(మార్చి 8, అంతర్జాతీయ మహిళా దినోత్సవం)
ఒకప్పుడు మహిళ అంటే వంటింటికే పరిమితమన్న భావన అందరిలోను ఉండేది. కాని నేడు ఎందు లోనూ తీసిపోమ్మంటూ ముందుకు దూసుకెళ్తున్నారు మహిళలు. పలు రంగాల్లో ప్రతిభను కనబరుస్తూ అద్భుతాలు సృష్టిస్తూ అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు. గల్లీ నుంచి ఢల్లీి వరకు రాజకీయాల్లో రాణిస్తూ ప్రజాస్వామ్యానికి ప్రాణం పోస్తున్నారు. లాలించే అమ్మగా….ప్రేమించే ప్రియురాలిగా.. అప్యాయతను పంచే సోదరిగా…ఇలా ఎన్నోపాత్రలు పోషిస్తూ అప్యాయత అనురాగాలను పంచుతున్నారు. అంది వచ్చిన అవకాశాలను ఆయుధంగా మల్చుకొని ఆకాశమే హద్దుగా…అన్నింటా ముందు వరుసలో నిలుస్తున్నారు మహిళలు.అయినా మహిళల పట్ల వివక్ష కొనసాగుతునే ఉంది. రోజు రోజుకు మహిళలపై వేదింపులు పెరిగిపోతున్నప్పటికీ మహిళ చట్టాలను పకడ్బందీగా అమలు చేయడం లేదు.ఆడది అబల కాదు సబల అని నిరూపించుకుంటూ ఆధునిక సాంకేతిక యుగంలో అన్ని రంగాల్లో దూసుకపోతున్న ధీరవనితల స్పూర్తితో మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవంను విశ్వ వ్యాప్తంగా ఘనంగా జరుపుకునేందుకు సిద్ధమయ్యారు.ఈ రోజు ఒక చారిత్రాత్మక ప్రాధాన్యత గల రోజుగా చరిత్ర పుటల్లో నిలుస్తుంది.1857లో అమెరికాలోని పశ్చిమ పెన్సిల్వేనియా ప్రాంతంలోని ఒక వస్త్ర మిల్లులో పురుషులతో సమానమైన వేతనం కోసం మహిళలు సమ్మెకు దిగి మార్చి 8న విజయం సాధించారని చరిత్ర చెప్పుచున్నది. భారతదేశంలోని ఆయా రంగాల్లో విశేష కృషి చేసిన మగువలకు గుర్తింపుగా ‘నారీ శక్తి పురస్కారం’ అంతర్జాతీయ మహిళా దినోత్సవం ‘’మార్చి 8’’ రోజున భారత రాష్ట్రపతి చే అందజేయ పడుతుంది.
రాజకీయ పార్టీల మనుగడ కోసం మహిళలను పతాకశీర్షికన నిలబెట్టే ప్రయత్నం పోటాపోటీగా జరుగుతుంది.నమ్మితే మగవారితో పోలిస్తే మహిళలు రాజకీయ రంగంలో మరింత రాణించవనే అభిప్రాయం ఏర్పడిరది.మహిళలు నీతి, నిజాయతీ విషయంలో పురుషులకన్నా కూడా మెరుగేనని తాజాగా నిర్వహించిన అమెరికాలోని రైస్ యూనివర్సిటీకి చెందిన ఒక అంతర్జాతీయ సర్వే తేల్చిచెప్పింది.ఈ అధ్యయనంలో మగవారికన్నా కూడా మహిళలు ఎంతో నీతి, నిజాయతీతో ఉంటారని తేలింది.గత పదేళ్లలో రాజకీయాల్లో సమాజ సేవకు బదులుగా ఆస్తులను కూడబెట్టుకుని,డబ్బును పోగేసుకున్న మగవారి శాతం పెరిగిందని, సంపాదన విషయంలో ఆడవారు వెనుకబడి ఉన్నారని ఈ సర్వే వెల్లడిరచింది.అవినీతికి పాల్పడి అవినీతి నిరోధక శాఖకు దొరికిన, అవినీతి ఆరోపణలను ఎదుర్కొన్న సంఖ్యకూడా మగవారిదే అగ్రస్థానం.ఆయా దేశాల్లో బయటపడిన కుంభకోణాలు, రాజకీయ నాయకుల అక్రమాస్తులు, అవినీతి కేసులు ఇలా వివిధ రకాలకు సంబంధించిన సమాచారాన్ని తెప్పించుకుని తమ సర్వేని నిర్వహించారు.ఈ సర్వేలో మగవారికన్నా కూడా మగువలపై ఎక్కువగా నమ్మకాన్ని పెట్టుకోవచ్చని తేలింది.కానీ ఇప్పటికీ అనేక ఉద్యోగాల్లో ప్రభుత్వాలు స్త్రీల ప్రాతినిథ్యం కల్పించడం లేదు. స్త్రీ పురుషులు ఇరువురికి సమాన అవకాశాలు ప్రైవేటు రంగంలో కూడా ఖచ్చితంగా అమలు చేస్తే తప్ప ‘‘సమాన అవకాశాలు’’ అనే పదానికి అర్ధమే లేదు. మహిళలు వృత్తి, వ్యాపారాల్లో రాణించిన ప్రజా జీవితంలో వారి పాత్ర ఇప్పటికి పరిమితంగానే కొనసాగుతుంది.
మూడు దశాబ్దాలుగా హెచ్ డి దేవేగౌడ ,అటల్ బిహారీ వాజపేయి, మనోహ్మన్ సింగ్ ప్రభుత్వాల హయాంలో బిల్లు లోకసభ ఆమోదానికి నోచుకోలేదు. 2014 లో ఏర్పడిన మోడీ ప్రభుత్వం మొదటి దఫాలో అమలుకు శ్రద్ధ చూపించలేదు. మూడవసారి ఎన్నికల్లో గెలవాలనే సంకల్పముతో నూతన పార్లమెంట్ భవనంలో సరికొత్త ఆలోచనతో మహిళలకు చట్టసభల్లో 33శాతం రిజర్వేషన్ కల్పించేందుకు ఉద్దేశించబడిన 128వ రాజ్యాంగ సవరణ ద్వారా మహిళా రిజర్వేషన్ బిల్లు 454ఓట్లతో ఆమోదింపజేసింది. ఈ విషయంలో భారత రాజకీయ వ్యవస్థ అరుదైన ఏకాభిప్రాయం కనబర్చింది. మేము సగం ..మాకు సగం అనే నినాదానికి అన్ని రాజకీయ పార్టీలు ముక్తకంఠంతో జై కొట్టినాయి.తెలంగాణ రాష్ట్ర అవిర్భావం తర్వాత తోలి సీఎం కేసీఆర్ ప్రభుత్వం దేశంలోనే తొలిసారిగా అదనపు డీజీపీ స్థాయి అధికారి నేతృత్వంలో ప్రత్యేకంగా ’’ఉమెన్ సేప్టీ వింగ్’’ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.దాడులు, అకృత్యాలు జరిగితే రక్షించే ప్రత్యేక వ్యవస్థ ఒకటి ఉందన్న ఆత్మవిశ్వాసం మహిళల్లో పెరిగింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎక్కడైతే మహిళలు గౌరవించబడతారో అక్కడ దేవతలు కొలువైఉంటారనే భావంతో మహిళలను ఆర్థిక, రాజకీయ స్వాలంబన కోసం ఎన్నికల ముందు హామీ ఇచ్చినట్టుగానే ఆరు గ్యారెంటీ పథకాలలో మహిళను అన్ని రంగాల్లో తీర్చిదిద్దే విధంగా మహిళా ఆర్థిక పరిపుష్టి ప్రధాన అంశంగా ఉచిత బస్సు ప్రయాణం,ఉచిత కరెంట్, ఉచిత గ్యాస్,రాజీవ్ ఆరోగ్యశ్రీ అందిస్తూ కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు మహిళను విజయవంతంగా అమలు చేస్తున్నారు.దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మహిళా భద్రతా విభాగం కింద ’షీ’ టీమ్స్, భరోసా, షీ సైబర్ ల్యాబ్ ఉపవిభాగాలు సమర్థంగా పనిచేస్తున్నాయి. స్త్రీల రాజకీయ ప్రాతినిథ్యం పెరుగుతున్న కొద్దీ కాలక్రమంలో వారిలో రాజకీయ చైతన్యం పెరుగుతుందనేది జగద్విదితం. ప్రస్తుత మహిళా రిజర్వేషన్ చట్టం రూపకల్పన లోపభూయిష్టంగా ఉన్నప్పటికీ, ఏదో ఒక రూపంలో మహిళల ప్రాతినిధ్యం పెంచడానికి, చట్ట సభల్లో గట్టి స్వరం వినిపించడానికి చేసిన ప్రయత్నంగా స్వాగతించాలి.
-డా. సంగనిమల్లేశ్వర్
విభాగాధిపతి, జర్నలిజం శాఖ,
కాకతీయ విశ్వవిద్యాలయం,
వరంగల్,
సెల్ : 9866255355





