ఆషాఢ మాసం వచ్చేసింది
వాతావరణంలో
మార్పులన్నీ తెచ్చేసింది
నీటి మార్పులు తెస్తుంది
జీర్ణశక్తిని మందగింప జేస్తుంది
కఫం ఇబ్బంది పెడుతుంది
పేలాలే దానికి నివారణ అంటుంది
పోషకాల మునగాకు వేడి గలది
ఈ కాలంలో తింటే చల్ల బరుస్తుంది
దక్షిణాయనం ఆరంభమౌతుంది
పితృదేవతలకు ఇష్టమైన కాలం ఇది
దానాలు చేసేందుకు అనువైనది
గొడుగు, చెప్పులు దానం గొప్పది
సముద్ర స్నానం చేయటం మంచింది
ఆరోగ్యాన్ని అందించి తీరుతుంది
ఈ కాలంలో గోరు పెళుసు బారుతుంది
గోరింటాకు దీన్ని నివారిస్తుంది
ఆషాఢ•ం లో కొత్త అల్లుడకి శాస్త్రం చెబుతుంది
అత్త గారి గడపదాట కూడదటుంది
ఆషాఢ•మాసంలోనివి
తెలుసుకో మంటుంది
ఆచరించి ఫలితాలు చూడమటుంది
– గాదిరాజు రంగరాజు
8790122275




