ఆడబిడ్డలకు అండగా…

ఆరోగ్యలక్ష్మీ పథకంతో తొమ్మిదేళ్లలో సుమారు 36,26,603 మంది మహిళలు లబ్దిపొందారు.
బ్యాంకులు స్వయం సహాయక బృందాలకు 3,738.67 కోట్ల రుణాలు ఇవ్వగా, 2022-23 నాటికి అది
రూ. 12,722.14 కోట్లకు చేరుకుంది…సఖి కేంద్రాలు 24/7 పనిచేస్తాయి.
ప్రత్యేకంగా మహిళా ప్రయాణికుల రక్షణ/రవాణా కోసం ప్రభుత్వం 16షీ టాక్సీలను ప్రవేశపెట్టింది.

హైదరాబాద్‌, ‌జూన్‌  12: ఆరవై ఏళ్ల సుదీర్ఘ పోరాటంతో స్వరాష్ట్రం ఏర్పాటు కలను సాకారం చేసుకున్న తెలంగాణ రాష్ట్రం, తొమ్మిదేళ్ల కాలంలో జనాభాలో సగభాగంగా ఉన్న ఆడబిడ్డలకు అండగా నిలుస్తోంది. తొమ్మిదేళ్లకాలంలో దేశం యావత్తూ అబ్బురపడే పథకాలు అమలు చేస్తూ… దేశానికి, అంతర్జాతీయంగా దేశదేశాలకు ఆదర్శంగా నిలుస్తోంది. ఎన్నో కష్టాలు, బలిదానాలు, త్యాగాలతో సాధించుకున్న రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమానికి తెలంగాణ రాష్ట్ర సాధకుడు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు నేతృత్వంలోని ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తూ జాతీయస్థాయిలో అగ్రస్థానంలో నిలుస్తోంది. మాతా శిశు సంరక్షణ కోసం కార్యక్రమాల అమలులో భాగంగా ప్రభుత్వం చేపట్టిన వివిధ పథకాలకు దేశ వ్యాప్తంగా ప్రశంసల జల్లు అందుతోంది. గర్భిణీలకు, బాలింతలకు పోషకాహారం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ‘ఆరోగ్య లక్ష్మీ’ కార్యక్రమాన్ని ప్రవేశ పెట్టింది. ఈ పథకం ద్వారా గర్భిణీలకు, బాలింతలకు అంగన్‌ ‌వాడీ కేంద్రాలలో వేడివేడిగా వండిన భోజనాన్ని అందిస్తోంది. ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు 2015 లో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించారు. ఆరోగ్య లక్ష్మీ పథకంతో తొమ్మిదేళ్లలో సుమారు 36,26,603 మంది మహిళలు లబ్ది పొందారు. ఆరోగ్య లక్ష్మీ యాప్‌ ‌ను రూపొందించి గర్భిణీల, బాలింతల హాజరును వారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం జరుగుతుంది. భోజనంలో పప్పు, ఆకు కూరలు / సాంబార్‌, ‌కూరగాయలు, ఉడకపెట్టిన గుడ్డు, 200 మిల్లీ లీటర్ల పాలు ఇవ్వడం జరుగుతుంది. భోజనంతో పాటు ఐరన్‌, ‌ఫోలిక్‌ ‌యాసిడ్‌ ‌మాత్రను కూడా ఇస్తారు. పోషకాహారంపై అవగాహన, ఆవశ్యకత తెలుపడంతో పాటు గర్భిణీలు, బాలింతలు పోషకాహారాన్ని విధిగా తీసుకునేలా చర్యలు తీసుకోవడమే దీని ముఖ్య ఉద్దేశం. తద్వారా అంగన్‌ ‌వాడి కేంద్రాల్లో మహిళల నమోదు మెరుగు పడేలా కృషి చేస్తున్నారు. అంతేకాకుండా బరువు తక్కువగా పుట్టే బిడ్డలు కూడా పౌష్టికాహారం లోపం లేకుండా ఉండేలా ఈ పథకం ముఖ్య ఉద్దేశం. దీని వలన శిశు మరణాల శాతం గణనీయంగా తగ్గింది.
7 నెలల నుండి 3 సంవత్సరాల లోపు పిల్లలకు ‘‘బాలామృతం’’ పేరుతో పోషకాహారాన్ని ప్రభుత్వం అందిస్తోంది. గోధుమ, శనగపప్పు, మిల్క్ ‌పౌడర్‌, ‌నూనె పంచదార తో కూడిన ఆహారాన్ని అందిస్తారు. రోజుకు 3 నుంచి 5 సార్లు 100 గ్రాముల చొప్పున ఇవ్వాల్సి ఉంటుంది. బాలామృతం ప్యాకెట్‌ ‌తో పాటు నెలకు 16 గుడ్లను 7 నెలల నుండి 3 సంవత్సరాల లోపు పిల్లలకు అందించడం జరుగుతుంది. చిన్నారులలో ఉండే పౌష్టికాహార లోపాన్ని అరికట్టేందుకు బాలామృతం చాలా ఉపయోగపడుతుంది.చిన్నారులలో తీవ్ర పౌష్టికాహార లోపాలను అరికట్టడానికి ప్రభుత్వం ‘‘ బాలామృతం ప్లస్‌’’ అనే పథకాన్ని కూడా ప్రవేశ పెట్టింది. ఇందులో అదనపు కార్బోహైడ్రేట్స్ ‌తో పాటు ప్రోటీన్లు మరియు సూక్ష్మ పోషకాలు పిల్లలకు అందేలా నిర్ణయం తీసుకున్నారు. అంగన్‌ ‌వాడి కేంద్రాల్లో నమోదైన చిన్నారులకు బాలామృతం ప్లస్‌ ‌ను అందించడంతో పాటు వారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తారు. బాలామృతం ప్లస్‌ ‌ను ఆసిఫాబాద్‌- ‌కొమరంభీం, జోగుళాంబ గద్వాల జిల్లాల్లో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టి అనంతరం అన్నీ జిల్లాలకు విస్తరించారు.  పాఠశాల బయట ఉన్న కౌమార దశ, (11-14 వయస్సు మధ్యలో ) ఉన్న ఆడ పిల్లలకు, ఇతర అవసరాలు గల ఉన్న ఆడపిల్లలకు పోషకాహార కిట్లను ప్రభుత్వం అందచేస్తుంది. ఆ కిట్‌ ‌లో గోధుమలు, నెయ్యి, కర్జూరాలు, ప్రోటీన్‌ ‌బిస్కెట్స్, ఐరన్‌, ‌జింక్‌ ‌సిరప్‌, ‌మల్టీ విటమిన్స్ ‌మాత్రలు ఉంటాయి.
గిరిజన సంక్షేమ శాఖ, మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ సంయుక్తంగా ఇక్రిశాట్‌ ‌శాస్త్రీయ సహకారంతో ఈ పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తుంది. తక్కువ బరువు, పెరుగుదలలో లోపం, రక్త హీనత, కలిగిన గిరిజన పిల్లలు, కౌమార దశ బాలికలు, గర్భిణీలు, బాలింతలకు ఈ గిరిపోషణ కార్యక్రమాన్నివర్తింప చేశారు. ఉట్నూర్‌, ‌భద్రాచలం, మన్నూరులలో సమీకృత గిరిజన అభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) పరిధిలోని ప్రాంతాలలో  శిశువులు, గర్భిణీలు, కౌమార దశ ఉన్న ఆడ పిల్లలకు హైడ్రేన్స్  ‌పోషకాహారాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఉట్నూర్‌ ఐటీడీఏ పరిధిలోని గిరిజన గూడాలల్లో 3000 గర్భిణీలకు పోషకాలతో కూడిన మహాలడ్డు ను 8 నెలలపాటు ఇవ్వడం జరిగింది. వారిలో ముఖ్యంగా హిమోగ్లోబిన్‌ ‌శాతాన్ని మెరుగుపరిచేలా చేయడంలో లడ్డూల పాత్ర కీలకంగా మారింది. ఖాళీ స్థలాలు కలిగిన అంగన్‌ ‌వాడి కేంద్రాలలలో న్యూట్రీ గార్డెన్‌ ‌పేరిట ఉద్యాన వనాలను ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ కమిషనర్‌ ‌కార్యాలయంలో ఏర్పాటు చేసిన మోడల్‌ ‌న్యూట్రీ గార్డెన్స్ ‌లో సంప్రదాయ పద్ధతిలో సేద్యం చేస్తున్నారు. న్యూట్రీ గార్డెన్‌ ‌లో కూరగాయలు, ఆకుకూరలను పండించి, కమిషనర్‌ ‌కార్యాలయంలో నెలకొని ఉన్న చిల్డ్రన్‌ ‌హోమ్‌ ‌శిశు విహార్‌ ‌చిన్నారులకు అందించడం జరుగుతోంది. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా అంగన్‌ ‌వాడీ టీచరు నెలకు రూ.13,650/-, ఆంగన్‌ ‌వాడీ హెల్పర్‌ ‌కు రూ. 7,800/- లను గౌరవ వేతనంగా ఇవ్వడం జరుగుతుంది.
ఖాళీ స్థలం ఎక్కువగా ఉన్న అంగన్‌ ‌వాడి కేంద్రాలలలో న్యూట్రీ గార్డెన్‌ ‌పేరిట ఉద్యాన వాణాలను  ప్రభుత్వం అభివృద్ది చేస్తుంది.  మహిళాభివృద్ది శిశు సంక్షేమ శాఖ కమిషనర్‌ ‌కార్యాలయంలో ఏర్పాటు చేసిన మోడల్‌ ‌న్యూట్రీ గార్డెన్స్  ‌లో సంప్రదాయ పద్దతిలో సేద్యం చేస్తున్నారు. న్యూట్రీ గార్డెన్స్ ‌లో కూరగాయలు, ఆకుకూరలను పండించి, కమిషనర్‌ ‌కార్యాలయంలో నెలకొని ఉన్న చిల్డ్రన్‌ ‌హోమ్‌, ‌శిశు విహార్‌ ‌చిన్నారులకు అందించడం జరుగుతుంది.
మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ చేపట్టే కార్యక్రమాలలో ప్రీ- ప్రైమరీ విద్యాబోధన కీలక భూమిక పోషిస్తోంది. పూర్వ ప్రాథమిక విద్యను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం 2019 లో పాఠ్య ప్రణాళికలో మార్పులు చేసింది. అంగన్‌ ‌వాడీ టీచర్లకు నెలనెలా పుస్తకాలను అందించడం జరుగుతుంది. తంగేడు పూల పేరిట నాలుగు పుస్తకాలు, పాలపిట్ట పేరిట ఐదు పుస్తకాలను ఎల్‌.‌కేజీ, యూకేజీలో చేరిన విద్యార్థులకు విధిగా ప్రభుత్వం అందిస్తోంది. పూర్వ ప్రాథమిక విద్యా పాఠ్యప్రణాళికలో వీడియోలు, ఆడియో కార్యక్రమాలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. సమగ్ర పిల్లల రక్షణ పథకం (ו••). రాష్ట్రంలోని 33 జిల్లాలలో బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించడానికి వీలుగా బాల రక్షక్‌ ‌వాహనాలను ఏర్పాటు చేసి, రెస్క్యూ ఆపరేషన్స్ ‌లో వాడటం జరుగుతుంది.  దేశంలోనే మొట్ట  మొదటి సారిగా వివిధ కార్పొరేట్‌ ‌సంస్థలు, చీ+• ల సహకారంతో అందిన నిధులతో వాహనాలను కొనుగోలు చేసి, రెస్క్యూ ఆపరేషన్లలో వినియోగి ంచడం జరుగుతోంది. రక్షక భవనాలను ఏర్పాటు చేసి ఒకే గొడుగు కింద బాలల రక్షణ చర్యలు చేపడుతున్నారు.
గృహహింస, వేధింపులు, దాడులు, ప్రమాదాలకు గురైన మహిళకు తక్షణ వైద్యం, న్యాయం, ఆర్థిక సాయం అందించే లక్ష్యంతో వన్‌ ‌స్టాప్‌ ‌సెంటర్‌ ‘‘ ‌సఖి’’ని ఏర్పాటు చేయడం జరిగింది. 2017 లో ప్రారంభమైన ఈ సఖి కేంద్రాలను అన్ని జిల్లాలలో ఏర్పాటు చేశారు. సఖి కేంద్రాలలో మహిళలకు బహుముఖ సేవలు అందించడం జరుగుతుంది. సఖి కేంద్రంలో మహిళకు 5 రోజుల పాటు అత్యవసర ఆశ్రయం కూడా కల్పిస్తారు. సఖి కేంద్రాలు 24/7 పని చేస్తాయి.ప్రత్యేకంగా మహిళా ప్రయాణీకుల రక్షణ/రవాణా కోసం ప్రభుత్వం 16 షీ టాక్సీలను ప్రవేశపెట్టింది. 16 మంది మహిళా డ్రైవర్స్ ఈ ‌టాక్సీలను నడుపుతూ మహిళా ప్రయాణీకులకు రక్షణగా ఉంటున్నారు. షీ టాక్సీలను 35 శాతం సబ్సిడీతో ప్రభుత్వం అందిస్తోంది.

మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ తన వాటాగా 35 శాతం సబ్సిడీ, 10 శాతం మార్జిన్‌ ‌మనీ తో మహిళా క్యాబ్‌ ‌డ్రైవర్స్ ‌ను క్యాబ్‌ ‌లు కొనుగోలు చేసేందుకు ప్రోత్సహిస్తుంది. దేశంలోనే మొట్ట మొదటిసారిగా ప్రభుత్వం మహిళల కోసం మోటార్‌ ‌డ్రైవింగ్‌ ‌స్కూల్‌ ‌ను రూ.49 లక్షలు వెచ్చించి, స్థాపించింది.

దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో అంగన్‌ ‌వాడి టీచర్‌ ‌కు నెలకు రూ. 13,650/- అంగన్‌ ‌వాడి హెల్పర్‌ ‌కు రూ. 7,800/- లను గౌరవ వేతనంగా ఇవ్వడం జరుగుతుంది. మహిళలు సర్వతోముఖాభివృద్దిగా చెందినపుడే సమాజం అభివృద్ది చెందుతుంది. అనే నమ్మకంతో స్వయం సహాయక సంఘ మహిళలను ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. స్వయం సహాయక బృంద  మహిళల ఆర్ధిక స్వావలంభన కోసం బ్యాంక్‌ ‌లింకేజీ ద్వారా వారికి రుణాలను విరివిగా ఇచ్చేలా చర్యలు చేపట్టింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత బ్యాంకులు స్వయం సహాయక బృందాలకు ఇచ్చే ద్రవ్య సహాయం మూడింతలు పెరిగింది. 2014-15 సంవత్సరంలో బ్యాంకులు స్వయం సహాయక బృందాలకు 3,738.67 కోట్ల రుణాలు ఇవ్వగా, 2022-23 నాటికి అది రూ. 12,722.14 కోట్లకు చేరుకుంది. స్వయం సహాయక బృందాల సభ్యులు, బృందాల గ్రామ స్థాయి సంస్థల ఆర్ధిక లావాదేవీలను నమోదు చేసేందుకు మొబైల్‌ అకౌంటింగ్‌ ‌యాప్‌ ‌ను కూడా రూపొందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *