నేడు ప్లాంట్‌ను ప్రారంభించనున్న సీఎం రేవంత్‌రెడ్డి
ముందస్తుగా ప్లాంట్‌ను పరిశీలించిన మంత్రులు
మిర్యాలగూడ, ప్రజాతంత్ర, డిసెంబర్ 12: ఈ నెల 7న నల్లగొండ జిల్లా దామరచర్ల వద్ద నిర్మించిన యాదాద్రి థర్మల్‌వపర్ ప్లాంట్‌ను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభించారు.ఈ నేపథ్యంలో శుక్రవారం రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వర్‌రావు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, డిసిసి అధ్యక్షుడు కేతావత్ శంకర్‌నాయక్‌లతో పాటు కలిసి సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం విలేకరులతో వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజలందరూ ప్రజాపాలనకు బ్రహ్మరథం పడుతున్నారన్నారు.
సంక్షేమ అభివృద్ధి కోసం సామాజిక న్యాయం అనే నినాదంతో పరిపాలనను ప్రజలకందిస్తామన్నారు. రానున్న 4ఏండ్లలో ఇచ్చిన హామీలను పూర్తి చేయడంతో పాటు చరిత్రలో నిలబడేలా సుస్ధిర పాలనను అందిస్తామని భరోసా ఇచ్చారు. వ్యవసాయ రంగంలో నల్లగొండ జిల్లాతో పాటు కరీంనగర్ జిల్లా మొదటి నుంచి ఎక్కువ ఉత్పత్తి చేస్తున్నాయన్నారు. వ్యవసాయ రంగ అభివృద్ధి కోసం మిల్లర్లతో మాట్లాడి సమస్యను అధిగమించి బోనస్‌ను అందించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు. ఈ నెల 7న సాయంత్రం నల్లగొండలో జరగనున్న కాంగ్రెస్ విజయోత్సవ సభకు అధిక సంఖ్యలో ప్రజలు తరలిరావాలని కోరారు. వారి వెంట పగిడి రామలింగయ్య, గాయం ఉపేందర్‌రెడ్డి, మహమూద్ ఆలీ, చిరుమర్రి కృష్ణయ్యతో పాటు రెవిన్యూ సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు.