– అభినందనలు తెలిపిన మాజీ మంత్రి హరీష్‌రావు
హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 8: యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నాలుగో యూనిట్ (800 మెగావాట్లు) సీfyడీ పూర్తి చేసుకున్న శుభ సందర్భంలో మాజీ మంత్రి హరీష్‌రావు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఇదే సమయంలో ఈ విజయం కోసం కృషి చేసిన ఇంజినీర్లు, అధికారులు, కార్మికులకు ధన్యవాదాలు తెలిపారు. కేసీఆర్ ముందు చూపునకు, దార్శనికతకు 4000 మెగావాట్ల సామర్థ్యం కలిగిన యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ విజయగాథ నిదర్శనమన్నారు. స్వతంత్ర భారత దేశ చరిత్రలో ఒక రాష్ట్ర ప్రభుత్వ నిర్వహణలో ఉన్న అతి పెద్ద థర్మల్ పవర్ ప్లాంట్ ఇదే కావటం గొప్ప విషయమన్నారు. అంధకారంలో ఉన్న రాష్ట్రాన్ని, మిగులు విద్యుత్తు రాష్ట్రంగా నిలిపి, రాష్టంలో వెలుగు జిలుగులు నింపిన ఘనత కేసీఆర్ గారికే దక్కుతుంది. తెలంగాణ చరిత్రపై కేసీఆర్ చేసిన మరో చెరగని సంతకం యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్. దీన్ని తుడిచేయలేరన్నారు. ఎవరెన్ని విమర్శలు చేసినా, ఎవరెన్ని కారు కూతలు కూసినా భవిష్యత్ తెలంగాణకు దారి దీపం యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్ట్ రాబోయే కాలంలో యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ రాష్ట్రంలోని ప్రజల, రైతుల విద్యుత్ అవసరాలను తీర్చడంలో గణనీయమైన పాత్ర పోషిస్తుందన్నారు. కేసీఆర్ కుఎక్కడ పేరు వస్తుందో అనే కురచ బుద్ధిని, కుళ్ళు రాజకీయాలను పక్కన పెట్టి రాష్ట్ర రైతాంగం, తెలంగాణ ప్రజల విశాల ప్రయోజనాల దృష్ట్యా యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్ట్ లో మిగిలిన రెండు యూనిట్లను త్వరితగతిన పూర్తి చేసి, కమర్షియల్ ఆపరేషన్ లోకి తేవాలని డిమాండ్ చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





