్యటించారు..  ప్రచారంలో కాంగ్రెస్‌ జాతీయ నేతలు  పాల్గొంటూ పార్టీ మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్ళాగలిగారు.. కాంగ్రెస్‌ దిగ్దంతులు రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే, దిగ్విజయ్‌ సింగ్‌, డీకే శివకుమార్‌  తదితరులు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కాంగ్రెస్‌ విజయానికి  ప్రియాంక గాంధీ కీలక పాత్ర నిర్వహించారు.  ప్రచారం యావత్తూ రాహుల్‌, ప్రియాంకా భుజస్కంధాలపై వేసుకుని పాద యాత్రలు, బస్‌యాత్రలు, పాదయాత్రలు, విజయ  యాత్రలు, బహిరంగ సభలు అంటూ ప్రజలలో మమేకం కావడం కాంగ్రెస్‌ తమది అనే భావన ప్రజలలో ముఖ్యంగా గ్రామసీమల్లో కల్పించ గలిగారు. ఇందిరాగాంధీని  పోలి ఉండడంతో,‘‘అచ్చం ఇందిరాగాంధీని చూస్తున్నట్లే ఉంది’’అని, భావించి ఆమె కష్టానికి ఫలితం ఇచ్చారు.  రాజీవ్‌ గాంధీ ప్రధాని పదవి చేపట్టి సాంకేతిక పరంగా దేశాన్ని అభివృద్ధి చేశారని, కంప్యూటర్ల యుగం ఆయనతోనే దేశంలో ప్రారంభమయిందనే భావన కూడా తోడైంది.   కర్ణాటక   ఎన్నికల్లో మాదిరి తెలంగాణ ఎన్నికల్లో  ఆమె  ప్రధాన ఆకర్షణగా నిలిచారు. కాంగ్రెస్‌ ను అధికారంలోకి తీసుకురావడంలో ప్రియాంక గాంధీ పాత్ర నిర్వివాదాంశం  తెలంగాణలో  ఆమె ప్రచార సభలకు కావలసినంత మంది జనం. ఆమె నవ్వు, హావభావాలు అన్నీ ఇందిరమ్మను చూసి నట్లే ఉండటంతో ఎక్కువ మంది ఆమెను దగ్గరగా చూసేందుకు వచ్చారు. కాంగ్రెస్‌ హయాంలో నాగార్జునసాగర్‌ వంటి ప్రాజెక్టులను కట్టి లక్షల ఎకరాలను పేదలకు పంచిపెట్టిందని, తెలంగాణ ప్రజల అభివృద్ధికోసమే సోనియా ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చారని గుర్తుచేశారు.  ప్రియాంక గాంధీ ప్రచారంతో  కాంగ్రెస్‌ గ్రాఫ్‌ మరింత పెరిగిందని కాంగ్రెస్‌ అభ్యర్థులు సంతోషంతో ఉన్నారు.

‘కాంగ్రెస్‌ సర్కారు వచ్చాక సీఎంతోపాటు.. మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజలతో మమేకం అవుతారని, కేసీఆర్‌లాగా ప్రగతిభవన్‌, ఫామ్‌హౌసకు పరిమితం కారని, కాంగ్రెస్‌  ను ఓడిరచేందుకే మోదీ, కేసీఆర్‌, ఒవైసీ ఒక్కటయ్యారనీ ఒప్పించగలిగారు. కాంగ్రెస్‌ హయాంలో తెలంగాణ  అభివృద్ధి ఇందిరా గాంధీ హయాంలోనే దేశాభివృద్ధి జరిగిందని, ఉద్యోగ కల్పన, భూ సంస్కరణలు, పారిశ్రామిక వృద్ధి, ఇళ్ల నిర్మాణం, భూపంపిణి వంటివి ఇందిరా హయాంలోనే జరిగాయని, కాంగ్రెస్‌ పథకాలు, కార్యక్రమాలు ప్రజలకు ఎంతగానో ఉపయోగపడ్డాయని,  హైదరాబాద్‌ లో జరిగిన అభివృద్ధి కూడా కాంగ్రెస్‌ హయాంలో జరిగిందేనని చెప్పారు.. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌ లోని పరిణమాలతో అభిమానం దెబ్బతిన్న రాష్ట్రంలోని తెలుగుదేశం అభిమానులు, గత పాతికేళ్ళుగా ఐ టి రంగంలో వెలుగుతూ నగరంలో పరిసర ప్రాంతాలలో స్థిరపడిన యువతరం వోటర్లు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్‌కే వోటు వేసినందుకే కాంగ్రెస్‌ గెలుపొందింద్ని విశ్వసిస్తున్నారు. తమ మేనిఫెస్టో తెలంగాణ ప్రజలకు అంకితమని, సర్వమతాలకు కాంగ్రెస్‌ మేనిఫెస్టో హామీ పత్రమని, భగవద్గీత, ఖురాన్‌, బైబిల్‌ లాంటిందని   అన్ని వర్గాలకు మేలు చేసేలా మేనిఫెస్టోను రూపొందిం చామని పేర్కొని ప్రజలకు నమ్మకం  కలిగించినందునే   కాంగ్రెస్‌ పార్టీని ఆదరించి.. అధికారం ఇచ్చారన్న అభిప్రాయం ఏర్పడిరది. అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీలను అమలు చేయటంతో పాటు మేనిఫెస్టోలో చెప్పిన విషయాలను అమలు చేస్తామని ఇచ్చిన హామీనే దళిత, గిరిజనులకు మేలు కలుగుతుందన్న విశ్వాసంతో గెలిపించారని కృతజ్ఞతతో ఉన్నారు.డా . రాజశేఖర్‌ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఉచిత కరెంటు, అరోగ్యశ్రీ, ఫీజు రీఇంబర్స్‌మంట్‌, ఇరిగేషన్‌ ప్రాజెక్టుల విస్తరణ, శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మాణం జరిగిందని, ఐటీని ప్రమోట్‌ చేసింది కాంగ్రెస్‌ ముఖ్య మంత్రులేనన్న నమ్మకం తమను గెలిపించిందని నమ్ముతున్నారు.

తెలంగాణలో చిరునామా గల్లంతయిన తెలుగుదేశం అభిమానులు, వోటర్లు ప్రస్తుత రాష్ట్ర రాజకీయాల పట్ల అసంతృప్తితో ఉన్న తరుణంలో ఆంధ్రలో అనేక ఆరోఫణతో అక్కడి ప్రభుత్వం టిడిపి అధినేత  చంద్రబాబుపై పలు కేసులను నమోదు చేసి 50 రోజులపాటు రాజమండ్రి కేంద్రకార్యాలయంలో బందీ చేయడంటొ తెలంగాణ లో నివురుగప్పిన నిప్పులా ఉన్న అసంఖ్యాక యువత, మహిళలు,  అధిక శాతం ఐ టి రంగ, ఫార్మా రంగం, విద్యా రంగాలకు చేందిన విద్యాధికులు, యువతలో ఆగ్రహం కలిగించిన ఫలితమె తెదేపా వోట్లు  కాంగ్రెస్‌ కు మళ్ళి విజయం సాధించిందన్న మాట వినిపిస్తోంది. తెలంగాణలోని వివిధ జిల్లాలలో భారాసపై అగ్రహంతో ఆంధ్ర ప్రాంతీయులు, రైతులు. వర్గాలు, ఎదురు చూస్తున్న సమయం రావడం ఇందుకు సహకరించింది. మాజీ టిడిపి నేతలూ, ఎన్నికలలో కాంగ్రెస్‌ మిత్రపక్షాలుగా పోటీలో ఉన్న సిపిఐ, టిజెఎస్‌, టిఎస్‌ఆర్సి  భారాస అసంతృప్తి వాదులు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయానికి దోహద పడ్డారని భావిస్తున్నారు. రేవంత్‌ రెడ్డి ఈ విషయంలో అందరికంటే ముందుండి, మాజీ టిడిపి నేతగా, చంద్రబాబు సైన్యంలో అన్ని ఆనుపానులూ తెలిసిన మాజీ అధికారిగా, కెసిఆర్‌ కు ప్రధాన ప్రత్యర్థిగా సి ఎం పదవికి పోటీదారుగా వ్యూహాత్మకంగా వ్యవహరించి ఆయనపైనే గెలుపొండడం ఒక విశేషం.

భాజపాలో ప్రధాని మోదీ, అమిత్‌ షా, నుంచి కిందిస్థాయి నేతల వరకూ ఈసారి తెలంగాణలో అధికారం తమదేనన్న వ్యక్తం చేసిన ధీమా నిజంకాదని తేలింది.  కీలక వ్యక్తులు నలుగురూ ఓటమి పాలు కావడం పార్టీ నేతల వైఫల్యానికి  బిజెపి గెలుపొందిన సంఖ్య  నిదర్శనం. ఆ పార్టీకి దక్షిణ దేశంలో  పటిష్టమైన వోటు ప్రధాని నరేంద్ర మోదీ చరిష్మాతో పాటు డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ వంటి నినాదాలతో ఇక్కడ విజయనికి దోహద పడుతునందన్నా ఆశ అడియాశ గా మిగిలింది. రాష్ట్ర నాయకత్వం బలహీనంగా ఉండటం బండి సంజయ్‌ ను అధ్యక్ష పదవి నుంచి తొలగించడం జనసేనతో పొత్తు కుదుర్చుకోవడం వరసగా నేతలు పార్టీని వీడటం,  దిల్లీ  లిక్కర్‌ స్కామ్‌ లో కవితను అరెస్ట్‌ చేయకపోవడం బీఆర్‌ఎస్‌ తో పరోక్ష పొత్తు ఉందన్న ప్రచార ప్రభావం ఆ రెండు పార్టీలు ఏ, బి టీములన్న ప్రచారం ప్రభావం ఎన్నికలపై పడిరదనడంలో సందేహం లేదు. ముస్లింల విషయానికొస్తే, అనేకమందికి కాంగ్రెస్‌, తెలుగుదేశం పార్టీలతో మూడు దశాబ్దాలకు పైగా ఏర్పడిన అవినాభావ సంబంధం త్వరగా తెగేదికాదని, జిల్లాల్లోని ముస్లింలు స్థానిక అనుకూల మార్గం చూసుకుని కాంగ్రెస్‌ కు మద్దతు పలికి ఉంటారని భావిస్తున్నారు.  బిఆర్‌ఎస్‌కు   ఎంఐఎం మద్దతు ఎన్నికలలో నిర్ణయాత్మక అంశమై., బిజెపి వ్యతిరేక వోటు కాంగ్రెస్‌ పార్టీకి అనుకూలంగా  ఏకీకృతమై ఉంటునదని ఫలితాల బట్టి విశ్లేష్స్తున్నారు.  కెసిఆర్‌, కెటిఆర్‌ కేవలం  ఒవైసీ సోదరులకే అందుబాటులో ఉంటారని, మిగిలిన ముస్లిం పెద్దలకు ప్రాధాన్యం ఇవ్వరన్న స్థిర అభిప్రాయం కూడా ఒక కారణమంటున్నారు. . తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటైతే.. ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్‌ మాదిరిగా మైనార్టీ సబ్‌ ప్లాన్‌ ఏర్పాటు చేసి రూ.4 వేల కోట్లు కేటాయిస్తామని రేవంత్‌ రెడ్డి తెలపడంతో. కాంగ్రెస్‌ ప్రభుత్వంలోనే ముస్లింలకు న్యాయం లభిస్తుందని. మంత్రులుగా, రాజ్యసభ సభ్యులుగా ముస్లింలకు  అవకాశాలు లభిస్తాయని మైనార్టీ డిక్లరేషన్‌ లో  పేర్కొన్న విషయాలు కాంగ్రెస్‌  కు అనుకూలమైనట్లు భావిస్తున్నారు. ఇక బిఆర్‌ఎస్‌ విషయానికొస్తే కెసిఆర్‌ సిఎం అయిన తరువాత ఆశ్చర్యపరిచే   అంశం ఆయన వ్యక్తిగత విశ్వాసాలు, అభిరుచుల కోసం పెద్ద ఎత్తున ప్రజల సొమ్మును ఖర్చు చేయడం. అనేక దేవాలయాలకు మొక్కులు తీర్చుకోవదం,  ఖరీదైన ఆభరణాలు ఇవ్వడం,  తెలంగాణ వచ్చినందుకు మొక్కు తీర్చుకుంటున్నానని కేసీఆర్‌ తెలిపారు. అజ్మీర్‌ దర్గాకు కూడా కానుకలు పంపారు. లౌకిక ప్రభుత్వం కదా, ప్రజాధనంతో మొక్కులు ఎలా చెల్లిస్తారని ప్రశ్నించే అలోచన ఉన్నా ధైర్యం చేయలేదు.

ముఖ్యమంత్రి కార్యాలయం లౌకిక కార్యాలయం. ప్రజా ధనాన్ని వ్యక్తిగత విశ్వాసాలకు వినియోగించడం రాజ్యాంగబద్ధం కాదు’అని పలువురు విద్యా వేత్తలు చెప్పినా వినలేదన్న వాదన ఉంది. నూతన సచివాలయం పక్కన వందల కోట్లతో డా. అంబేడ్కర్‌ విగ్రహం భారీఎత్తున ఏర్పాటు చేయడం వోటు బ్యాంక్‌ లక్ష్యమేనని విమర్శకులు బహిరంగంగానే అన్నారు.
తెలంగాణ ఏర్పాడ్డక 2014-2018 మధ్య సచివాలయంలో కేసీఆర్‌ అడుగు పెట్టలేదు. రెండోసారి గెలిచి కేసీఆర్‌ ముఖ్యమంత్రి అయిన తరువాత, దేశంలో కోవిడ్‌ కోరలు చాపిన వేళ, 2020 జులై నెలలో పాత సచివాలయాన్ని కూల్చారు. హాస్పిటల్స్‌  లో రోగులకు పడకలు లేక, జనాలు ఇబ్బందులు పడుతున్న వేళ, అకస్మాత్తుగా భవనాలు కూల్చి హుస్సేన్‌ సాగర్‌ తీరంలో దాదాపు 25 ఎకరాల్లో ఉన్న సచివాలయాన్ని కూల్చివేసారు. ‘‘ఎవరైనా బయటి వారు వస్తే చూపించడానికి ఈ భవనాలు బాగా లేవు. కొత్త రాష్ట్రానికి ఒక మంచి సచివాలయం ఉండొద్దా’’ అని ప్రశ్నించేవారు. ఆ భవనాలేమీ శిథిలావస్థకు చేరుకున్నవి కాదు. కానీ, వాటిని కూల్చి వాటి స్థానంలో కొత్త సచివాలయం కట్టారు. అందుకు కారణం అది కేసీఆర్‌కు నచ్చకపోవడమే. పైకి చెప్పని కారణం వాస్తు.  ముచ్చటపడి కట్టించుకున్న కొత్త సచివాలయానికి కేసీఆర్‌ ఎన్నిసార్లు వచ్చారు అనే ప్రశ్న మరో చర్చనీయాంశం.. సచివాలయం కూల్చడం పరిపాలన సౌలభ్యం మాత్రమే కాదనీ, ఒక ఐకానిక్‌ భవనం కావాలనే ఆకాంక్ష అనే భావన ప్రజల్లో నాటుకు పోయిందానది వాస్తవం.

తెలంగాణలో తాము చేశామని  బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చెబుతున్న ‘అద్భుతాల్లో’కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బరాజ్‌లో ఇటీవల పిల్లర్లు దెబ్బతిన్నాయి. బరాజ్‌ కూడా కుంగింది. ఈ ప్రాజెక్టు దెబ్బతినడంపై చర్చ అంతా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు కేంద్రంగానే నడిచింది. ఎందుకంటే- ఆ ప్రాజెక్టును ‘రీడిజైన్‌’చేసింది కేసీఆర్‌ అని స్వయంగా ఆయన మేనల్లుడు, ఒకప్పటి సాగునీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు చెప్పారు. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి కేసీఆర్‌ ప్రభుత్వంపై అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయి. కాళేశ్వరం ప్రాజెక్టు ఆ కుటుంబానికి ‘ఏటీఎం’గా మారిందని స్వతంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. అంతేకాదు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో కేసీఆర్‌ స్వయంగా జోక్యం చేసుకుని పెద్ద పెద్ద ఇంజినీర్లకే సలహాలిచ్చారని ఇంజినీర్లు కూడా చెప్పారు.  ఎం ఎ తెలుగు చదువుకున్న కేసీఆర్‌… కాళేశ్వరం ప్రాజెక్టును రీడిజైన్‌ ఎలా చేస్తారు, సివిల్‌ ఇంజినీర్లకు సలహాలు ఇవ్వడం ఎలా సాధ్యం అని ఓతర్లు ప్రశ్నించుకున్న ఫలితమే ఎన్నికల్లో ఓతమికి దారితీసి ఉండవచ్చు.

కేసీఆర్‌ కుమారుడు కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్‌) తెలంగాణ ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్‌ శాఖల మంత్రిగా, పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కూడా ఆయనే. కేసీఆర్‌ మేనల్లుడు హరీశ్‌ రావు ఆర్థిక, ఆరోగ్యశాఖల మంత్రి,  పార్టీ కేడర్‌ ఆయన అధీనంలోనే ఉంటుంది. కేసీఆర్‌ కూతురు కల్వకుంట్ల కవిత ఎమ్మెల్సీ. కేసీఆర్‌ తోడల్లుడి కుమారుడు బి. సంతోష్‌ రావు రాజ్యసభ సభ్యుడు. ప్రభుత్వంలో, బీఆర్‌ఎస్‌లో కేసీఆర్‌ కుటుంబ సభ్యుల పాత్రపై తరచూ జరిగిన చర్చ, రాష్ట్రంలో కుటుంబ పాలన సాగుతోందనే విమర్శలు బీఆర్‌ఎస్‌ పార్టీకి మచ్చ తెచ్చాయని ఒక భావన. పెద్ద పెద్ద ఉద్యమకారులను అధికారంలో భాగస్వాములను చేయలేదని అభిప్రాయం కూడా.  అనేక సందర్భాలలో అసమ్మతి గళాలెత్తి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలూ పరస్పరం అరోపణలు సంధించుకున్న విషయం కొత్త కాదు. రైతు బంధు, దళిత బంధు, గొర్రెల పంపిణి, ఇళ్ళ స్థలాలు, బెడ్‌ రూం గృహాల కేటాయింపు, తదితర ప్రభుత్వ పథకాల అమలులో ప్రజా ప్రతినిధులే అవినీతికి పలపడుతున్నారన్న అభియోగాలున్నాయి. పార్టీ సమావేశాల్లో కొందరు ఎమ్మెల్యేలను ఈ విషయంలో ముఖ్యమంత్రి కెసీఅర్‌ తీవ్రంగా హెచ్చరించడం, అటువంటి వారికి టిక్కెట్లు ఇవ్వబోమని ప్రకటించడం ఒటమికి కారణమం టున్నారు. ఇవన్నీ ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షానికి కలసి వచ్చాయి.. తెలంగాణ ఏర్పడ్డాక భూ ఆక్రమణలు, ఇసుక మాఫియా పెరిగడం, రియల్‌ ఎస్టేట్‌ వాళ్లే రాజకీయాలను శాసించడం మైనస్‌ పాయిట్లయ్యాయి. ఇక దిల్లీ లిక్కర్‌ ‘కుంభకోణం’లో కేసీఆర్‌ కూతురు కల్వకుంట్ల కవిత ఈడీ, సీబీఐ విచారణ ఎదుర్కొంటూ. దిల్లీ మద్యం పాలసీలో జోక్యం చేసుకుని అక్కడి ప్రభుత్వంలోని వారికి లంచాలు ఇప్పించారని కేంద్ర దర్యాప్తు సంస్థలు ఇప్పటికే అనేక సార్లు ఆమెను విచారణకు పిలిచాయి.  భాజాపాతో అంతర్గత ఒప్పందాలున్నాయని బహిరంగంగానే అన్నారు. భారాసా ఎమ్మేల్యేలను బాజపా కొనుగోలుకు తెరలేపిందని ఒక అంకం ప్రారంభించి ప్రజల దృష్ఠిని మార్చదంలో కొంత సఫలీకృతులై, సిట్‌ వేసి దర్యాప్తు అన్నారు. కొన్ని నెలలు కథ నడచింది, తరువాత మరుగున పడిరది. తానొక్కడే తెలంగాణ కోసం కొట్లాడినట్టు చెప్పుకుంటూ వచ్చారు.

తనను ప్రశ్నించడం అంటే అభివృద్ధిని అడ్డుకోవడమే అని ప్రచారం చేసుకుని నిరంకుశ పాలనను తీసుకొచ్చి, దాని చాటున విచ్చలవిడిగా వనరులను దోచుకోవడానికి అధికారాన్ని వాడుకున్నారన్న అభియోగాలు నిప్పుకు గాలితోడైనట్లయింద్ది. విద్యావైద్య రంగాల్లో తెలంగాణ ఎంతో వెనుకబడి , అసలు స్కూళ్లు, హాస్పిటల్స్‌  పరిస్థితి బాగా లేదు. హాస్పిటల్స్‌ , పాఠశాలల పరిస్థితి ఏమిటి? ఇటువంటి సమయంలో వందల కోట్లు పెట్టి కొత్త సచివాలయం అవసరమా అని ఎందుకు ఆలోచించలేదన్న ప్రశ్నకు ఎన్నికల ఫలితాలే నిదర్శనం. ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికెగిరిందన్నట్లు తెలంగాణపై దృష్టి పెట్టకుండా కెసిఆర్‌ జాతీయ స్థాయిలో ఎదిగి దేశపాలనా పగ్గాలు చేత పట్టాలని అతిగా ఆశించి తెరాస ను ఒక ముహూర్తంలో భారాస గా పునర్‌ నామకరణం చేసి ఉత్తర భారతం పై ఆధిపత్యం పత్యం కోసమన్నట్లు మహారాష్ట్రలో కాలు పెట్టడం ఆయనపై ఒక మచ్చ. మేమే తృతీయ ప్రత్యామ్నాయం అంటూ రాజకీయ వ్యూహంలో భాగంగా కెసీఅర్‌ కర్ణాటక, తమిళనాడు, బెంగాల్‌, ఒడిశా వంటి రాష్ట్రాలు వెళ్ళి అధికార పార్టీల నేతలతో సమావేశమై అంతా తనకు మద్దతుగా ఉన్నారన్న అభిప్రాయం కలిగించే ప్రయత్నించినా,  ఆ తరువాత ఒక్కరూ ఆయన మాట ప్రస్తావించలేదు. బిజెపిలో మోదీ, అమిత్‌ షా, నిర్మలా సీతారామన్‌ మరికొందరు అగ్రనేతలతో సమవేశాలు జరిపినా ఫలితం దక్కలేదు.

-నందిరాజు రాధాకృష్ణ,
వెటరన్‌ జర్నలిస్ట్‌,
98481 28215 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *