ఉద్యోగాలపై కేబినేట్‌లో ఎందుకు చర్చించలేదు

  • నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నా పట్టించుకోరా..
  • సిఎం రేవంత్‌ రెడ్డికి బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌ రావు లేఖ

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 22 : గ్రూప్స్‌ అభ్యర్థుల, నిరు ద్యోగుల డిమాండ్లపై ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌ రావు శనివారం బహిరంగ లేఖ రాశారు. గ్రూప్స్‌ అభ్యర్థులు, నిరుద్యోగులకు క్యాబినెట్‌ సమావేశంలో న్యాయం చేసేలా నిర్ణయాలు తీసుకుంటుం టారని ఎదురుచూశామని అన్నారు. గ్రూప్‌ అభ్యర్థులు, నిరుద్యోగులకు ఇచ్చిన హావ్నిలు, సమస్యల గురించి ఎలాంటి చర్చ లేకుండా క్యాబినెట్‌ సమావేశం ముగించారని మండ పిడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన మొదటి ఏడాదే రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని ఎన్నికల సమయంలో హావ్ని ఇచ్చి మరిచారని ద్వజమెత్తారు. నిరుద్యోగులకు నెలకు రూ.4,000 భృతి ఇస్తామని మాట    ఇచ్చారని గుర్తుచేశారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి ఇప్పటికే ఆరు నెలలు దాటిందని తెలిపారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో ఇచ్చిన ఉద్యోగాలకు రేవంత్‌ రెడ్డి నియామక పత్రాలను ఇచ్చారు తప్ప కొత్తగా ఒక్క ఉద్యోగం కూడా ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు.

 

మిమ్మల్ని నమ్మి అధికారంలోకి తీసుకొచ్చిన నిరుద్యోగ యువత ఉద్యోగాల కోసం రోడ్డున పడి అర్తనాదాలు చేయాల్సిన పరిస్థితికి తెచ్చారని చెప్పారు. గ్రూప్‌ 1, డిఎస్సీ తదితర ఉద్యోగాల కోసం చేపట్టిన నియామక పక్రియ కూడా ఉద్యోగార్థులకు చాలా ఇబ్బంది కరంగా మారిందన్నారు. కనీసం వారు చేస్తున్న విజ్ఞప్తిని వినే పరిస్థితిలో కూడా ప్రభుత్వం లేకపోవడం శోచనీయమన్నారు. మెయిన్స్‌కు 1 : 50 నిష్పత్తిలో కాకుండా, 1 : 100 నిష్పత్తిలో అభ్యర్థులను అనుమతించాలని కోరారు. ఇటీవల ఆంధప్రదేశ్‌ రాష్ట్రంలో నిర్వహించిన గ్రూప్‌ 2 నోటిఫికేషన్‌లో 1:15 గా పేర్కొన్నప్పటికీ, అభ్యర్థుల కోరిక మేరకు 1:100 నిష్పత్తిలో మెయిన్స్‌కి ఎంపిక చేశారని గుర్తుచేశారు.

 

గ్రూప్‌ 2కు రెండు వేల ఉద్యోగాలు, గ్రూప్‌ 3కి మూడు వేల ఉద్యోగాలు అదనంగా కలుపుతామని రేవంత్‌ మాట ఇచ్చారని.. ఆ దిశగా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. పోటీ పరీక్షల మధ్య కాలవ్యవధి చాలా తక్కువ ఉండడం వల్ల అభ్యర్థులు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. ఉద్యోగ నియామకాల పరీక్షల తేదీల మధ్య ఎక్కువ వ్యవధి ఉండేలా షెడ్యూల్‌ సవరించాలని హరీష్‌ రావు విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *