అసెంబ్లీలో బిఆర్‌ఎస్‌ నేతల బండారం బట్టబయలు

మాజీ సిఎస్‌ సోమేష్‌ భూబాగోతాన్నీ వెల్లడిస్తాం
కవిూషన్ల కోసమే కాళేశ్వరం నిర్మాణం
బిఆర్‌ఎస్‌ నేతల విమర్శలపై మంత్రి కోమటిరెడ్డి మండిపాటు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 5 : అసెంబ్లీలో బీఆర్‌ఎస్‌ నేతల బండిరం బయట పడుతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హెచ్చరించారు.  ధరణి పేరుతో కోట్లు దోచుకున్నారని..వారం రోజుల్లో మాజీ సీఎస్‌ సోమేష్‌ కుమార్‌ 5 వేల ఎకరాల భూమి భాగోతం బయటకు వొస్తుందని ఆయన తెలిపారు. కవిూషన్ల కోసమే మాజీ సీఎం కేసీఆర్‌ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాట్‌ కామెంట్స్‌ చేశారు. సోమవారం నాడు ఆయన విూడియాతో మాట్లాడుతూ… దక్షిణ తెలంగాణను నట్టేట ముంచి.. ప్రస్తుతం ఇక్కడ తాగునీరు లేకుండా కేసీఆర్‌ చేశారని మండిపడ్డారు. కుర్చీ వేసుకుని ఎస్‌ఎల్‌ బీసీ సొరంగం పూర్తి చేస్తామని చెప్పిన కేసీఆర్‌ ఏనాడూ ఆ ప్రాజెక్టును పట్టించుకోలేదని చెప్పారు. కాళేశ్వరం కంటే ఏడాది ముందు మొదలు పెట్టిన డిరడి ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. కవిూషన్ల కోసం కట్టిన కాళేశ్వరం మూడేళ్లకే కుంగి పోయిందన్నారు. ఏపీ సీఎం జగన్మోహన్‌ రెడ్డితో కుమ్మక్కై దక్షిణ తెలంగాణను సీఎం కేసీఆర్‌ నాశనం చేశారని ధ్వజమెత్తారు. అసెంబ్లీ తర్వాత నల్గొండలో విూటింగ్‌ పెడితే ప్రజల్లో కేసీఆర్‌పై ఎంత వ్యతిరేకత ఉందో అర్థమవుతుందన్నారు. నల్గొండకు కేసీఆర్‌ వొస్తే ప్రజలు తిరగబడి తరిమి తరిమి కొడతారని హెచ్చరించారు.

బస్సులో వొస్తే రోడ్లపై ఆపి కొడతారని.. మిలిట్రీను తెచ్చుకున్నా సరే.. కేసీఆర్‌కు ప్రజల చేతిలో పరభావం తప్పదని వార్నింగ్‌ ఇచ్చారు. నల్గొండ, ఖమ్మం, మహబూబ్‌ నగర్‌ ప్రజలకు చేసిన మోసాలకు కేసీఆర్‌, హారీష్‌ రావు బహిరంగ క్షమాపణ చెప్పాలన్నారు. నల్గొండ జిల్లాకు కేసీఆర్‌ చేసింది మామూలు మోసం కాదని..జిల్లాకు జరిగిన అన్యాయం తలచుకుంటేనే తన రక్తం మరిగిపోతుందన్నారు. ఒక్కో ఎమ్మెల్యేను 50, 60 వేల వోట్లతో ఓడిరచినా బుద్ధి రాలేదా..? అని ప్రశ్నించారు. చీఫ్‌ ఇంజనీర్‌ అయిన కేసీఆర్‌ ప్రాజెక్టులు ఆగం చేశారని ఆరోపించారు. కృష్ణా ప్రాజెక్టులు కేఆర్‌ఎంబీకి అప్పగించిందే బీఆర్‌ఎస్‌, కేసీఆర్‌ అని విమర్శించారు. బీఆర్‌ఎస్‌ అంటేనే బొందల పార్టీ అని ఎద్దేవా చేశారు. నల్గొండ, భువనగిరి రెండు పార్లమెంట్‌ స్థానాల్లో బీఆర్‌ఎస్‌కు డిపాజిట్‌ రాదన్నారు. మూట ముళ్లే రెడీ చేసుకుని దుబాయ్‌ వెళ్లేందుకు కేసీఆర్‌ స్పెషల్‌ ఫ్లైట్‌ రెడీ చేసుకున్నారని సెటైర్లు వేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *