( మండువ రవీందర్‌రావు,ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి )
జస్టీస్ పీసీ ఘోష్ కమిషన్‌ముందు మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు హాజరవుతారా లేదా అన్నదిప్పుడు రాష్ట్రంలో ప్రధాన చర్చనీయాంశంగా మారింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అనేక అవతవకలపై సుప్రీంకోర్టు మాజీ జస్టీస్ పీసీ ఘోష్ కమిటి గత ఏడాదిన్నరగా విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టగానే ఈ కమిషన్ ఏర్పాటు చేసింది. వాస్తవంగా 2023 శాసనసభ ఎన్నికల సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ వద్ద పిల్లర్లు పగులుడు చూపించడం రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారింది. లక్ష కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ ప్రాజెక్టు కుంగడానికి ఇక్కడ భారీ స్థాయిలో జరిగిన అవినీతే కారణమంటూ కాంగ్రెస్ ఎలుగెత్తి చాటటంతో బిఆర్‌ఎస్ అధికారం కోల్పోవడానికి కారణమైంది.
జస్టీస్ పీసీ ఘోష్ కమిషన్‌ముందు మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు హాజరవుతారా లేదా అన్నదిప్పుడు రాష్ట్రంలో ప్రధాన చర్చనీయాంశంగా మారింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అనేక అవతవకలపై సుప్రీంకోర్టు మాజీ జస్టీస్ పీసీ ఘోష్ కమిటి గత ఏడాదిన్నరగా విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టగానే ఈ కమిషన్ ఏర్పాటు చేసింది. వాస్తవంగా 2023 శాసనసభ ఎన్నికల సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ వద్ద పిల్లర్లు పగులుడు చూపించడం రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారింది. లక్ష కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ ప్రాజెక్టు కుంగడానికి ఇక్కడ భారీ స్థాయిలో జరిగిన అవినీతే కారణమంటూ కాంగ్రెస్ ఎలుగెత్తి చాటటంతో బిఆర్‌ఎస్ అధికారం కోల్పోవడానికి కారణమైంది.
అయితే ఈ అవినీతిపై నిగ్గుతేల్చాస్పిందేనంటూ కాంగ్రెస్ ప్రభుత్వం జస్టీస్ ఘోష్ నేతృత్వంలో విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. కాగా ఈ కమిటీ గత 14 నెలల కాలంలో ఈ ప్రాజెక్టుతో సంబంధమున్న ఇంజనీర్లు, కాంట్రాక్టర్లు, ఇతర అధికార సిబ్బందితో పాటు పలువురిని విచారిస్తూ వొచ్చింది. వాస్తవానికి ఈ నెల చివరి తేదీన తమ నివేదికను అందజేసేందుకు కమిషన్ సిద్దమైందంటేనే తన విచారణ పూర్తి అయిందన్న నిర్దారణకు వొచ్చినట్లే అవుతుంది. కాని, కమిషన్ కాలాన్ని ప్రభుత్వం మరోసారి పొడిగించింది. దీంతో ఇప్పటివరకు ఏడుసార్లు పొడిగిస్తూ వొస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాల్లో ముఖ్యులుగా భావిస్తున్నవారిని విచారించలేదంటూ వొస్తున్న ఆరోపణలదృష్ట్యా కమిషన్ ను మరో రెండు నెలల పాటు పొడిగించినట్లు తెలుస్తున్నది. కమిషన్ విచారణలో అధికారులు, ఇంజనీర్లనుంచి రాబట్టిన సమాధానాలను బట్టి ఆనాడు ముఖ్యులుగా భావిస్తున్న నాటి ముఖ్యమంత్రి కెసిఆర్, ఆనాటి అర్థికమంత్రి ఈటల రాజేందర్, నాటి ఇరిగేషన్‌శాఖ మంత్రి హరీష్‌రావు ను కూడా విచారించాలని కమిషన్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది.
దీంతో తాజాగా వారికి కమిషన్ నోటీసులను జారీచేసింది. వొచ్చేనెల జూన్ 5వ తేదీన కెసిఆర్, 6న హరీష్‌రావు, 9న ఈటల రాజేందర్‌లు వ్యక్తిగతంగా తమముందు హాజరుకావాలంటూ కమిషన్ నోటీసులు జారీచేసింది. అయితే ఇది ఖచ్చితంగా కక్ష్య సాధింపు చర్యేనని బిఆర్‌ఎస్ వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఈ నోటీసులపై ప్రధానంగా మాజీమంత్రి కెటిఆర్, ఎంఎల్సీ కల్వకుంట్ల కవిత రియాక్టు ఆయ్యారు. తెలంగాణ కోసం ప్రాణత్యాగానికి సిద్దపడినటువంటి వ్యక్తిపై కక్ష సాధింపుగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని వారు తీవ్రంగా దుయ్యబడుతున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వానికి పాలన చేతగాక, ఇచ్చిన హామీలను నెరవేర్చలేని పరిస్థితిలో ప్రజల దృష్టిని మరల్చే కుట్రలో భాగంగానే కెసిఆర్‌కు నోటీసులు జారీచేయడమని వారు తీవ్రంగా విమర్శిస్తున్నారు. కాళేశ్వరంలాంటి పరిణామాలు రాష్ట్రం లోపలు చోటుచేసుకున్నా ప్రభుత్వం వాటిని గాలికొదిలిన విషయాన్ని కెటిఆర్ గుర్తుచేస్తున్నారు. సుంకేసుల రిటైనింగ్‌వాల్ కూలిపోతే ఇప్పటివరకు దాని నిర్మాణ సంస్థలపై చర్యలు తీసుకోలేదు. పట్టెం పంపు హౌజ్ మునిగింది. పెద్దవాగు ప్రాజెక్టు ఇప్పటికీ రెండుసార్లు కొట్టుకుపోతే ఈ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఎస్‌ఎల్బీసి కూలి మూడునెలలైనా శవాలను బయటికి తీసుకు రాలేకపోయిన ఈ ప్రభుత్వం ఒక పిల్లర్ కుంగితే కమిషన్ వేసి నోటీసులుస్తున్నదంటూ ఆరోపిస్తున్నప్పటికీ, కమిషన్ ముందు కెసిఆర్ హాజరయ్యేది లేనిది ఆపార్టీ వర్గాలనుండి ఇప్పటివరకు ఎలాంటి సమాచారం లేదు.
కాని, ఈ నోటీసుల విషయం బహిరంగం కాగానే బిఆర్‌ఎస్‌లో కాస్తా ఆందోళన నెలకొన్న మాటమాత్రం వాస్తవం. హరీష్‌రావు వెంటనే ఎర్రవెల్లి ఫాంహౌజ్‌లో కెసిఆర్‌ను కలిసి ఈ సమస్యపై కూలంకశంగా చర్చించినట్లు తెలుస్తున్నది. కమిషన్ ముందు హాజరవుతే ఎదురయ్యే సమస్యేమిటి, అది లాభమా నష్టమాలాంటి విషయాలను బేరీజు వేసుకుంటున్నట్లు తెలుస్తున్నది. దీనిపై ఇప్పటికే న్యాయ కోవిదులతో చర్చిస్తున్నట్లు వార్తలు వొస్తున్నాయి. కమిషన్ ముందు హాజరు కాని పక్షంలో కాంగ్రెస్, బిజెపిలు దీన్ని రాజకీయంగా వాడుకునే అవకాశంకూడా లేకపోలేదు. నిజంగానే ఎలాంటి అవినీతి జరుగకపోతే కమిషన్ ముందు ఎందుకు హాజరుకాలేదని ఆ పార్టీలు ప్రశ్నించే అవకాశముంది.
అయితే గతంలో విద్యుత్ కొనుగోళ్లలో అవకతవకలు జరిగాయన్న విషయంపైన జస్టీస్ ఎల్. నరసింహారెడ్డి కమిషన్ విచారణ చేపట్టిన విషయం తెలియందికాదు. అనాడు కూడా నరసింహారెడ్డి కమిషన్ కెసిఆర్‌కు ఇలానే నోటీసు పంపింది. దానిపై కెసిఆర్ కోర్టులో సవాల్ చేయడం. కమిషన్ చైర్ పర్సన్ మార్పు తదితర విషయాలు చోటుచేసుకున్నాయి. ఏదిఏమైనా ఆరోజుకూడా కెసిఆర్ తన వివరణను లిఖిత పూర్వకంగానే అందజేయడమైంది. అయితే ఇప్పుడు కూడా అలానే జరుగుతుందా లేక నేరుగా హాజరవుతారా అన్న విషయం పైన రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతున్నది. ఈ విషయంలో ఈటల రాజేందర్ (బిజెపి)మాత్రం కమిషన్ ముందు హాజరవడానికి సిద్దంగా ఉన్నట్లు తెలుస్తున్నది.