గాంధీభవన్ ముఖాముఖి కార్యక్రమానికి స్పందన
డిప్యూటీ సీఎం చొరవకు కృతజ్ఞతలు తెలిపిన ఆమె భర్త రామకృష్ణ
హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 5: హైదరాబాద్ నగరంలో మెడికల్ రిప్రజెంటేటివ్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్న పశ్చిమగోదావరి జిల్లా ఏలూరుకు చెందిన రామకృష్ణ భార్య ఉప ముఖ్యమంత్రి చొరవతో కేన్సర్ వ్యాధినుంచి బయటపడిరది. రామకృష్ణ భార్య క్యాన్సర్ లంప్‌తో బాధపడుతుండగా ఓ ప్రైవేటు కార్పొరేట్ ఆసుపత్రిలో చేర్పించారు. కొంతకాలం చికిత్స అనంతరం వారు వైద్య ఖర్చులు భరించలేని పరిస్థితి ఉండడంతో గాంధీభవన్‌లో మంత్రుల ముఖాముఖి కార్యక్రమం జరుగుతున్నదని తెలుసుకుని రామకృష్ణ కుమారుడు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లును కలిసి లిఖితపూర్వకంగా తన తల్లిదండ్రుల ఆవేదనను వివరించాడు. చలించిన డిప్యూటీ సీఎం భట్టి వెనువెంటనే లెటర్ ఆఫ్ క్రెడిట్(ఎల్‌ఓసీ) ఇచ్చి రామకృష్ణ భార్యకు వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. ఎప్పటికప్పుడు ఫాలో అప్ చేసి చెప్పాలని కూడా ఆదేశించారు. ఆ ఎల్‌ఓసీతో రామకృష్ణ తన భార్యకు ఐదుసార్లు కీమో థెరపీ చేయించ గలిగారు. కీమో అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించగా ఆమె క్యాన్సర్ మహమ్మారి నుంచి పూర్తిగా విముక్తి పొందినట్టు వైద్యులు నిర్ధారించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పందనతో తన కుటుంబం నిలబడిరదంటూ శనివారం సచివాలయంలో డిప్యూటీ సీఎంను కలిసి రామకృష్ణ కృతజ్ఞతలు తెలిపారు. క్యాన్సర్ ను విజయవంతంగా జయించిన ఆ కుటుంబానికి భట్టి విక్రమార్క అభినందనలు తెలియజేశారు.