~ తెలంగాణ సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో
– బాలల దినోత్సవం సందర్భంగా నిర్వహణ
– అకాడమీ కార్యదర్శి ప్రకటన
– అకాడమీ కార్యదర్శి ప్రకటన
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 9: నవంబర్ 14న బాలల దినోత్సవం సందర్భంగా తెలంగాణ సాహిత్య అకాడమి పాఠశాల విద్యార్థినీ విద్యార్థులకు పద్యం / కవిత / గేయం, కథ, నాటికల పోటీ నిర్వహిస్తున్నది. ఈ క్రింది నిబంధనలను పాటిస్తూ రచనలను నవంబర్ 5వ తేదీలోగా అందేటట్టుగా కార్యదర్శి, తెలంగాణ సాహిత్య అకాడమి, రవీంద్రభారతి ప్రాంగణం, హైదరాబాద్ 500004 అనే చిరునామాకు పంపాలి. 1. పద్యం / కవిత /గేయం 25 పంక్తులకు మించరాదు. 2. కథ ఎ4 సైజులో మూడు పుటలకు మించరాదు. 3. నాటిక ఎ4 సైజులో ఆరు పుటలకు మించరాదు. 4. విద్యార్థులు స్వీయ రాతతో ప్రతి పేజీకి 20 పంక్తులకంటే మించకుండా రాయాలి. 5. రచనపైన విద్యార్థి పేరు, పాఠశాల పేరు ఎటువంటి సమాచారం ఉండరాదు. కేవలం శీర్షిక మాత్రమే ఉండాలి. 6. దేశభక్తి, దేశ సమగ్రత, తెలంగాణ వైశిష్ట్యం, తెలంగాణ సంస్కృతి-సంప్రదాయాలు, పర్యావరణం – పచ్చదనం లాంటి అంశాలు తమ రచనలలో ఉండాలి. 7. విద్యార్థి రచన శీర్షిక, అది పద్యం / కవిత / గేయం, కథ, నాటికనో తెలుపుతూ, విద్యార్థి పూర్తి పేరు, తండ్రిపేరు, చదువుతున్న తరగతి మొదలైన వివరాలు పాఠశాల ప్రధానాచార్యులు ధృవీకరించే పత్రంలో మాత్రమే ఉండాలి. ఇందులో ధృవీకరిస్తున్న వారి ఫోన్ నంబర్, చిరునామా తప్పనిసరని తెలంగాణ సాహిత్య అకాడమి కార్యదర్శి ఒక ప్రకటనలో తెలియజేశారు.
————————————————————————————————————————————————————
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





